పర్యటక మంత్రిత్వ శాఖ
భారతదేశాన్ని ఎమ్ఐసిఇ కార్యకలాపాల కు ఒక ప్రముఖగ్లోబల్ హబ్ గా చాటిచెప్పడం కోసం ఐఎమ్ఇఎక్స్, ఫ్రేంక్ ఫర్ట్ 2024 లో పాలుపంచుకొంటున్న పర్యటన మంత్రిత్వ శాఖ
Posted On:
14 MAY 2024 8:40PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ పర్యటన మంత్రిత్వ శాఖ 2024 మే నెల 14 వ తేదీ మొదలుకొని 16 వ తేదీ వరకు ఐఎమ్ఇఎక్స్ ఫ్రేంక్ ఫర్ట్ లో పాలుపంచుకొంటున్నది. ప్రపంచ బజారు లో అగ్రగామి ఎమ్ఐసిఇ (మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్ ఎండ్ ఎగ్జిబిశన్స్) గమ్యస్థానం వలె భారతదేశం యొక్క సామర్థ్యాన్ని చాటుతూ ఉత్ప్రేరకం వలె పనిచేయాలన్నదే పర్యటన మంత్రిత్వ శాఖ యొక్క లక్ష్యం గా ఉంది. దీని కోసం దేశం లో పెద్ద సంఖ్య లో కార్యక్రమాల ను మరియు సమ్మేళనాల ను నిర్వహించడం జరుగుతుంది.
ఐఎమ్ఇఎక్స్ అనేది గ్లోబల్ ఈవెంట్స్ ఇండస్ట్రి కి ఒక కేంద్రం గా ఉంది. ఐఎమ్ఇఎక్స్ మాధ్యం వృత్తికుశలురు అందరి కి వ్యాపారాల ను వృద్ధి చెందింప చేసుకొనే, నిష్ఠపూర్ణమైన సంబంధాల ను పెంపొందింపచేసుకొనే మరియు విశిష్టమైనటువంటి సమాచారాన్ని తెలుసుకొనేందుకు ఉపయోగకరమైనటువంటి , లాభప్రదమైనటువంటి అవకాశాల ను ప్రసాదిస్తున్నది.
మంత్రిత్వ శాఖ రుతువుల ప్రభావాన్ని ఎదుర్కోవడం మరియు భారతదేశాన్ని సంవత్సరం పొడవునా 365 రోజలు పాటు చక్కని గమ్యస్థానం గా చాటి చెప్పడం కోసం ఎమ్ఐసిఇ ని ఒక ముఖ్య రంగం గా గుర్తించింది. ఈ ప్రయాస కు అనుగుణం గా, మంత్రిత్వ శాఖ ‘ఇన్‌క్రెడిబిల్ ఇండియా’ (అతుల్య భారత్) ప్రచార ఉద్యమం లో ఒక సబ్-బ్రాండ్ గా ‘మీట్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని పరిచయం చేసింది. ఈ సబ్ బ్రాండ్ ఉద్దేశ్యమల్లా ప్రచార కార్యక్రమాల ను చేపడుతూ భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయి కనెక్టివిటీ, అత్యధునాతనమైనటువంటి మౌలిక సదుపాయాలు, చైతన్య భరితమైనటువంటి జ్ఞాన కేంద్రం మరియు విశిష్టమైనటువంటి పర్యటక కేంద్రాల ను కలిగినటువంటి ఒక ఎమ్ఐసిఇ గమ్యస్థానం గా ప్రపంచం ఎదుట నిలబెట్టాలి అనేది. ఇండియా కన్వెన్శన్ ప్రమోశన్ మ్యూరో ఇతర ఎమ్ఐసిఇ ప్రణాళిక కర్తలు, సమావేశాల నిర్వాహకులు మరియు డెస్టినేశన్ మేనేజ్ మెంట్ కంపెనీల తో కలసి పెవినియన్ లో పాలుపంచుకొంది. భారత ప్రభుత్వ పర్యటన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ ఎమ్.ఆర్. సిరిమ్ ఇండియన్ పెవినియన్ ను ప్రారంభించారు. ఈ సందర్భం లో భారత ప్రభుత్వ పర్యటన మంత్రిత్వ శాఖ లోని ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు.
జి20 అధ్యక్ష బాధ్యతల ను భారతదేశం నిర్వహించిన కాలం లో, దేశ వ్యాప్తం గా 56 నగరాల లో 200 లకు పైగా సమావేశాల ను నిర్వహించడమైంది. తత్ఫలితం గా దేశీయ, అంతర్జాతీయ స్థాయిల లో పర్యటన రంగం లో వృద్ధి నమోదు అయింది. ఈ వేదిక ప్రపంచ స్థాయి లో భారతదేశం లోని సశక్తమైనటువంటి ఎమ్ఐసిఇ సంబంధి మౌలిక సదుపాయాలు మరియు భారతదేశం యొక్క సమృద్ధమైన సాంస్కృతిక, ప్రాకృతిక వారసత్వాన్ని ప్రభావవంతం అయిన రీతి న ఆవిష్కరించింది. ఈ జోరు అనంతరం, పర్యటన మంత్రిత్వ శాఖ సక్రియాత్మకం గా భారతదేశాన్ని ఎమ్ఐసిఇ కార్యకలాపాల కు ఒక ప్రముఖమైన గ్లోబల్ హబ్ గా బలం గా ముందుకు తీసుకుపోవడం లో నిమగ్నం అయింది. వాయు మార్గం ద్వారాను, రహదారుల మాధ్యం ద్వారాను దేశీయ సంధానం లో పెద్ద ఎత్తున పురోగతి తో పాటు, దేశం లోపల ప్రయాణ సౌలభ్యం వృద్ధి చెంది, ప్రజల కోసం క్రొత్త మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. కార్యక్రమాలు మరియు నిర్వహణ తో భారతదేశం ఒక అగ్రగామి గమ్యస్థానం గా మారే దిశ లో దూసుకుపోతున్నది. 2022 వ సంవత్సరం లో ఆసియా పసిఫిక్ ప్రాంత దేశాల కు ఇంటర్‌నేశనల్ కాంగ్రెస్ ఎండ్ కన్వెన్శన్ అసోసియేశన్ (ఐసిసిఎ) ఇచ్చిన ర్యాంకుల లో భారతదేశం తొమ్మిదో ర్యాంకు లో ఉంది.
***
(Release ID: 2020684)
Visitor Counter : 101