భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

ఎన్నికల వేళ తనిఖీల్లో రూ.9 వేల కోట్లు దాటనున్న నగదు , ఇతర స్వాధీనాలు


ప్రలోభాలపై కమిషన్ కఠిన చర్యలతో చారిత్రక స్థాయిలో భారీగా స్వాధీనాలు

మాదకద్రవ్యాలపై ఇ సి ఐ పోరాటం; స్వాధీనాలలో 45% మాదకద్రవ్యాలే

ఇంటెలిజెన్స్ ఆధారిత సమన్వయ చర్య, నిరంతర సమీక్ష , ఇ ఎస్ ఎం ఎస్ ఆధారిత రియల్ టైమ్ పర్యవేక్షణ ఫలితంగా గతంలో లేనంతగా స్వాధీనాలు

Posted On: 18 MAY 2024 5:09PM by PIB Hyderabad

ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ధనబలం, ప్రలోభాల పట్ల ఎన్నికల సంఘం ధృఢ వైఖరితో వ్యవహరించడంతో ఇప్పటి దాకా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు రూ.8889 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. మాదకద్రవ్యాలుసైకోట్రోపిక్ పదార్ధాలతో సహా ప్రలోభాలకు వ్యతిరేకంగా పెరిగిన నిఘా భారీగా స్వాధీనాలకు, చర్యలకు,    నిరంతర పెరుగుదలకు దారితీసింది. స్వాధీనం చేసుకున్న వాటిలో మాదకద్రవ్యాలు అత్యధికంగా ఉన్నాయి. వ్యయ పర్యవేక్షణ, కచ్చితమైన డేటా ఇంటర్ ప్రిటేషన్, ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీల క్రియాశీలక భాగస్వామ్యం వంటి అంశాల్లో జిల్లాలు, ఏజెన్సీల క్రమం తప్పని తదుపరి చర్యలు, సమీక్షలతో మార్చి 1 నుంచి స్వాధీనాలు  గణనీయంగా పెరిగాయి. మాదకద్రవ్యాలు, మద్యం, విలువైన లోహాలు, బహుమతులు, నగదు స్వాధీనం చేసుకోవడం ఎన్నికలను వివిధ స్థాయిల్లో ప్రభావితం చేస్తుంది, కొన్ని ప్రలోభాలుగా నేరుగానూ, మరికొన్ని డబ్బు చలామణి స్థాయిలను తగ్గించడం ద్వారానూ ప్రభావితం చేస్తాయి. తద్వారా చట్టవ్యతిరేక కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాజకీయ ప్రచారాలతో ముడిపెట్టడంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. (అనుబంధం లో వివరణాత్మక నివేదిక.)

నార్కోటిక్స్, సైకోట్రోపిక్ పదార్థాలను స్వాధీనం చేసుకోవడంపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ట్రాన్సిట్ జోన్లుగా ఉన్న రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు వినియోగ ప్రాంతాలుగా మారుతున్నట్లు డేటా విశ్లేషణలో తేలింది. ఒక సమీక్షా పర్యటనలో నోడల్ ఏజెన్సీలను ఉద్దేశించి ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, "ఎన్నికల్లో మాదకద్రవ్యాల వ్యాపార మురికి సొమ్ము పాత్రను రూపుమాపడానికి , యువత భవిష్యత్తును, దేశ భవిష్యత్ ను రక్షించడానికి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ఏజెన్సీల ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారిత సహకార ప్రయత్నాలు అవసరం" అన్నారు. మాదకద్రవ్యాల స్వాధీనం వాటా రూ. 3958 కోట్లు, ఇది మొత్తం స్వాధీనాలలో 45%.

ఎన్నికల కమిషనర్లు  జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు లతో పాటు సిఇసి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని కమిషన్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్ సి బి) డీజీతో సమావేశాలు జరిపి ఎన్ సి బి కి చెందిన ప్రత్యేక నోడల్ అధికారులు విశ్లేషణ-ఆధారిత క్రియాశీల చర్య తీసుకునేలా ఏర్పాటు ఎర్పాటు చేశారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో డీఆర్ఐ, ఇండియన్ కోస్ట్ గార్డ్, రాష్ట్ర పోలీసులు, ఇతర ఏజెన్సీల క్రియాశీలక భాగస్వామ్యం ఉండేలా చూసుకున్నారు చర్యలన్నీ ఎన్నికల ప్రకటన తర్వాత రెండు నెలల్లో గణనీయమైన స్వాధీనాలకు దారితీశాయి.

