గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పని తీరు యొక్క సూచికల ను గురించి చర్చించం తో పాటుగా ఖరారు చేయడం కోసంగనుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన స్టేట్ మైనింగ్ ఇండెక్స్ సంబంధి కార్యశాల లోపాలుపంచుకొన్న 26 రాష్ట్రాలు

Posted On: 08 MAY 2024 4:25PM by PIB Hyderabad

గనుల మంత్రిత్వ శాఖ ‘స్టేట్ మైనింగ్ ఇండెక్స్’ అంశం పై ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ - ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఐటి-ఐఎస్ఎమ్), ధన్‌బాద్ సహకారం తో ఈ రోజు న దిల్లీ లో ఒక రోజు పాటు కార్యశాల ను విజయవంతం గా నిర్వహించింది. ఈ ఇండెక్స్ ఏదైనా ఒక రాష్ట్రం లో గనుల సంబంధి వ్యాపారాన్ని నిర్వహించడం లో సౌలభ్యానికి దోహదం చేసేటటువంటి వేరు వేరు అంశాల ను గురించిన అవగాహన ఏర్పడడాని కి గనుల రంగం లోని స్టేక్ హోల్డర్స్ కు ఒక సాధనం గా ఉపయోగ పడనుంది.

 

ఈ వర్క్ శాపునకు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వి.ఎల్. కాంతా రావు అధ్యక్షత వహించారు. ఆయన తన కీలకోపన్యాసం లో, గనుల రంగం యొక్క అభివృద్ధి ప్రక్రియ లో రాష్ట్రాలు పూనుకొని చేసే ప్రయాసలు సంబంధి విధానాల రూపకల్పన లో సముచితమైన స్థానాన్ని పొందుతాయి అంటూ ఆ ప్రయాసల కు గల ప్రాముఖ్యాన్ని వివరించారు. ‘స్టేట్ మైనింగ్ ఇండెక్సు’ ను సిద్ధం చేసుకోవడం సహకార పూర్వక సమాఖ్య వాదాన్ని ప్రోత్సహించడం తో పాటు గా రాష్ట్రాల మధ్య పోటీ ని కూడా ప్రోత్సహించ గలుగుతుంది అంటూ ఆయన నొక్కి చెప్పారు. ఈ అభ్యాసం సఫలం కావడం లో రాష్ట్రాల యొక్క క్రియాశీల ప్రాతినిధ్యం ఎంతయినా ముఖ్యం అని ఆయన అన్నారు. గణాంక సమాచారాన్ని సకాలం లో దాఖలు చేయడం ద్వారా డేటా కలెక్శన్ యత్నాల లో రాష్ట్రాలు సాయ పడాలి అంటూ ఆయన అభ్యర్థించారు.

 

ఈ వర్క్ శాప్ విధాన రూపకర్తలను, అడ్ మినిస్ట్రేటర్ లను, కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధుల ను ఒక చోటు కు తెచ్చింది. ఇండెక్స్ రూపురేఖలు మరియు విధానం లో భాగం కాబోయే సూచికలను మరియు ఉప సూచికల ను గురించి చర్చించి మరి వాటిని ఖరారు చేయడం కోసం ఉద్దేశించిన వర్క్ శాపు లో 26 రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రట్రీ లు, డైరెక్టర్ లు మరియు ఇతర అధికారులు కూడా పాలుపంచుకొన్నారు. రాష్ట్రాల నుండి అందిన సూచనల ను, సలహాల ను లెక్క లోకి తీసుకొని, స్టేట్ మైనింగ్ ఇండెక్స్ రూపు రేఖల ను ఖాయపరచడం జరుగుతుంది; ఇండెక్స్ ను 2024 జులై లో విడుదల చేయడం జరుగుతుంది. ఈ సూచిక లో వాస్తవ స్థానాల ను ఖాయపరచడం 2025 ఏప్రిల్ లో కొలిక్కి వస్తుంది.

 

***



(Release ID: 2020028) Visitor Counter : 103