రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

నేశనల్ హైవే కాంట్రాక్టుల లో ఇన్ శువరన్స్  శ్యుర్టి బాండ్ ల అమలు అంశం పై కార్యశాల ను నిర్వహించినఎన్‌హెచ్ఎఐ 

Posted On: 15 MAY 2024 6:11PM by PIB Hyderabad

నేశనల్ హైవేస్ ఆథారిటి ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఎఐ) తన కాంట్రాక్టు ల కోసం ఇన్ శువరన్స్ శ్యుర్టి బాండ్స్ (ఐఎస్‌బి) ని అమలుపరచే అంశం పై ఒక వర్క్ శాపు ను న్యూ ఢిల్లీ లో నిర్వహించింది. ఐఎస్‌బి ల అమలు లో నమైదు అయిన పురోగతి ని సమీక్షించడం తో పాటు ఆ బాండ్ లను విస్తృతం గా స్వీకరించడం కోసం స్టేక్ హోల్డర్స్ లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ కార్యశాల యొక్క ధ్యేయాలు గా ఉన్నాయి. ఈ వర్క్ శాప్ ను ఉద్దేశించి శ్రీ రాజేంద్ర కుమార్, మెంబర్ (ఫైనాన్స్), ఎన్‌హెచ్ఎఐ; శ్రీ ఎ.కె. సింహ్, సిజిఎమ్ (ఫైనాన్స్), ఎన్‌హెచ్ఎఐ; శ్రీ ఎన్.బి. సాఠే, సలహాదారు, ఎన్‌హెచ్ఎఐ మరియు శ్రీమతి మందాకినీ బలోధి, డైరెక్టర్, ఆర్థిక సేవల విభాగం లు ప్రసంగించారు. వర్క్ శాపు లో కేంద్ర ప్రభుత్వం లోని వివిధ మంత్రిత్వ శాఖ లు మరియు విభాగాల, బీమా వ్యాపార సంస్థ ల, హైవే ఆపరేటర్స్ అసోసియెశన్ ఆఫ్ ఇండియా (హెచ్ఒఎఐ) మరియు నేశనల్ హైవేస్ బిల్డర్స్ ఫెడరేశన్ (ఎన్‌హెచ్‌బిఎఫ్) ల ప్రతినిధులు పాలుపంచుకొన్నారు.

 

భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వం లో అన్ని కొనుగోళ్ళ కు ఇన్ శ్యువరన్స్ సెక్యూరిటీ బాండ్స్ ను బ్యాంకు గ్యారంటీల తో సరిసమానమైనవి గా చేసి వేసింది. బిడ్ సిక్యోరిటి మరియు /లేదా పర్ఫా ర్మెన్స్ సిక్యూరిటి జమ చేయడం కోసం ఒక అదనపు పద్ధతి గా ఇన్ శ్యువరన్స్ శ్యుర్ టి బాండ్ లను ఉపయోగించుకోవలసింది గా బీమా కంపెనీల ను మరియు గుత్తేదారుల ను ఎన్‌హెచ్ఎఐ కోరుతున్నది. ఎన్‌హెచ్ఎఐ కి ఇంత వరకు 164 ఇన్ శ్యువరన్స్ శ్యుర్ టి బాండ్స్ (ఐఎస్‌బి) అందాయి. వాటిలో పర్ఫా ర్మెన్స్ సిక్యూరిటి కోసం 20 బాండ్ లు మరియు బిడ్ సెక్యూరిటీస్ గా 144 బాండ్ లు ఉన్నాయి.

 

ఈ కార్యశాల లో ఇచ్చిన సమాచారాన్ని పట్టి చూస్తే, వేరు వేరు బీమా వ్యాపార సంస్థ లు ఇప్పటి వరకు సుమారు గా 3,000 కోట్ల రూపాయల విలువైనటువంటి దాదాపు 700 ఇన్ శ్యువరన్స్ శ్యుర్ టి బాండ్స్ ను జారీ చేశాయని తేలింది. ఐఎస్‌బిస్ కు ఉన్న సామర్థ్యాన్ని గుర్తించిన పేనలిస్టు లు ఎన్‌హెచ్ఎఐ కాంట్రాక్టుల ప్రదానం లో ఈ యొక్క ఆర్థిక సాధనాన్ని విస్తృతం గా ఆమోదించాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విభిన్నమైన సవాళ్ళ ను గురించి వర్క్ శాపు లో చర్చించడమైంది. ఈ సాధనాన్ని త్వరిత గతి న స్వీకరించడం కోసం చేపట్ట తగినటువంటి చర్యల ను గురించి కూడా చర్చోపచర్చలు జరిగాయి.

 

ఇన్ శ్యువరన్స్ శ్యుర్ టి బాండ్స్ ఒక ఆర్థిక సాధనం, దీనిలో బీమా వ్యాపార సంస్థ లు ఒక శ్యుర్టివలె పనిచేస్తూ ఆర్థిక పరమైనటువంటి పూచీకత్తు ను ప్రదానం చేస్తాయి. కాంట్రాక్టరు అంగీకారం కుదిరిన షరతుల కు అనుగుణం గా తన బాధ్యత ను పూర్తి చేస్తారు. ఈ తరహా సాధనాల ను విస్తృతం గా ఆమోదించడం వల్ల దేశం లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రక్రియ ను పటిష్టపరచడం లో అండ లభిస్తుంది.

 

 

***

 

 



(Release ID: 2020783) Visitor Counter : 57