గత మూడు దశల్లో ప్రచారం జోరు  పెరుగుతుండటంతో ప్రలోభాల ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలను నిశితంగా గమనిస్తున్న ఎన్నికల సంఘం నిఘా పెంచాలని సీఈవోలు, ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలను ఆదేశించింది. మాదకద్రవ్యాలు, ఇతర ప్రలోభాలకు వ్యతిరేకంగా కమిషన్ చేపట్టిన పోరాటం కొనసాగుతోంది.

గుజరాత్ ఏటీఎస్, ఎన్సీబీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్త ఆపరేషన్లలో కేవలం మూడు రోజుల్లో రూ.892 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

 ఆపరేషన్  1: (స్వాదీనాలురూ 602 కోట్లు )

 గుజరాత్ లోని పోర్ బందర్ తీరానికి 180 నాటికల్ మైళ్ల దూరంలో భారత జలాల్లో 14 మంది సిబ్బందితో వెళ్తున్న 'అల్రాజా' అనే అనుమానాస్పద పాకిస్థానీ పడవను సంయుక్త బలగాలు గుర్తించి అడ్డుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.602 కోట్ల విలువైన సుమారు 86 కిలోల హెరాయిన్ ఉన్నట్టు అనుమానిస్తున్న 78 బాక్సుల నిషేధిత గంజాయిని గుజరాత్ ఏటీఎస్, న్యూఢిల్లీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఆపరేషన్స్) సంయుక్త బృందం స్వాధీనం చేసుకుంది. తదుపరి చట్టపరమైన ప్రక్రియల కోసం బోటు, సిబ్బందిని పోర్ బందర్ కు తీసుకొచ్చారు.

 ఇండియన్ కోస్ట్ గార్డ్ , గుజరాత్ ఎ టి ఎస్ పట్టుకున్న డ్రగ్స్ నౌక

 ఆపరేషన్ 2: ( స్వాధీనాలు  -Rs 230 crores)

 రాజస్థాన్, గుజరాత్ లోని యూనిట్లు మెఫెడ్రోన్ వంటి సైకోట్రోపిక్ పదార్థాల అక్రమ తయారీలో పాల్గొంటున్నాయని ఏటీఎస్ గుజరాత్ కు అందిన నిఘా సమాచారం ఆధారంగా ఆపరేషన్ నిర్వహించారు. గుజరాత్ ఎటిఎస్ , ఎన్సిబి (ఆపరేషన్స్) ఢిల్లీ సంయుక్త బృందాలు 2024 ఏప్రిల్ 27 గుజరాత్ లోని అమ్రేలిగాంధీనగర్, రాజస్థాన్ లోని సిరోహిజోధ్ పూర్ లలో ఏకకాలంలో దాడులు నిర్వహించాయిఎన్డిపిఎస్ చట్టం కింద మెఫెడ్రోన్ అనే సైకోట్రోపిక్ పదార్ధం తయారితో సంబంధం ఉన్న చట్ట విరుద్ధ  యూనిట్లను స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పటి వరకు 10 మందిని అదుపులోకి తీసుకుని మొత్తం 22 కిలోల మెఫెడ్రోన్ పౌడర్, 124 లీటర్ల మెఫెడ్రోన్ లిక్విడ్ రూపంలో స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సైకోట్రోపిక్ పదార్థమైన మెఫెడ్రోన్ మొత్తం విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.230 కోట్లు ఉంటుందని అంచనా.

 ఆపరేషన్- 3: ( స్వాధీనాల విలువ రూ  60 కోట్లు )

 29-04-2024 రూ.60.5 కోట్ల విలువైన 173 కిలోల గంజాయిని గుజరాత్ ఏటీసీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, ఎన్సీబీ స్వాధీనం చేసుకున్నాయి.

 గుజరాత్ ఏటీఎస్, ఎన్సీబీ సంయుక్త ఆపరేషన్ లో గుజరాత్ లో డ్రగ్ ఫ్యాక్టరీ గుట్టు రట్టయింది.

