రక్షణ మంత్రిత్వ శాఖ
భారతీయ నౌకాదళాని కి ప్రధాన అధికారి గా పదవీ బాధ్యతలను స్వీకరించిన వైస్ ఎడ్ మరల్ శ్రీ సంజయ్ భల్లా, ఎవిఎస్ఎమ్, ఎన్ఎమ్
प्रविष्टि तिथि:
10 MAY 2024 11:22AM by PIB Hyderabad
భారతీయ నౌకాదళాని కి చీఫ్ ఆఫ్ పర్సనెల్ (సిఒపి) గా వైస్ ఎడ్ మరల్ శ్రీ సంజయ్ భల్లా, ఎవిఎస్ఎమ్, ఎన్ఎమ్ 2024 మే 10 వ తేదీ నాడు పదవీ బాధ్యతల ను స్వీకరించారు. ఆయన ను 1989 జనవరి 1 వ తేదీ న భారతీయ నౌకా దళం లో నియమించడమైంది. 35 సంవత్సరాల వృత్తి జీవనం లో, ఆయన సముద్ర తలం లోను మరియు సముద్రతీరం లోను రెండిటిలో కూడ అనేక విశిష్ట నియామకాలు, స్టాఫ్ మరియు నిర్వహణ సంబంధి నియామకాల బాధ్యతల ను నిభాయించారు.
కమ్యూనికేశన్ ఎండ్ ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ లో స్పెశలైజేశన్ కోర్సు ను ఆయన పూర్తి చేసిన తరువాతి కాలాల్లో అనేక ఫ్రంట్ లైన్ వార్‌శిప్ లలో స్పెశలిస్టు గా సేవల ను అందించారు. అనంతరం ఆయన ను సముద్రం లో సవాళ్ళ తో కూడినటువంటి, పూర్తి కాలిక మరియు ఘటనలతో నిండి ఉంటేటటువంటి కమాండ్ లను సంబాళించే భాగ్యం దక్కింది. వాటిలో, ఐఎన్ఎస్ నిశంక్, ఐఎన్ఎస్ తారాగిరి, ఐఎన్ఎస్ బ్యాస్ లు వీటి తోపాటు గా ఫ్లాగ్ ఆఫిసర్ కమాండింగ్ ఈస్టర్న్ ఫ్లీట్ (ఎఫ్ఒసిఇఎఫ్ ) తాలూకు ప్రతిష్టాత్మకమైన నియామకం కూడా ఒకటి గా ఉండింది. ఎఫ్ఒసిఇఎఫ్ గా ఆయన తన పదవీ కాలం లో, ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ (పిఎఫ్ఆర్-22 ) మరియు భారతీయ నౌకా దళాని కి చెందిన ప్రధానమైనటువంటి బహుళ జాతీయ అభ్యాసం మిలన్-22 లలో ఆయన పాలుపంచుకొన్నారు. మిత్రదేశాల నుండి అపూర్వమైనటువంటి భాగస్వామ్యం సైతం సమకూరిన మిలన్-22 లో ఆఫిసర్ ఇన్ టాక్టికల్ కమాండ్ గా ఆయన వ్యవహరించారు. సముద్ర తీరం లో, ఆయన నౌకాదళం ప్రధాన కేంద్రం లో అసిస్టెంట్ చీఫ్ ఆఫ్ పర్సనెల్ (మానవ వనరుల అభివృద్ధి) సహా మహత్వపూర్ణమైన స్టాఫ్ అపాయింట్ మెంట్స్ లో పనిచేశారు. నేవల్ అకైడమి లో అధికారుల కు శిక్షణ ఇచ్చే విభాగాని కి అధిపతి గా నడచుకొన్నారు; విదేశాల లో దౌత్య పరమైన కార్య భారాన్ని వహించారు. సిఒపి గా పదవీ బాధ్యతల ను స్వీకరించడం కంటే ముందు, ఆయన వెస్టర్న్ నేవల్ కమాండ్ కు చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఉన్నారు. ఆపరేశన్ సంకల్ప్ వంటి ఆపరేశన్ లో మరియు సింధుదుర్గ్ లో నేవీ డే ఆపరేశన్ డెమో 2023 వంటి కార్యక్రమాల ను పర్యవేక్షించారు.
వైస్ ఎడ్ మరల్ శ్రీ సంజయ్ భల్లా లండన్ లోని రాయల్ కాలేజీ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్; వెలింగ్ టన్ లోని నేవల్ వార్ కాలేజీ ఎండ్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీ లలో పూర్వ విద్యార్థి గా ఉన్నారు. ఆయన విద్య సంబంధి కార్యసాధనల లో ఎమ్. ఫిల్. (రక్షణ మరియు వ్యూహాత్మక అధ్యయనాలు); లండన్ లోని కింగ్స్ కాలేజి నుండి అంతర్జాతీయ భద్రత మరియు వ్యూహాత్మక అధ్యయనాలు లో మాస్టర్స్; మద్రాస్ యూనివర్సిటీ నుండి ఎమ్. ఎస్‌సి. (రక్షణ మరియు వ్యూహాత్మక అధ్యయనం); అలాగే సియుఎస్ఎటి నుండి ఎమ్.ఎస్‌సి (టెలికం) వంటివి ఉన్నాయి.
ఆయన చేసిన విశిష్టమైన సేవ కు గుర్తింపు గా ఆయన కు అతి విశిష్ట్ సేవా మెడల్ ను, నావ్ సేనా మెడల్ ను ఇవ్వడమైంది. అలాగే చీఫ్ ఆఫ్ ద నేవల్ స్టాఫ్, ఇంకా ఫ్లాగ్ ఆఫిసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ల వద్ద నుండి ప్రశంసల ను కూడా ఆయన అందుకొన్నారు.
***
(रिलीज़ आईडी: 2020245)
आगंतुक पटल : 191