రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

గోవా శిప్ యార్డ్ లిమిటెడ్ లో 2024 మే నెల 3 వ తేదీనాడు లాంఛనం గా మొదలైన ఒకటో ఆధునిక తరానికి చెందిన ఒకటో సముద్రగామి గస్తీ ప్రధాననౌక (ఎక్స్-జిఎస్ఎల్) నిర్మాణ సంబంధి పనులు 

Posted On: 04 MAY 2024 12:31PM by PIB Hyderabad

ఆధునిక తరానికి చెందిన ఒకటో సముద్రగామి గస్తీ ప్రధానమైన నౌక (ఎక్స్-జిఎస్ఎల్) యొక్క నిర్మాణ కార్యాల ను లాంఛనం గా ప్రారంభించేటటువంటి కార్యక్రమం 2024 మే నెల 3 వ తేదీ నాడు గోవా లోని మెసర్స్ గోవా శిప్ యార్డ్ లిమిటెడ్ లో నిర్వహించడమైంది. ఈ కార్యక్రమాని కి కంట్రోలర్, వార్‌శిప్ ప్రొడక్శన్ & ఎక్విజిశన్ వైస్ ఎడ్‌మరల్ శ్రీ బి. శివ కుమార్ అధ్యక్షత వహించారు. ఈ ముఖ్య కార్యక్రమం లో జిఎస్ఎల్ చెయర్‌మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బి.కె. ఉపాధ్యాయ్ తో పాటు భారతీయ నౌకాదళం లోని మరియు మెసర్స్ జిఎస్ఎల్ లోని ఇతర సీనియర్ అధికారులు కూడా పాలుపంచుకొన్నారు.

 

ఆధునిక తరాని కి చెందినటువంటి, సముద్ర తీరానికి చాలా దూరం లో మోహరించేటటువంటి ఈ తరహాకు చెందిన 11 గస్తీ ప్రధానమైన సముద్రగామి నౌక ల ను (ఎన్‌జిఒపివి స్ ను) దేశీయం గా రూపు దిద్ది, నిర్మించడం కోసం ఉద్దేశించిన ఒప్పందాల ను మెసర్స్ గోవా శిప్ యార్డ్ లిమిటెడ్ (జిఎస్ఎల్), గోవా కు మరియు మెసర్స్ గార్డెన్ రీచ్ శిప్ బిల్డర్స్ ఎండ్ ఇంజినీర్స్ (జిఆర్ఎస్ఇ), కోల్ కాతా కు మధ్య 2023 మార్చి నెల 30 వ తేదీ న కుదుర్చుకోవడమైంది. వీటి లో ఏడు ఓడల ను మెసర్స్ జిఎస్ఎల్ మరియు నాలుగు ఓడల ను మెసర్స్ జిఆర్ఎస్ఇ నిర్మించవలసి ఉంది.

 

ఈ క్రొత్త మరియు ఆధునిక తరానికి చెందినటువంటి సముద్రగామి గస్తీ నౌక ల (ఎన్ జిఒపి స్ )యొక్క సేవల ను సముద్రం లో దోపిడీలను అరికట్టడం కోసం, కోస్తా తీర ప్రాంతాల యొక్క సురక్ష, నిఘా ల కోసం, ఆఫ్ శోర్ అసెట్స్ ను కాపాడడం వంటి మిశన్ లను నెరవేర్చడం కోసం వినియోగించుకోవడం జరుగుతుంది. ఈ ఓడ లు హిందూ మహాసముద్ర ప్రాంతం లో మన దేశం యొక్క ఆర్థికపరమైనటువంటి మరియు భౌగోళిక-రాజకీయ పరమైనటువంటి ప్రయోజనాల ను కాపాడడం కోసం భారతీయ నౌకాదళం తన పోరాట సామర్థ్యాన్ని విస్తృత పరచుకోవడం లో అండ గా నిలబడతాయి. ఈ కార్యక్రమం స్వదేశీ యుద్ధనౌక ల నిర్మాణం దిశ లో మరియు భారతీయ నౌకాదళం యొక్క ప్రగతి పథం లో ముఖ్యమైన మైలురాయి గా ఉంది. అంతేకాకుండా, ఇది మన దేశం యొక్క ‘‘ఆత్మనిర్భర్ భారత్’’ మరియు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల కు అనుగుణం గా కూడా ఉంది.

 

***


(Release ID: 2020018) Visitor Counter : 133