మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిజైన్, వ్యవస్థాపకత లో సామర్ధ్య నిర్మాణం (సిబిడిఇ) కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ కె.సంజయ్ మూర్తి

Posted On: 07 MAY 2024 7:03PM by PIB Hyderabad

డిజైన్, వ్యవస్థాపకత లో సామర్థ్య నిర్మాణం  (సిబిడిఇ) కార్యక్రమాన్ని

 విద్యాశాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి శ్రీ కె.సంజయ్ మూర్తి ఈ రోజు వర్చువల్ విధానంలో  ప్రారంభించారు. కార్యక్రమంలో సిబిడిఇ సలహా మండలి  సభ్యులు; పరిశ్రమకు చెందిన మార్గదర్శకులు, ఎంపిక చేసిన  ఉన్నత విద్యా సంస్థల (హెచ్ఈఐ) ప్రతినిధులు; సిబిడిఇ  ప్రోగ్రాం  డైరెక్టర్ ప్రొఫెసర్ సుధీర్ వరదరాజన్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్లు, కో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్లు పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో ప్రారంభ కార్యక్రమంలో 130 మందికి పైగా హాజరయ్యారు.

  ఈ కార్యక్రమాన్ని పరిశ్రమ, విద్యా వర్గాల సహకారంతో నిర్వహిస్తున్నామని శ్రీ కె.సంజయ్ మూర్తి తెలిపారు.  పరిశ్రమవిద్యా రంగం భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు పరిశ్రమ రంగానికి చెందిన నిపుణులు మార్గదర్శకత్వం,  సహకారం అందిస్తున్నారని ఆయన తెలిపారు.

కఠిన ఎంపిక ప్రక్రియ ద్వారా కార్యక్రమాన్ని తమ సంస్థల్లో అమలు చేయడానికి 30 హెచ్ఈఐ లను ఎంపిక చేశామని ఆయన వివరించారు. 

తమ సంస్థలో డిజైన్, వ్యవస్థాపకత లో సామర్థ్య నిర్మాణం కార్యక్రమాలు అమలు చేయడానికి అవసరమైన శిక్షణను పరిశ్రమ వర్గాలకు చెందిన నిపుణుల సహకారంతో ఎంపిక చేసిన హెచ్ఈఐ లకు అందిస్తారు. కాంచీపురం ఐఐఐటీడిఎం రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఎంపిక చేశారు. కార్యక్రమం అమలు తీరును మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ (ఎంఎంటిటిసి)పర్యవేక్షిస్తుంది. సంక్లిష్ట సవాళ్లను  సృజనాత్మకమైన, వినూత్నమైన విధానాల ద్వారా  పరిష్కార విధానాన్ని విద్యార్థులు అభివృద్ధి చేసే అంశంపై  దృష్టి సారించి కార్యక్రమం అమలు జరుగుతుంది.సమస్యల పరిష్కారానికి అనువైన విధానాలు రూపొందించడానికి విద్యార్థులకు అవసరమైన సహకారం, మార్గదర్శకత్వం పరిశ్రమ  రంగానికి చెందిన నిపుణులు దశల వారీగా   ఖచ్చితమైన పరిష్కార మార్గాలు రూపొందించడం లక్ష్యంగా అమలు జరిగే కార్యక్రమంలో అధ్యాపక బృందం, విద్యార్థులు, ఎంపిక చేసిన హెచ్ఈఐ బృందాల మధ్య తరచు చర్చా కార్యక్రమాలు జరుగుతాయి. పరిశ్రమ రంగంలో నిపుణులు  సంవత్సరాల తరబడి సాధించిన అనుభవం,నైపుణ్యం గుర్తించిన హెచ్ఈఐ లకు ప్రయోజనం కలిగించే విధంగా రూపొందించిన కార్యక్రమాన్ని అమలు చేస్తారు. 

కార్యక్రమంలో పాల్గొన్న  శ్రీ మనోజ్ కోహ్లీ సహా పలువురు పరిశ్రమ నిపుణులు, సిబిడిఇ సలహా మండలి చైర్మన్ శ్రీ మనోజ్ కోహ్లీ, నాస్కామ్ అధ్యక్షురాలు శ్రీమతి డబ్జాని ముఖర్జీ  తదితరులు కార్యక్రమాన్ని రూపొందించిన విధానం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం ఆశించిన ప్రయోజనాలు సాధిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమాలను  అమలు చేసే  సమయంలో ప్రపంచ పెట్టుబడిదారులు, పరిశ్రమలు, స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలని  శ్రీ కోహ్లీ సూచించారు.విద్యాసంస్థల్లో ఉన్న యువకుల మనస్సులో వ్యవస్థాపక ఆలోచన పెంపొందించాలని   శ్రీమతి ఘోష్ పేర్కొన్నారు.పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా  సంప్రదాయ బోధన విధానంలో  సాంకేతిక నైపుణ్యాలను జోడించి విద్యా కార్యక్రమాలు అమలు జరగాలన్నారు.  
ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించడానికి  యువ పారిశ్రామికవేత్తలు/ఆవిష్కర్తలు సమర్థవంతమైన ,స్థిరమైన పరిష్కారాలను రూపొందించడానికి స్థానికంగా సంబంధిత సవాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని 
ఐఐటీ  మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి.కామకోటి సూచించారు. 

పరిశ్రమకు చెందిన నిపుణులు  ఈ కార్యక్రమం గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమం విద్యార్థులను పారిశ్రామికవేత్తలుగా మార్చడానికి హెచ్ఈఐ  సామర్థ్యాలను పెంపొందిస్తుంది అని  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, అస్సాం చాప్టర్ సభ్యుడు డాక్టర్ మిఫ్తాహుల్ బార్బరుహ్ , మార్ష్ మెక్లీన్ ఆసియా మాజీ చీఫ్ డిజిటల్ డేటా అండ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ శ్రీ చంద్రశేఖరన్ బాలకృష్ణన్ పేర్కొన్నారు. దీనివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలు రూపొందుతాయని వారు అన్నారు. 
 భవిష్యత్తులో కార్యక్రమం అమలు జరిగే తీరును  ఐఐఐటీడిఎం   కాంచీపురం ప్రోగ్రాం డైరెక్టర్ ప్రొఫెసర్ సుధీర్ వరదరాజన్ వివరించారు. తాము అందించే   తదుపరి కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఆయన హెచ్ఈఐ లకు సూచించారు. 

***


(Release ID: 2020086) Visitor Counter : 103