నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇండియాస్కిల్స్ 2024:  న్యూ ఢిల్లీ లో ఆరంభం కానున్న భారతదేశం లోని అతిపెద్దనైపుణ్య ప్రధానమైన పోటీ


దీనిలో 61 నైపుణ్యాల విభాగాల లో 900 మంది కి పైగా అభ్యర్థులు పాలుపంచుకోనున్నారు

Posted On: 14 MAY 2024 8:43PM by PIB Hyderabad

నైపుణ్యం తాలూకు అత్యున్నతమైన ప్రమాణాల ను వెల్లడి చేయడానికి రూపొందించినటువంటి దేశం లోని అతి పెద్ద నైపుణ్య ప్రధానమైన పోటీ ‘‘ద ఇండియాస్కిల్స్ కాంపిటీశన్ 2024’’ 2024 మే నెల 15 వ తేదీ నాడు మొదలవనుంది. నైపుణ్యాభివృద్ధి మరియు నవ పారిశ్రామికత్వం ల మంత్రిత్వ శాఖ (ఎమ్ఎస్‌డిఇ) దీనికి సంబంధించిన ఒక ప్రారంభ కార్యక్రమాన్ని న్యూ ఢిల్లీ లోని ద్వారక లో గల యశోభూమి లో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం లో 30 కి పైగా రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల కు చెందిన 900 మంది కి పైగా విద్యార్థుల తో పాటు 400 మంది కి పైగా పరిశ్రమ రంగ నిపుణులు పాలుపంచుకోనున్నారు.

 

 

నాలుగు రోజుల పాటు సాగేటటువటి ఇండియాస్కిల్స్ మాధ్యం ద్వారా అభ్యర్థుల కు విభిన్నమైన నైపుణ్యాల ను మరియు ప్రతిభ ను 61 విభాగాల లో చాటేందుకు ఒక జాతీయ వేదిక ను అందిస్తున్నది. ఈ నైపుణ్యాల లో సాంప్రదాయకమైనటువంటి చేతిపనులు మొదలుకొని, అత్యాధునిక సాంకేతికత లు చోటు చేసుకోనున్నాయి. 47 విధాలైన నైపుణ్య ప్రధాన పోటీల ను ఆన్ సైట్ లో నిర్వహించనుండగా, 14 రకాల నైపుణ్య పోటీల ను ఆఫ్ సైట్ మాధ్యం లో నిర్వహించనున్నారు. ఆఫ్ సైట్ వేదికల లో అత్యుత్తమ మౌలిక సదుపాయాల లభ్యత ను దృష్టి లో పెట్టుకొని కర్నాటక, హరియాణా, ఉత్తర్ ప్రదేశ్ మరియు గుజరాత్ లను లెక్క లోకి తీసుకొన్నారు. విద్యార్థులు డ్రోన్ ద్వారా చిత్ర నిర్మాణం, వస్త్రాల నేత పని, తోలు ను ఉపయోగించి పాదరక్షల తయారీ, మరి అలాగే ప్రోస్థెటిక్స్ – (కృత్రిమ అవయవాల) రూపాలంకరణ వంటి తొమ్మిది నైపుణ్యాల ను కూడా ప్రదర్శించనున్నారు.

 

 

జాతీయ స్థాయి పోటీ లో పాల్గొనే విద్యార్థుల కు ఐటిఐ లు, ఎన్ఎస్‌టిఐ లు, పాలిటెక్నిక్ లు, ఇంజినీరింగ్ సంస్థ లు, నర్సింగ్ సంస్థ లు మరియు బయోటెక్నాలజీ సంస్థల లో శిక్షణ ను ఇవ్వడమైంది. ఇది ప్రస్తుత స్కిల్ నెట్ వర్క్ లో భారతీయ యువత కు లభిస్తున్న అంతర్జాతీయ ప్రమాణాల తో కూడిన శిక్షణ కు ప్రమాణం గా ఉంది.

 

 

ఇండియాస్కిల్స్ లో విజేతలు గా నిలచే వారు పరిశ్రమ లో సర్వశ్రేష్ఠ శిక్షకుల సహాయం తో 2024 సెప్టెంబర్ లో ఫ్రాన్స్ లోని ల్యోన్ లో జరుగనున్న వరల్డ్ స్కిల్స్ పోటీ లో పాల్గొనేందుకు గాను సన్నద్ధులు అవుతారు. వరల్డ్ స్కిల్స్ కాంపిటీశన్ లో 70 కి పైగా దేశాల కు చెందిన 1,500 మంది పోటీదారులు పాల్గొననున్నారు.

 

 

కార్యక్రమాన్ని గురించి నైపుణ్యాభివృద్ధి మరియు నవ పారిశ్రమికత్వం ల మంత్రిత్వ శాఖ (ఎమ్ఎస్‌డిఇ) కార్యదర్శి శ్రీ అతుల్ కుమార్ తివారి మాట్లాడుతూ, ఇండియాస్కిల్స్ కాంపిటీశన్ నైపుణ్యవంతులు అయిన యువత కు అవకాశాల తాలూకు నూతన మార్గాల ను తెరవడం ద్వారా సాంప్రదాయకమైన ఎల్లల కు అతీతం గా కలల ను కనేందుకు మరియు ప్రపంచ రంగ స్థలం లో వారి యొక్క నైపుణ్యాల ను ప్రదర్శించేందుకు వారికి సాధికారిత ను కల్పిస్తుంది అన్నారు. అంతేకాకుండా, ఈ కార్యక్రమం దేశ నిర్మాణం లో నైపుణ్యాలు మరియు పనితనం యొక్క అమూల్యమైన పాత్ర ను ఒక ఉత్సవం వలె ఆవిష్కరిస్తుందని, దీనితోపాటుగా శరవేగం గా రూపుదాల్చుతున్న సాంకేతిక పురోగతి మరియు త్వరిత గతి న మారిపోతున్న ప్రపంచ ధోరణుల నడుమ దేశం యొక్క భవిష్యత్తు కు రూపురేఖల ను సంతరించడం లో నైపుణ్యాభివృద్ధి పోషించగల అంతర్నిహిత భూమిక కు కూడా ప్రతీక గా ఉంటుందని ఆయన అన్నారు.