 

ఎన్నికలు మాదకద్రవ్యాల బెడదకు వ్యతిరేకంగా వరుస లక్షిత చర్యలకు సాక్ష్యంగా నిలిచాయి. గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. 17.04.2024 నోయిడా పోలీసులు గ్రేటర్ నోయిడాలోని డ్రగ్ ఫ్యాక్టరీపై దాడి చేశారు, ఇందులో రూ .150 కోట్ల విలువైన 26.7 కిలోల ఎండిఎంఎ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. విదేశీ సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇతర స్వాధీన వస్తువుల విలువ కూడా గణనీయంగానే ఉంది. అంతేగాక 2019 పార్లమెంటరీ ఎన్నికల నాటి  మొత్తం స్వాధీనాలను పెద్ద తేడాతో అధిగమించాయి. ఖచ్చితమైన, సమగ్రమైన ప్రణాళిక ఇందుకు పునాదిగా నిలిచింది.

ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం ( ఎస్ ఎం ఎస్) అనే అంతర్గత యాప్ కింద నిరోధం, స్వాధీనం పై రియల్ టైం రిపోర్టింగ్ చేయడం వల్ల వ్యయ పర్యవేక్షణపై త్వరితగతిన, క్రమం తప్పకుండా, ఖచ్చితమైన సమీక్షలకు వీలైంది. వీటితో పాటు పార్లమెంట్ నియోజకవర్గాలకు నియమితులైన 656 మంది వ్యయ పరిశీలకులు, మరో 125 మంది వ్యయ పరిశీలకులు కూడా చెక్ పోస్టులు, క్షేత్రస్థాయి బృందాల పనితీరును పర్యవేక్షణ ప్రక్రియలో పౌరులకు అసౌకర్యం కలగకుండా చురుగ్గా పర్యవేక్షిస్తున్నారు. వ్యయ సున్నిత నియోజకవర్గాలుగా గుర్తించిన 123 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మరింత నిఘా ఉంచారు.

నేపథ్యం

ఏజెన్సీలను ప్రేరేపించేక్రియాశీల ఇంటర్ఫేస్ ను కలిగి ఉన్న ప్రక్రియ 2023 చివరి త్రైమాసికంలో పూర్తి స్థాయిలో ప్రారంభమైంది.క్యాలెండర్ ఇయర్ మొదటి రెండు నెలల్లో ఇప్పటికే రూ.6760 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి, ఇది ఓటర్లను ప్రభావితం చేసే విధమైన ప్రలోభాలను ఎంతమాత్రం ఉపేక్షించని  'జీరో టాలరెన్స్' విధానాన్ని కమిషన్ కలిగి ఉందనే సందేశాన్ని ఇచ్చింది.

 

క్యాలెండర్ ఇయర్ మొదటి రెండు నెలల్లో ఇప్పటికే రూ.6760 కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి, ఇది ఓటర్లను ప్రభావితం చేసే విధమైన ప్రలోభాలకు కమిషన్ 'జీరో టాలరెన్స్' విధానాన్ని కలిగి ఉందనే సందేశాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) అమలు సమయంలో మాదకద్రవ్యాల ప్రలోభాన్ని కట్టుదిట్టంగా అరికట్టాలనే కమిషన్ నిబద్ధత గత రెండు సంవత్సరాలుగా ఊపందుకుంది. పైన పేర్కొన్న విధంగా ఇటీవల జరిగిన స్వాధీనాలతో పాటు, గత రెండు సంవత్సరాలలో  కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు సమయంలో కూడా భారీగా నగదు, వస్తు, డ్రగ్స్ స్వాధీనాలు జరిగాయి. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక, భాగస్వామ్య, హింస అనే అర్థంతో పాటు, గుణాత్మక ఎన్నికల ప్రక్రియలో " ప్రలోభ రహిత" కోణాన్ని కూడా అధిక ప్రాధాన్యతగా చేర్చారు.

అనుబంధం-

ప్రింట్ తేదీ: 18.05.2024 04:37 pm

ఫిల్టర్ తేదీ: 01-03-2024 నుండి 18-05-2024 వరకు

 వరస నెం.

