రక్షణ మంత్రిత్వ శాఖ
సౌథ్ చైనా సీ కు ఈస్టర్న్ ఫ్లీట్ ను పంపించడం లో భాగంగా సింగపూర్ కు చేరుకొన్న భారతదేశ నౌకాదళాని కి చెందిన దిల్లీ, శక్తి మరియు కిల్ టన్ నౌక లు
प्रविष्टि तिथि:
07 MAY 2024 11:11AM by PIB Hyderabad
భారతీయ నౌకాదళాని కి చెందిన నౌక లు దిల్లీ, శక్తి మరియు కిల్ టన్ లు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఆర్ ఎడిఎమ్ శ్రీ రాజేశ్ ధన్‌ఖడ్ నేతృత్వం లో 2024 మే నెల 6 వ తేదీ నాడు సింగపూర్ కు చేరుకొన్నప్పుడు ఆ నౌకల కు సింగపూర్ గణతంత్ర నౌకాదళ సిబ్బంది తో పాటు గా సింగపూర్ లో భారతదేశం యొక్క హై కమిశనర్ ల ద్వారా స్నేహపూర్ణ స్వాగతం పలకడమైంది. ఈ సందర్శన సౌథ్ చైనా సీ లో భారతదేశ నౌకాదళం యొక్క ఈస్టర్న్ ఫ్లీట్ యొక్క నిర్వహణ పరమైన నియుక్తి లో ఒక భాగం గా ఉంది. ఈ యాత్ర అనేక కార్యక్రమాలు మరియు కార్యకలాపాల మాధ్యం ద్వారా రెండు సముద్ర దేశాల కు మధ్య దీర్ఘకాలిక మైత్రి ని మరియు సహకారాన్ని మరింత గా బలపరచడం కోసం ఉద్దేశించినటువంటిది.
ఈ నౌకలు నౌకాశ్రయం లో నౌకలు విడిది చేసే కాలం లో, భారతదేశం లో హై కమిషన్ తో సమావేశాలు, సింగపూర్ గణతంత్రం యొక్క నౌకాదళం తో వృత్తి కౌశలం సంబంధి సమావేశాలు, విద్య రంగ ప్రముఖుల తో మరియు కమ్యూనిటీ అవుట్ రీచ్ సహా విభిన్నమైన కార్యకలాపాల ను చేపట్టడం కోసం పథకాలను రూపొందించడమైంది. ఇది రెండు నౌకాదళాల యొక్క ఉమ్మడి విలువల ను చాటిచెబుతుంది.
భారతీయ నౌకాదళం మరియు సింగపూర్ గణతంత్రం యొక్క నౌకాదళం ల మధ్య గడచిన మూడు దశాబ్దాల లో బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి వరుస యాత్రలు, సర్వోత్తమ అభ్యాసాల ఆదాన, ప్రదానం మరియు పరస్పర శిక్షణ వ్యవస్థల మాధ్యం ద్వారా సహకారం, సమన్వయం దృఢతరమైంది. ప్రస్తుతం నౌకల ను పంపడం అనే పరిణామం రెండు నౌకాదళాల కు మధ్య నెలకొన్న బలమైన సంబంధాల కు ఒక ప్రమాణం గా ఉంది.
***
(रिलीज़ आईडी: 2020016)
आगंतुक पटल : 161