ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కాయలను ముగ్గపెట్టడంలో కాల్షియం కార్బైడ్ ను ఉపయోగించకుండా విధించిన నిషేధాన్ని పాటించాలని పండ్ల వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
Posted On:
18 MAY 2024 6:28PM by PIB Hyderabad
పండ్లను కృత్రిమంగా ముగ్గ పెట్టడానికి కాల్షియం కార్బైడ్ ను ఉపయోగించకుండా విధించిన నిషేధాన్ని ఖచ్చితంగా పాటించాలని వ్యాపారులు / పండ్ల సరఫరాదారులు / ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు (ఎఫ్బిఓ) లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశాలు జారీ చేసింది.కృత్రిమంగా కాయలను మగ్గ పెట్టడానికి ప్రత్యేక చాంబర్లు నిర్వహిస్తున్న వ్యాపారులు / పండ్ల సరఫరాదారులు / ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు ప్రస్తుత మామిడి పళ్ళ కాలంలో ఉత్తర్వులు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఎఫ్ఎస్ఎస్ చట్టం, 2006 , కాలానుగుణంగా జారీ అయిన నియమ నిబంధనల ప్రకారం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల ఆహార భద్రతా విభాగాలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచనలు జారీ చేసింది.
మామిడి వంటి కాయలను కృత్రిమంగా పళ్ళుగా మగ్గించడానికి కాల్షియం కార్బైడ్ ను సాధారణంగా ఉపయోగిస్తారు. ఆర్సెనిక్, భాస్వరం లాంటి హాని కలిగించే ఎసిటిలిన్ వాయువును కాల్షియం కార్బైడ్ విడుదల చేస్తుంది. 'మసాలా' అని కూడా పిలువబడే ఈ పదార్థాలు మైకం , తరచుగా దాహం, చికాకు, బలహీనత, మింగడంలో ఇబ్బంది, వాంతులు, చర్మపు పుండ్లు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి.అదనంగా, ఎసిటిలిన్ వాయువు ఉపయోగించేవారికి కూడా హాని కలిగిస్తుంది. ఉపయోగించే సమయంలో పండ్లపై కాల్షియం కార్బైడ్ పేరుకు పోయే ప్రమాదం ఉంది. పళ్ళపై ఆర్సెనిక్, భాస్వరం అవశేషాలు పేరుకు పోతాయి.
ఈ ప్రమాదాల కారణంగా, కాయలను కృత్రిమంగా మగ్గించడానికి కాల్షియం కార్బైడ్ వాడకాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (అమ్మకాలపై నిషేధం మరియు ఆంక్షలు) రెగ్యులేషన్స్, 2011 లోని రెగ్యులేషన్ 2.3.5 ప్రకారం నిషేధించారు. "సాధారణంగా కార్బైడ్ వాయువు అని పిలువబడే ఎసిటిలిన్ వాయువును ఉపయోగించి కృత్రిమంగా పండించిన పండ్లను ఏ వ్యక్తి తన ఆవరణలో విక్రయించడానికి లేదా అమ్మకానికి లేదా బహిరంగంగా ఉంచ రాదు " అని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
నిషేధిత కాల్షియం కార్బైడ్ విచ్చలవిడిగా వాడుతున్న అంశాన్ని గుర్తించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ భారతదేశంలో పండ్లను మగ్గించడానికి సురక్షితమైన ప్రత్యామ్నాయంగా ఇథిలిన్ వాయువును ఉపయోగించడానికి అనుమతించింది. పంట, రకం , పరిపక్వతను బట్టి ఇథిలీన్ వాయువును 100 పిపిఎమ్ (100 μl/L) వరకు సాంద్రత వద్ద ఉపయోగించవచ్చు. పండ్లలో సహజంగా సంభవించే ఇథిలీన్ అనే హార్మోన్ అనేక రసాయన, జీవ రసాయన చర్యల శ్రేణిని ప్రారంభించడం, నియంత్రించడం ద్వారా పండించే ప్రక్రియను నియంత్రిస్తుంది.
పండు గణనీయమైన పరిమాణంలో ఇథిలీన్ ను విడుదల చేయడానికి కాయలపై ఉపయోగించే ఇథిలీన్ వాయువు సహజ పక్వ ప్రక్రియకు దోహద పడుతుంది.
అలాగే, మామిడి, ఇతర పళ్ళను ఏకరీతిగా మగ్గించడానికి సెంట్రల్ ఇన్ సెక్టిసైడ్స్ బోర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ కమిటీ (సిఐబి ఆర్సి) ఎథెఫోన్ 39% ఎస్ఎల్ ను ఆమోదించింది.
"పండ్లను కృత్రిమంగా పండించడం - ఇథిలిన్ వాయువు సురక్షితమైన పండ్ల మాగబెట్టడం" (https://www.fssai.gov.in/upload/uploadfiles/files/Guidance_Note_Ver2_Artificial_Ripening_Fruits_03_01_2019_Revised_10_02_2020.pdf) అనే శీర్షికతో ఎఫ్ఎస్ఎస్ఎఐ ఒక సమగ్ర మార్గదర్శక పత్రాన్ని ప్రచురించింది, పండ్లను కృత్రిమంగా పండించే విధానాన్ని అనుసరించాలని పళ్ళ వ్యాపారులకు ఆదేశాలు సూచనలు జారీ చేసింది.
ఇథిలీన్ వాయువు ద్వారా పండ్లను కృత్రిమంగా మగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలు,. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపి)ను ఈ పత్రంలో పొందుపరిచారు ఆంక్షలు, ఇథిలీన్ ఉపయోగించే విధానం / ఛాంబర్ అవసరాలు, నిర్వహణ పద్ధతులు , ఇథిలీన్ వాయువు వనరులు, వివిధ వనరుల ద్వారా ఇథిలీన్ వాయువును ఉపయోగించడానికి అమలులో ఉన్న నిబంధనలు భద్రతా మార్గదర్శకాలు మొదలైన అంశాలను ఈ పత్రంలో వివరించారు.
కాల్షియం కార్బైడ్ వాడకం లేదా పండ్లను కృత్రిమంగా మాగ పెట్టడానికి వ్యాపారస్తులు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్టు వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులు పరిశీలించి ఉల్లంఘన దారులపై సంబంధిత రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ఫుడ్ సేఫ్టీ కమిషనర్ల వివరాలు ఈ క్రింది లింక్ లో అందుబాటులో ఉన్నాయి: https://www.fssai.gov.in/cms/commissioners-of-food-safety.php
***
(Release ID: 2021123)
Visitor Counter : 148
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Hindi_MP
,
Marathi
,
Hindi_MP
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil