కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఐటియు ఏరియా ఆఫీస్, ఇన్నోవేషన్ సెంటర్‌తో కలిసి ఎన్టీఐపిఆర్ఐటి, “బ్రిడ్జింగ్ ది స్టాండర్డైజేషన్ గ్యాప్” అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్‌ నిర్వహణ .


ప్రపంచ టెలికాం ప్రమాణాలకు జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి ఐటియు 'బ్రిడ్జింగ్ ది స్టాండర్డైజేషన్ గ్యాప్ ప్రోగ్రామ్'పై వర్క్‌షాప్ ప్రధాన దృష్టి

వర్క్‌షాప్ వివిధ పరిశ్రమలలో ఇంటర్‌ఆపరేబిలిటీ, ఇన్నోవేషన్, నిరాఘాటంగా కమ్యూనికేషన్‌ను నిర్ధారించడంలో గ్లోబల్ ప్రమాణాల కీలక పాత్ర

Posted On: 17 MAY 2024 12:27PM by PIB Hyderabad

సహకార ప్రమాణ-నిర్ధారణ ప్రక్రియల ప్రాముఖ్యత, ప్రపంచ ఐసీటీ ప్రామాణీకరణ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయడానికి భారతదేశం అనేక  క్రియాశీల చర్యలను తీసుకుంటోంది. ఈ అంశాలపై చర్చించడానికి, 2024 మే 15, 16వ తేదీల్లో ఘజియాబాద్‌లోని  ఎన్టీఐపిఆర్ఐటిలో “బ్రిడ్జింగ్ ది స్టాండర్డైజేషన్ గ్యాప్” అనే అంశంపై రెండు రోజుల వర్క్‌షాప్ జరిగింది. నేషనల్ టెలికమ్యూనికేషన్స్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాలసీ రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ట్రైనింగ్ (ఎన్టీఐపిఆర్ఐటి), డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయ) ఏరియా ఆఫీస్, న్యూ ఢిల్లీలోని ఇన్నోవేషన్ సెంటర్ సహకారంతో ఈ వర్క్‌షాప్ నిర్వహించారు. 

ఈ కార్యక్రమాన్ని టెలికాం శాఖ, డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ మెంబర్ (టెక్నాలజీ) శ్రీమతి మధు అరోరా ప్రారంభించారు. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్), టెలికాం ఇంజనీరింగ్ సెంటర్, స్టార్ట్-అప్‌లతో సహా డాట్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఫీల్డ్ యూనిట్ల అధికారులు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు.

 

భవిష్యత్ సాంకేతికతలను రూపొందించడానికి, ఆర్థిక వృద్ధికి ఊతం ఇవ్వడానికి, డిజిటల్ విభజనను తగ్గించడానికి ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా చర్చించారు. గ్లోబల్ ఇంటర్‌ఆపరేబిలిటీని నిర్ధారించడానికి, భద్రతను మెరుగుపరచడానికి, సహకారాన్ని పెంపొందించడానికి దేశాన్ని సర్వ సన్నద్ధం చేయడానికి అవసరమైన టెలికాం ప్రమాణాల రైటింగ్ నైపుణ్యాలను అభివృద్ధి పరచడం ఈ వర్క్‌షాప్ లక్ష్యం.

ఈ సందర్బంగా శ్రీమతి  మధు అరోరా మాట్లాడుతూ,  డిజిటల్ ఈక్విటీ, సాంకేతిక పురోగతిని సాధించడంలో ప్రామాణీకరణ కీలక పాత్రను నొక్కి చెప్పారు. ఎన్టీఐపిఆర్ఐటి డైరెక్టర్ జనరల్ శ్రీ దేబ్ కుమార్ చక్రబర్తి,  వివిధ పరిశ్రమలలో ఇంటర్‌ఆపరేబిలిటీ, ఇన్నోవేషన్, నిరంతరాయ కమ్యూనికేషన్‌ను నిర్ధారించడంలో గ్లోబల్ ప్రమాణాల కీలక పాత్రను వివరించారు. ఐటియు స్టడీ గ్రూప్ కౌన్సెలర్ మార్టిన్ అడాల్ఫ్, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ ప్రమాణాలపై డ్రాఫ్టింగ్, ఏకాభిప్రాయాన్ని సాధించే ప్రక్రియలపై అంతర్దృష్టులను అందించారు.

 

పారస్పరిక చర్చలు, శిక్షణ సమావేశ కాలంలో  ఐటియు-టి  ప్రామాణీకరణ  ప్రయత్నాలలో పాల్గొనడం నుండి వాటి మధ్య ఉన్న అంతరాలను తగ్గించే కార్యక్రమంపై వివరణాత్మక శిక్షణ వరకు అనేక రకాల అంశాలను చర్చించారు. శ్రీమతి మే థి ఏ, మార్టిన్ అడాల్ఫ్‌తో సహా ఐటియు నిపుణులు ఈ సెషన్‌లో పాల్గొన్నారు.

 

ముగింపు సెషన్‌లో ఐటియు ఏరియా ఆఫీస్ సీనియర్ అడ్వైజర్ శ్రీ ఆర్ శక్య,  ఎన్టీఐపిఆర్ఐటి, డీడీజి (ఐసిటి) శ్రీ అతుల్ సిన్హా భారతదేశం అక్టోబర్ 15-24, 2024 నుండి నిర్వహించనున్న వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ (డబ్ల్యూటిఎస్ఏ) సన్నాహక కార్యకలాపాలలో భాగమని పేర్కొన్నారు. ఇది రాబోయే డబ్ల్యూటిఎస్ఏ-2024లో భారతీయ నిపుణుల మెరుగైన భాగస్వామ్యానికి వేదికను నిర్దేశిస్తుంది, ఇది ప్రపంచ టెలికమ్యూనికేషన్స్ పాలసీ రంగంలో అగ్రగామిగా ఉండాలనే భారతదేశ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

***


(Release ID: 2021095) Visitor Counter : 77