కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

నకిలీ కాల్స్ - డిఒటి/టిఆర్ఎఐ ల పక్షాన మీ మొబైల్ నుడిస్‌కనెక్ట్ చేయడం జరుగుతుంది అంటూ వచ్చే బెదరింపు కాల్స్ వేటినైనా ఎత్తకండిమరియు  వాటి గురించిన సమాచారాన్ని www.sancharsaathi.gov.in కు తెలియ జేయండి


కనెక్శన్ ను తొలగిస్తామంటూ బెదరించే తరహా కాల్స్ ను పౌరులకు డిఒటి చేయదు

Posted On: 14 MAY 2024 3:16PM by PIB Hyderabad

పౌరులు వారి కి నకిలీ కాల్స్ అందితే ఆ కాల్స్ ను ఎత్తవద్దు అంటూ కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని డిపార్ట్‌ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేశన్స్ (డిఒటి) ఒక సలహా ను ఇచ్చింది. ఆ తరహా కాల్స్ చేసే వారు వారి మొబైల్ నంబర్ ను డిస్‌కనెక్ట్ చేస్తామంటూ బెదరించడమో, లేదా వారి మొబైల్ నంబరు ను ఏవో చట్టవిరుద్ధ కార్యకలాపాల కు గాను దుర్వినియోగ పరచడమో జరుగుతోంది అనేటటువంటి కాల్స్ ను చేస్తూ ఉంటారు అని పేర్కొంది.

ప్రభుత్వ అధికారులు గా చెప్పుకొంటూ (+92-xxxxxxxxxx వంటి) విదేశీ మూలాలు కలిగిన మొబైల్ నంబర్ ల నుండి వాట్స్‌ ఏప్ కాల్స్ వస్తూ ఉన్న విషయం లో కూడాను డిఒటి సలహా పత్రాన్ని జారీ చేసింది.

సైబర్ నేరగాళ్ళు ఆ తరహా కాల్స్ చేయడం ద్వారా సైబర్-అపరాధం/ఆర్థిక మోసాల ను కొనసాగించడాని కి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేయడానికో, లేక బెదరించడానికో ప్రయత్నిస్తారు అని వివరించింది. ఆ విధమైనటువంటి ఫోన్ కాల్ ను తన తరఫున చేసేందుకు అధికారాన్ని డిఒటి/టిఆర్ఎఐ ఎవ్వరికీ ఇవ్వదు అని, ఈ విషయం లో జాగరూకులై ఉండాలని మరియు సదరు మోసపూరితమైన వర్తమానాల ను గురించి సంచార్ సాథీ పోర్టల్ (www.sancharsaathi.gov.in/sfc) లో చక్షు (Chakshu) - అనుమానిత మోసపూరిత సందేశాల ను గురించి వెల్లడించడంతాలూకు సదుపాయం లో నమోదు చేయాలని సూచించింది. ఏదైనా ఆపద చోటు చేసుకొనే కంటే ముందే మేల్కొని, ఆ విధమైన అంశాన్ని డిఒటి కి చేరవేస్తే సైబర్ అపరాధం, ఆర్థిక పరమైన దగా లు మొదలైన కార్యకలాపాల కోసం టెలికం వనరుల ను దురుపయోగం చేయడాన్ని నివారించడం లో డిఒటి కి సహాయకారి కాగలుగుతారు అని పేర్కొన్నది.

 

పౌరులు అప్పటికే సైబర్ అపరాధం లేదా ఆర్థిక మోసం తాలూకు బాధితులు అయి ఉన్న పక్షం లో, ఆ సంగతి ని సైబర్ అపరాధం సంబంధి హెల్ప్ లైన్ నంబరు అయినటువంటి 1930 కి గాని లేదా www.cybercrime.gov.in కు గాని తెలియజేయాలి అని కూడా డిఒటి సూచన చేసింది.

 

 

అనుమానాస్పదమైన, వంచనాత్మకమైన సందేశాల పైన పోరాటం జరపడం కోసం మరియు సైబర్ అపరాధ సంబంధి కార్యకలాపాల ను అరికట్టడం కోసం వివిధ చర్యల ను తీసుకోవడం జరిగింది. అవి ఈ క్రింది ప్రకారం గా ఉన్నాయి:

 

  • ద్రోహ చింత కలిగినటువంటి మరియు ఫిశింగ్ ఉద్దేశ్యం తో కూడినటువంటి ఎస్ఎమ్ఎస్ లను పౌరుల కు పంపించడం లో నిమగ్నం అయిన 52 ప్రధాన ఎన్టిటి లను చక్షు సదుపాయం పరిధి లో అడ్డగించడమైంది.

 

  • 700 ఎస్ఎమ్ఎస్ కంటెంట్ టెమ్‌ప్లేట్స్ ను పని చేయకుండా చూడడమైంది. టెలికం సేవల సంస్థ ల పరిధుల లో 348 మొబైల్ హేండ్ సెట్స్ ను యావత్తు భారత్ ప్రాతిపదిక న నిషేధిత జాబితా లో చేర్చడమైంది.

 

  • 10,834 అనుమానాస్పద మొబైల్ నంబర్స్ విషయం లో టెలికం ఆపరేటర్ సంస్థ లు ఆయా నంబర్ ల విషయం లో తిరిగి నిర్ధారణ చేయవలసిందిగా కోరడమైంది. వీటిలో 8272 మొబైల్ కనెక్శన్ ల విషయం లో 2024 ఏప్రిల్ 30 వ తేదీ లోపు పునర్ నిర్ధారణ పరం గా వైఫల్యం ఎదురవడం తో, ఆయా కనక్శన్ లను తొలగించడమైంది.

 

  • సైబర్ అపరాధం/ఆర్థిక మోసాల లో ప్రమేయం ఉన్నందుకు గాను యావత్తు భారతదేశం ప్రాతిపదిక న 1.86 లక్షల మొబైల్ హేండ్ సెట్స్ ను నిరోధించడమైంది.

 

  • డిఒటి/టిఆర్ఎఐ లు పంపుతూ ఉన్నట్లుగా అందేటటువంటి నకిలీ నోటీసు లు, మోసానికి తావు ఉండవచ్చన్న అనుమానం తో కూడిన వర్తమానాలు, ద్రోహ స్వభావం కలిగిన కాల్స్ విషయం లో చైతన్యాన్ని రేకెత్తించేటటువంటి సూచనల ను పత్రికలు, ఎస్ఎమ్ఎస్, ఇంకా సామాజిక ప్రసార మాధ్యమాల ద్వారా ఒక క్రమం తప్పక జారీ చేయడమవుతున్నది.

 

***



(Release ID: 2020588) Visitor Counter : 88