 రాష్ట్రం

నగదు(రూకోట్లు)

మద్యం ( లీటర్లలో

మద్యం విలువ (రూ కోట్లు)

 డ్రగ్స్

విలువ (రూ కోట్లు )

విలువైన లోహం విలువ (రూ కోట్లు)

ఉచితాలు/ ఇతర  వస్తువుల విలువ (రూకోట్లు )

 మొత్తం (రూ కోట్లు)

Crore

1

అండమాన్ అండ్ నికో బార్

0.30

3869.25

0.16

2.09

0.00

0.00

2.56

2

ఆంధ్రప్రదేశ్

85.32

1364654.36

43.17

5.70

142.56

25.01

301.75

3

అరుణాచల్ ప్రదేశ్

9.95

161750.06

2.98

0.83

2.64

0.77

17.17

4

 అస్సాం

6.63

2756357.91

26.80

99.32

45.11

32.55

210.41

5

 బీహార్

14.03

1594343.81

48.02

51.00

19.80

101.94

234.79

6

చండీ ఘర్

0.76

41005.97

1.31

2.64

0.53

0.00

5.24

7

ఛత్తీస్ ఘడ్

14.88

79795.28

2.14

18.52

2.66

37.64

75.85

8

డిడి&. ఎన్ హెచ్

0.61

14702.77

0.35

0.00

0.00

0.14

1.09

9

 గోవా

15.93

154139.80

4.91

3.66

3.79

1.70

29.99

10

 గుజరాత్

8.61

1009108.73

29.76

1187.80

128.56

107.00

1461.73

11

 హర్యానా

14.30

397592.22

13.11

13.43

16.58

3.21

60.64

12

హిమాచల్ ప్రదేశ్

0.50

686526.56

10.68

3.88

0.09

0.29

15.45

13

జమ్ము అండ్ కాశ్మీర్

1.42

40685.52

1.11

3.61

0.00

0.12

6.26

14

ఝార్ఖండ్

45.53

278417.87

4.13

56.06

0.69

13.17

119.58

15

 కర్ణాటక

92.55

14729899.23

175.36

29.84

94.66

162.01

554.41

16

 కేరళ

15.66

83979.20

3.63

45.82

26.83

5.69

97.62

17

 లడఖ్

0.00

349.33

0.02

0.00

0.00

0.09

0.11

18

 లక్షద్వీప్

0.00

47.55

0.02

0.06

0.00

0.00

0.07

19

మధ్యప్రదేశ్ .

21.42

3637081.78

46.74

42.71

14.12

177.45

302.44

20

మహా రాష్ట్ర

75.49

6219453.03

49.17

265.51

188.18

107.46

685.81

21

మణిపూర్

0.02

53487.59

0.63

34.03

5.01

9.15

48.84

22

మేఘాలయl

0.50

53651.25

0.85

40.96

0.00

11.93

54.25

23

మిజో రామ్

0.11

156464.51

5.04

58.58

0.00

14.99

78.72

24

NCT OF Delhi

90.79

122804.47

2.64

358.42

195.01

6.46

653.31

25

నాగాలాండ్

0.00

28476.56

0.31

3.00

0.00

5.44

8.75

26

 ఒడిశా

17.18

3130148.43

35.84

74.46

14.35

113.00

254.84

27

పుదుచ్చేరి

1.39

1562.60

0.03

0.00

0.00

0.00

1.42

28

 పంజాబ్

15.45

3370446.70

22.62

665.67

23.75

7.04

734.54

29

రాజస్థాన్

42.30

4484546.11

48.29

216.42

70.04

756.77

1133.82

30

 సిక్కిం

0.36

8451.51

0.17

0.01

0.00

0.00

0.54

 

 

వరస నెం

 రాష్ట్రం

నగదు(రూకోట్లు).

మద్యం ( లీటర్లలో)

మద్యం విలువ (రూ కోట్లు)

డ్రగ్స్ విలువ ( రూ కోట్లలో)

విలువైన లోహా లు విలువ (రూ కోట్లలో)

ఉచి తాలు/ ఇతర వస్తువులు విలువ (రూ కోట్లు))

Total (Rs.

Crore)

31

తమిళనాడు 

69.59

814379.70

8.17

330.91

99.85

35.21

543.72

32

తెలం గాణ

114.41

3001263.62

76.26

29.31

77.23

36.34

333.55

33

 త్రిపుర

1.01

180312.29

2.90

28.31

1.28

3.69

37.19

34

ఉత్తర ప్రదేశ్.

34.44

1727918.63

53.62

234.79

22.94

80.45

426.24

35

ఉత్తరా ఖండ్

6.45

78693.33

3.46

11.86

3.26

0.31

25.34

36

వెస్ట్    బెంగాల్

31.27

3507825.90

90.42

39.65

60.81

149.53

371.69

 మొత్తం (రూ కోట్ల లో)

 

849.15

53974193.43

814.85

3958.85

1260.33

2006.56

8889.74

 గ్రాండ్ టోటల్ ( కోట్లు): 8889.74

***


(Release ID: 2021209) Visitor Counter : 84