రక్షణ మంత్రిత్వ శాఖ
‘‘అగ్నివీరులు ఒక్క సైనికులే కాకుండా ప్రేరకులు, అన్వేషకులు మరియు దేశసార్వభౌమత్వాన్ని రక్షించే వారు కూడా’’ అని పేర్కొన్న సిడిఎస్ జనరల్ శ్రీ అనిల్ చౌహాన్
మరాఠా రెజిమెంటల్ సెంటర్ మరియు ఎయర్‌మన్ ట్రేనింగ్స్కూల్, బెళగావి లో అగ్నివీర్ శిక్షణార్థులతో సమావేశమైన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్
Posted On:
20 MAY 2024 5:40PM by PIB Hyderabad
అగ్నివీరులు సైనికులు మాత్రమే కాక ప్రేరకులు, అన్వేశకులు మరియు దేశం యొక్క సార్వభౌమత్వాన్ని రక్షించే వారు కూడాను అని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) జనరల్ శ్రీ అనిల్ చౌహాన్ అన్నారు. 2024 మే 20వ తేదీ న మరాఠా రెజిమెంటల్ సెంటర్ మరియు ఎయర్ మెన్ ట్రేనింగ్ స్కూల్ (ఎటిఎస్), బెళగావి లో శిక్షణ పొందుతున్న అగ్నివీరులతో ఆయన సమావేశమైన సందర్భంలో ఆయన ఈ మాటలు అన్నారు.
సైన్య సేవ యొక్క పవిత్రమైన ఉద్దేశ్యాన్ని మరియు సైన్య స్వరూపం లో ఈ విభాగం పోషిస్తున్నటువంటి ప్రధాన భూమిక ను గురించి సిడిఎస్ స్పష్టం చేస్తూ, మరాఠా రెజిమెంటల్ సెంటర్ లో సాయుధ దళాల లో చేరినందుకు అగ్నివీరుల ను ప్రశంసించారు. అది దేశ ప్రజల పట్ల వారికి ఉన్న అసాధారణమైన కర్తవ్యానికి ప్రమాణం గా ఉంది అని ఆయన అన్నారు.
జవానులు మరియు వారి యొక్క కుటుంబసభ్యుల కు ఎదురయ్యే వ్యక్తిగత సవాళ్లు మరియు సవాళ్లతో నిండిన స్థితిగతుల లో కర్తవ్య నిర్వహణ కాలం లో తటస్థపడే బాధల ను సిడిఎస్ స్వీకరిస్తూ, విభిన్నమైనటువంటి సవాళ్లు ఎదురవుతూ ఉన్నప్పటికీ కూడా అగ్నివీరులకు సైన్య సేవ ఎక్కడలేని ప్రయోజనాల ను అందిస్తుందని, వారు వేసే ప్రతి ఒక్క అడుగు వారి వ్యక్తిగత జీవనాన్ని అభివృద్ధి లోకి తీసుకు పోతుందని మరి వారికి జాతి సేవ లో గర్వపడే అనుభూతి సొంతం అవుతుందని జనరల్ శ్రీ అనిల్ చౌహాన్ అన్నారు.
యుద్ధ తంత్రం తాలూకు స్వభావం అంతకంతకు పరిణామం చెందుతోంది అని సిడిఎస్ వివరిస్తూ, సైబర్ వార్‌ఫేర్, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్, అపరిమిత బెదరింపులు భవిష్యత్తు కాలం లో సంఘర్షణ తాలూకు జటిలత్వానికి మరియు అనిశ్చిత స్థితి కి తావు ఇస్తున్నాయి అని, ప్రస్తుతం ఇవి రణాంగణంలో విడదీయలేనటువంటి భాగం గా మారిపోయాయన్నారు. సాంకేతిక విజ్ఞానాన్ని మేళవించడం గురించి, నిరంతరాయం గా నేర్చుకొంటూ ఉండడం గురించి కూడా ఆయన మాట్లాడారు. అత్యంత తాజా ప్రగతి కి అనుగుణం గా కార్యాల ను నెరవేర్చడం కోసం పోరాటం విషయం లో క్రొత్త క్రొత్త మెలకువల ను ప్రదర్శించవలసిన అవసరం కూడా ఉంది అని ఆయన అన్నారు.
బెళగావి లోని ఎటిఎస్ ను సిడిఎస్ సందర్శించిన క్రమం లో, భారతీయ వాయు సేన (ఐఎఎఫ్) యొక్క అగ్నివీర్ వాయు శిక్షణ కార్యకలాపాలను గురించి తెలుసుకోవడం కోసం శిక్షణ సంస్థ ను కలియదిరిగారు. రక్షణ మంత్రిత్వ శాఖ (ఎమ్ఒడి) 2022 వ సంవత్సరం లో సవరించినటువంటి భర్తీ నమూనా కు అనుగుణం గా శిక్షణ ను పొందుతున్నటువంటి అగ్నివీర్ వాయు శిక్షణార్థుల మూడో బేచ్ తో ఆయన సమావేశమయ్యారు. అభ్యర్థులకు యుద్ధం యొక్క సవాళ్ల ను ఎదుర్కోవడం, సాంకేతికం గా చేయి తిరిగిన సైనికులు గా పేరు తెచ్చుకోవడానికి, భవిష్యత్తు యుద్ధ తంత్రాల సంబంధి సవాళ్ళను తట్టుకొని నిలబడగలగడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వండి అని వారికి ఆయన ఉద్బోధించారు.
నేర్చుకోవడం అనేది జీవన పర్యంతం కొనసాగుతూ ఉండేటటువంటి ప్రక్రియ, విశేషించి నిరంతరం మార్పుల కు లోనయ్యేటటువంటి యుద్ధ తంత్రాల రంగం లో నైపుణ్యాల ను అదే పని గా ఉన్నతీకరించుకోవడం లో స్వీయ బాధ్యత ను గుర్తించాలి; సాంకేతికం గా తీవ్రమైన ప్రావీణ్యాన్ని సాధించడం లో సర్వదా చిత్తశుద్ధి, శారీరక దృఢత్వం, క్రమశిక్షణ మరియు తరగని జట్టు స్ఫూర్తి ల వంటి విలువలను పెంచుకొంటూ ఉండండి అంటూ శిక్షణార్థులకు ఆయన సలహా ను ఇచ్చారు.
శిక్షణ యొక్క ప్రాముఖ్యాన్ని గురించి సిడిఎస్ ప్రముఖం గా పేర్కొంటూ, ఎటిఎస్ యొక్క శిక్షణ విభాగం మరియు మరాఠా రెజిమెంటల్ సెంటర్ ల ప్రయాసల ను ప్రశంసించారు. దేశం యొక్క నిర్వహణ శక్తి యుక్తుల ను ముందుకు తీసుకుపోవడం కోసం ఉత్కృష్ట ప్రయాసలను చేస్తూనే ఉండాలి అని వారిని ఆయన కోరారు.
**
(Release ID: 2021257)
Visitor Counter : 76