కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
పేరోల్ డేటా: 2024 మార్చి నెల లో మొత్తం 14.41 లక్షల మంది సభ్యుల ను చేర్చుకొన్న ఇపిఎఫ్ఒ
క్రొత్త గా 7.47 లక్షల మంది సభ్యులు 2024 మార్చి నెల లో వారి పేరుల ను ఇపిఎఫ్ఒ లో నమోదు చేయించుకొన్నారు
Posted On:
20 MAY 2024 6:49PM by PIB Hyderabad
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్ఒ) 2024 మే నెల 20 వ తేదీ నాడు విడుదల చేసిన తాత్కాలిక పేరోల్ డేటా నుండి ఇపిఎఫ్ఒ 2024 మార్చి నెల లో మొత్తం 14.41 లక్షల మంది సభ్యులను చేర్చుకొందని వెల్లడి అయింది.
క్రొత్త గా సుమారు 7.47 లక్షల మంది సభ్యుల ను 2024 మార్చి నెల లో చేర్చుకొన్నట్లు ఈ డేటా సూచిస్తున్నది. అటువంటి వారిలో ఎక్కువ గా 18 ఏళ్ళు మొదలుకొని 25 ఏళ్ళ వయోవర్గానికి చెందిన వారే ఉన్నారు; వీరు 2024 మార్చి నెల లో చేర్చుకొన్న మొత్తం నూతన సభ్యుల లో 56.83 శాతం గా ఉన్నారు; అంతేకాక సంఘటిత రంగం యొక్క శ్రమ శక్తి లో చేరిన వ్యక్తుల లో చాలా వరకు యువత యే, మరీ ముఖ్యం గా ఒకటో సారి నౌకరి ని దక్కించుకొన్న వారు ఉన్నారు అనేటటువంటి అంశాన్ని కూడా ఇది తెలియ జేస్తున్నది.
పేరోల్ డేటా తో వెల్లడి అయిందేమిటంటే సుమారు 11.80 లక్షల మంది సభ్యులు ఇపిఎఫ్ఒ నుండి బయటకు వెళ్ళిపోయారని, ఆ తరువాత మళ్లీ ఇపిఎఫ్ఒ లో చేరిపోయారు అనేదే. ఈ సభ్యులు వారు చేస్తున్న కొలువు ను మార్చుకొన్నారు, ఇంకా ఇపిఎఫ్ఒ పరిధి లో ఉన్నటువంటి సంస్థల లో తిరిగి భర్తీ అయ్యారనీనూ. వారు తుది పరిష్కారానికై దరఖాస్తు పెట్టుకొనేందుకు బదులుగా వారి యొక్క ఖాతాల లో పోగు పడిన సొమ్ము ను బదలీ చేసుకొనే ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకొన్నారు; ఈ విధం గా దీర్ఘకాలిక ఆర్థిక శ్రేయం పదిలం గా ఉండి వారి యొక్క సామాజిక భద్రత విస్తరణ కు లోనైంది అన్న మాట.
పురుషులు, మహిళల వారి గా పేరోల్ డేటా విశ్లేషణ ను పట్టి చూస్తే, నూతనం గా భర్తీ అయిన 7.47 లక్షల మంది సభ్యుల లో దాదాపు గా రెండు లక్షల మంది క్రొత్త గా వచ్చి చేరినటువంటి మహిళా సభ్యులు ఉన్నారు అని తేలింది. దీనికి తోడు, ఆ నెల లో జత పడినటువంటి మొత్తం మహిళా సభ్యుల సంఖ్య దాదాపు గా 2.90 లక్షలు గా ఉంది. మహిళా సభ్యులు క్రొత్త గా అనుబంధితులు కావడం అనేది వారు వివిధ ఉద్యోగాల లో చేరిన సంగతి ని తెలియపరుస్తున్నది.
పరిశ్రమ వారీ డేటా ను ఏ నెల కు ఆ నెల పద్ధతి న పరిశీలించినప్పుడు, తయారీ, మార్కెటింగ్, సేవ లు, కంప్యూటర్ ల వినియోగం, ఉపాహార శాల లు, చార్టర్డ్ అకౌంటెట్ లు లేదా రిజిస్టర్డ్ అకౌంటెంట్ లు, ఫిశ్ ప్రాసెసింగ్ మరియు మాంసాహార సంరక్షణ, బీడీ ల తయారీ వగైరా కార్యకలాపాల లో నిమగ్నం అయిన సంస్థల లో పనిచేస్తున్న సభ్యులలో వృద్ధి ఉన్నట్లు బయటపడింది. మొత్తం శుద్ధ సభ్యత్వాల లో నుండి, దాదాపుగా 43 శాతం వృద్ధి నిపుణుల సేవ ల రంగాని కి చెందిన (మానవ శక్తి సరఫరాదారు సంస్థ లు, సాధారణ గుత్తేదారు లు, సెక్యూరిటీ సర్వీసు లు ఇతరేతర కార్యకలాపాల వంటి) వాటి నుండి కలసినవి ఉన్నాయి.
పైన ప్రస్తావించిన పేరోల్ డేటా తాత్కాలికమే. అలా ఎందుకంటే డేటా సృజన తనంతట తాను నిరంతరం కొనసాగుతూ ఉండేటటువంటి కసరత్తు. ఉద్యోగుల రికార్డు ను అప్ డేట్ చేయడం అనేది ఎల్లప్పటికీ కొనసాగుతూ ఉండేటటువంటి ప్రక్రియ కదా. ఈ కారణం గా ఇదివరకటి డేటా ను ప్రతి నెల తాజా గా సవరించడం జరుగుతూ ఉంటుంది. 2018 వ సంవత్సరం ఏప్రిల్ నుండి, ఇపిఎఫ్ఒ 2017 సెప్టెంబరు తరువాతి కాలాన్ని కలుపుకొంటూ పేరోల్ డేటా ను విడుదల చేస్తూ వస్తున్నది. నెలవారీ పేరోల్ డేటా లో, ఆధార్ తో ప్రామాణీకరించిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యుఎఎన్) మాధ్యం ద్వారా ఒకటోసారి ఇపిఎఫ్ఒ లో చేరిన సభ్యుల సంఖ్యల ను, ఇపిఎఫ్ఒ యొక్క కవరేజి పరిధి లో నుండి బయటకు వెళ్లిపోయిన వర్తమాన సభ్యులు మరియు దీనిలో నుండి నిష్క్రమించినప్పటికీ సభ్యులు గా తిరిగి చేరిన వారిని పరిశీలించి వారిని శుద్ధ నెలవారీ పే రోల్ లో చేర్చడమైంది.
***
(Release ID: 2021212)
Visitor Counter : 117