వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

న్యూఢిల్లీలో జరిగిన భారత్-జింబాబ్వే జాయింట్ ట్రేడ్ కమిటీ 3వ సెషన్


డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్స్, టెలి-మెడిసిన్‌, రఫ్ డైమండ్స్, ఫాస్ట్ పేమెంట్ సిస్టమ్స్ మరియు సాంప్రదాయ వైద్యంలో సహకారానికి రెండు పక్షాల మధ్య అంగీకారం

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచేందుకు జియోస్పేషియల్ రంగం, యంత్రాలు మరియు మెకానికల్, వాహనాలు, ఖనిజ ఇంధనాలు, విద్యుత్ యంత్రాల వంటి రంగాలు గుర్తింపు

Posted On: 15 MAY 2024 5:28PM by PIB Hyderabad

భారత్-జింబాబ్వే జాయింట్ ట్రేడ్ కమిటీ (జెటిసి) మూడవ సెషన్ న్యూఢిల్లీలో 13.05.2024 నుండి 14.05.2024 వరకు జరిగింది. భారత ప్రభుత్వ వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన వాణిజ్య శాఖ ఆర్థిక సలహాదారు శ్రీమతి ప్రియా పి. నాయర్ మరియు రిపబ్లిక్ ఆఫ్ జింబాబ్వే మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ చీఫ్ డైరెక్టర్, ఎకనామిక్ కోఆపరేషన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ డయాస్పోరా శ్రీమతి రూడో.ఎం. ఫరనిసి సహా అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. జింబాబ్వేకు చెందిన ఛార్జ్ డి'ఎఫైర్స్, జింబాబ్వే రాయబార కార్యాలయం, మిస్టర్ పీటర్ హోబ్వానీతో పాటు సంబంధిత మంత్రిత్వ శాఖల నుండి 15 మంది ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ చర్చలు స్నేహపూర్వక మరియు అహ్లాదకర వాతావరణంలో జరిగాయి. మరింత సహకారం, పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించడం, వాణిజ్యం మరియు పెట్టుబడులపై ఉత్సాహభరితమైన స్పందన వచ్చింది.

 

image.png


ఇరుపక్షాలు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సమీక్షించాయి మరియు రెండు దేశాల మధ్య ఉన్న విస్తృత సామర్థ్యాన్ని గుర్తించాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించే దిశగా సమిష్టి కృషి చేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సొల్యూషన్స్, టెలిమెడిసిన్‌లు, రఫ్ డైమండ్‌లు, ఫాస్ట్ పేమెంట్స్ సిస్టమ్ మరియు సాంప్రదాయ ఔషధం వంటి వాటిలో నియంత్రణ సహకారం కోసం అవగాహన ఒప్పందం (ఎంఓయులు)పై సంతకాలు చేసేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయి.

ఫార్మాస్యూటికల్స్, జియోస్పేషియల్ సెక్టార్, హెల్త్‌కేర్, మెషినరీ మరియు మెకానికల్ ఉపకరణాలు, వాహనాలు, ఎలక్ట్రికల్ మెషినరీ, ఖనిజ ఇంధనాలు, మినరల్ ఆయిల్స్ మరియు డిస్టిలేషన్, ప్లాస్టిక్స్ మరియు ఆర్టికల్స్, ఇనుము మరియు ఉక్కు, వ్యవసాయం మరియు ఫుడ్‌ ప్రొసెసింగ్‌ ఇంజినీరింగ్ రంగం, పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ ఎకానమీ, టెక్స్‌టైల్స్, కెపాసిటీ బిల్డింగ్ మొదలైన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలని ఇరువర్గాలు నిర్ణయించాయి.

ఇరుపక్షాల పెట్టుబడి ప్రమోషన్ ఏజెన్సీలు మరియు చాంబర్స్ ఆఫ్ కామర్స్ మధ్య సన్నిహిత సహకారంపై కూడా చర్చలు జరిగాయి. భారతదేశం-జింబాబ్వే జెటిసి 3వ సెషన్ చర్చలు రెండు దేశాల మధ్య స్నేహపూర్వక మరియు ప్రత్యేక సంబంధాలను సూచిస్తూ ముందుకు సాగాయి.

 

***



(Release ID: 2020778) Visitor Counter : 63