ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

స్వచ్ఛత పఖ్‌వాడా ను ప్రారంభించిన ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ

Posted On: 16 MAY 2024 4:58PM by PIB Hyderabad

స్వచ్ఛత ను మరియు పర్యావరణ సంబంధి స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశ లో ఈశాన్య ప్రాంత అభివృద్ధి యొక్క మంత్రిత్వ శాఖ (ఎమ్‌డిఒఎన్ఇఆర్) ఒక ముఖ్యమైన చర్య ను చేపట్టింది; ‘స్వచ్ఛత పఖ్‌వాడా’ ను ప్రారంభించింది. ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ (ఎనెక్సీ) లో మొదలైన ఈ కార్యక్రమం పదిహేను రోజు ల పాటు అంటే 2024 మే 16వ తేదీ నుండి 2024 మే 31 వ తేదీ వరకు జరుగనుంది.

 

 

ప్రారంభ కార్యక్రమం లో భాగం గా ఎమ్‌డిఒఎన్ఇఆర్ బృందం ‘స్వచ్ఛత ప్రతిజ్ఞ’ ను స్వీకరించింది. స్వచ్ఛత సంబంధి కార్యక్రమాల అమలు దిశ లో నిబద్ధులమై ఉంటామని పునరుద్ఘాటించడం తో పాటు స్వచ్ఛ్ భారత్ మిశన్ యొక్క సందేశాన్ని వ్యాప్తి చేస్తాం అని వారు పేర్కొన్నారు. ఎమ్‌డిఒఎన్ఇఆర్ యొక్క కార్యదర్శి నాయకత్వం లో జరిగిన ప్రతిజ్ఞ స్వీకరణ కార్యక్రమం జీవనం లోని అన్ని దశల లోను అత్యుత్తమమైన స్వచ్ఛత అభ్యాసాల ను ఆచరణ లో పెట్టడానికి ప్రాముఖ్యాన్ని కట్టబెట్టింది.

 

 

 

ఎమ్‌డిఒఎన్ఇఆర్ యొక్క కార్యదర్శి ప్రసంగిస్తూ, స్వచ్ఛత కార్యక్రమాల ను ఏడాది పొడవున కొనసాగించడాని కి పెద్ద పీట ను వేయాలి అని స్పష్టంచేశారు. సిబ్బంది అంతా చురుకు గా పాలుపంచుకోవాలని, మరి పరిసరాల లో పరిశుభ్రత పట్ల సంవత్సరమంతా కూడాను చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

 

 

స్వచ్ఛత పక్షోత్సవం (స్వచ్ఛత పఖ్ వాడా) లో భాగం గా, వేరు వేరు కార్యకలాపాల ను అమలుపరుస్తారు. ఆ యా కార్యక్రమాల లో పర్యావరణ మిత్రపూర్వకమైన కార్యక్రమాల ను గురించిన అవగాహన ను సముదాయం లో ఏర్పరచడం, ప్లాస్టిక్ పదార్థాల వినియోగాన్ని వదలుకొనేటట్లు గా చూడడం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, మొక్కల పెంపకం కార్యక్రమం తో పాటు గా వీధి నాటికల వంటివి చేపట్టడం జరుగుతుంది.

 

 

పక్షోత్సవం నిర్వహణ కాలం లో ఎమ్‌డిఒఎన్ఇఆర్ మరియు తత్సంబంధి సంస్థ లు కార్యాలయం యొక్క ఆవరణ లో, చుట్టుప్రక్కల ప్రాంతాల లో స్వచ్ఛత తనిఖీల ను క్రమం తప్పక నిర్వహించడం మరియు దానికి సంబంధించిన రికార్డు ను నిర్వహించడం చేస్తాయి. దీనికి అదనం గా, విజ్ఞాన్ భవన్ (ఎనెక్సీ) లో మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల లో స్వచ్ఛత పరిరక్షణ కోసం స్వచ్ఛత సంబంధి కార్యక్రమాలను మరియు శ్రమ దానాన్ని నిర్వహించనున్నారు.

 

 

స్వచ్ఛ్ భారత్ అభియాన్ ను గురించి ప్రచారం చేయడం లో ఒక్క సంస్థ లోపలే కాకుండా, విశాలమైన సముదాయం లో ఎమ్‌డిఒఎన్ఇఆర్ ముందడుగు వేయడాన్ని ‘స్వచ్ఛత పఖ్‌వాడా’ ప్రతిబింబిస్తున్నది.

 

 

 

 

 

 

**

 



(Release ID: 2020814) Visitor Counter : 98