 

 

ఈ సంవత్సరం ఈ కార్యక్రమం లో పాలుపంచుకొనే వ్యక్తులు నేశనల్ క్రెడిట్ ఫ్రేమ్ వర్క్ నుండి క్రెడిట్స్ ను సంపాదించుకొనే అవకాశాన్ని కూడా దక్కించుకోనున్నారు. వరల్డ్ స్కిల్స్, ఇంకా ఇండియాస్కిల్స్ పోటీ లు రెండిటి లో పెల్లుబుకే అన్ని నైపుణ్యాల ను నేశనల్ స్కిల్స్ క్వాలిఫికేశన్ నెట్ వర్క్ (ఎన్ఎస్‌క్యుఎఫ్) తో జాగ్రత్తగా అనుసంధానించడమైంది. కార్యక్రమం లో పాలుపంచుకొనే వారు నేర్చుకొనే అంశాల ద్వారా వారు ఎంపిక చేసుకొన్న రంగాల లో మంచి వృద్ధి కి అవకాశం ఉన్న ఉద్యోగ జీవనాన్ని గడిపేందుకు కూడా అవకాశాన్ని కలుగజేస్తుంది. మొట్టమొదటి సారిగా ఇండియాస్కిల్స్ లో క్యూరెన్సియా అనే పేరు పెట్టిన పోటీ ప్రధానమైన సమాచార వ్యవస్థ కు స్థానాన్ని కల్పించడమైంది.

 

 

పోటీ కోసం దాదాపు గా 2.5 లక్షల మంది అభ్యర్థులు వారి పేరుల ను స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ (ఎస్ఐడిహెచ్) పోర్టల్ లో నమోదు చేసుకొన్నారు. వారందరిలో నుండి 26,000 మంది ని ప్రీ-స్క్రీనింగ్ ప్రక్రియ మాధ్యం ద్వారా తాత్కాలికం గా ఎంపిక చేయడం జరిగింది. ఈ డేటా ను రాష్ట్ర స్థాయి పోటీ మరియు జిల్లా స్థాయి పోటీ లను నిర్వహించడం కోసం రాష్ట్రాల కు వెల్లడి చేయడమైంది. ఆయా పోటీల లో 900 మంది కి పైగా విద్యార్థుల ను ఇండియాస్కిల్స్ జాతీయ పోటీ కోసం ఎంపిక చేయడమైంది.

 

 

ఎంపిక ప్రక్రియ అంతాను అభ్యర్థుల లో పోటీ తాలూకు భావన ను అంకురింప చేయడం ఒక్కటే కాకుండా యువత లో నైపుణ్యాభివృద్ధి మరియు వృత్తి ప్రధానమైన శిక్షణ ల పరంగా మహత్వాకాంక్షల ను పెంచి పోషించుకోవడం లో కూడాను ఒక కీలకమైన పాత్ర ను పోషిస్తున్నది. వేరు వేరు అవకాశాల ను అందించడం ద్వారా పోటీ ఉన్నప్పటికీ పరస్పరం సమన్వయ భరితమైన వాతావరణాన్ని ఈ కార్యక్రమం కల్పించనుంది. అది ఎలాగంటే, రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, పరిశ్రమ రంగం మరియు విద్య రంగం ల క్రియాత్మక భాగస్వామ్యం తో పాటు గా ఈ విధమైన నైపుణ్య పోటీ అనేది ఒక కుశల శ్రమశక్తి కి సంబంధించిన ఒక దృఢమైన పునాది ని సిద్ధం చేస్తుంది కాబట్టి. మరి, దీని వల్ల జాతీయ ప్రగతి మరియు నూతన ఆవిష్కరణల కు ప్రోత్సాహం లభించగలదు.

 

 

ఇండియాస్కిల్స్ తో యువత లో ఆకాంక్షలు అంకురించగలవన్న ఆశ తో పాటు భారతదేశాని కి వాస్తవిక నైపుణ్య నాయకులు కూడా లభించనున్నారు. వారు ఆ తరువాత న్యూ ఇండియాకు ప్రచారకర్తలు గా కూడా పాటుపడనున్నారు.

 

 

ఈ సంవత్సరం, ఇండియా స్కిల్స్కు టొయోటా కిర్లోస్కర్, ఆటోడెస్క్, జెకె సిమెంట్, మారుతి సుజుకీ, లింకన్ ఇలెక్ట్రిక్, నేమ్‌టెక్, వేగా, లారియల్, శ్నాయిడర్ ఇలెక్ట్రిక్, ఫెస్టో ఇండియా, ఆర్త్‌ మిస్, మేదాంత మరియు సిగ్నియా హెల్థ్ కేయర్ ల వంటి 400 కు పైగా పరిశ్రమ మరియు విద్య రంగాల భాగస్వామ్య సంస్థల సమర్థన దక్కింది.

 

 

 

***


(Release ID: 2020687) Visitor Counter : 163