వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

అబుజా లో జరిగిన భారతదేశం-నైజీరియా సంయుక్త వ్యాపారసంఘం యొక్క రెండో సమావేశం


స్థానిక కరెన్సీ సెటిల్‌మెంట్ సిస్టమ్ సంబంధి ఒప్పందాన్ని ఇరు పక్షాలు త్వరలో ఖాయపరచుకోనున్నాయి

ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన డిజిటల్ ఇకానమీ ఎండ్డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ముడిచమురు మరియు సహజ వాయువు, ఔషధ నిర్మాణం వంటి అనేక రంగాల ను గుర్తించడమైంది

Posted On: 03 MAY 2024 12:31PM by PIB Hyderabad

భారతదేశాని కి చెందిన ఏడుగురు సభ్యుల ప్రతినిధివర్గం 2024 ఏప్రిల్ 29 మొదలుకొని 2024 ఏప్రిల్ 30 వ తేదీ వరకు నైజీరియా లోని అబుజా లో తమ కోవకు చెందిన ప్రతినిధుల తో జాయింట్ ట్రేడ్ కమిటీ (జెటిసి) సమావేశాన్ని నిర్వహించారు. ప్రతినిధివర్గం సభ్యుల లో వాణిజ్యం మరియు పరిశ్రమ మంత్రిత్వ శాఖ లోని వాణిజ్య విభాగం అదనపు కార్యదర్శి శ్రీ అమర్‌దీప్ సింహ్ భాటియా కు తోడు ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ నైజీరియా కు భారత హై కమిశనర్ శ్రీ జి. బాలసుబ్రమణ్యమ్ లతో పాటు వాణిజ్య విభాగం లో ఆర్థిక సలహాదారు ప్రియ పి. నాయర్ గారు ఉన్నారు. జెటిసి కి నైజీరియా లో ఇండస్ట్రీ ట్రేడ్ ఎండ్ ఇన్వెస్ట్‌మెంట్ మంత్రిత్వ శాఖ లో పర్మనెంట్ సెక్రట్రి, రాయబారి నూరా అబ్బా రిమీ గారు మరియు వాణిజ్య విభాగం అదనపు కార్యదర్శి లు సహాధ్యక్షత ను వహించారు.

 

 

 

సమగ్ర సంభాషణ సాగిన క్రమం లో, ఇరు పక్షాలు ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పెట్టుబడి సంబంధాల లో ఇటీవలి ఘటన క్రమాల ను కూలంకషం గా సమీక్షించి, మరింత విస్తరణ కు అపారమైన అవకాశాలు ఉన్నాయని గమనించారు. ఈ మేరకు ద్వైపాక్షిక వ్యాపారం లో పరస్పర హితకరమైన పెట్టుబడుల లో శ్రద్ధ ను పెంచవలసిన అవసరం ఉన్నటువంటి అనేకమైన రంగాల ను ఉభయ పక్షాలు గుర్తించాయి. వీటిలో ఉభయ పక్షాల కు చెందిన బజారు లభ్యత పరం గా ఉన్న సమస్యల ను పరిష్కరించడం, ముడి చమురు, సహజ వాయువు, ఔషధ నిర్మాణం, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ ఫేస్ (యుపిఐ), లోకల్ కరెన్సీ సెటిల్‌ మెంట్ సిస్టమ్, విద్యుత్తు రంగం, నవీకరణ యోగ్య శక్తి రంగం, వ్యవసాయం & ఫూడ్ ప్రాసెసింగ్, విద్య, రవాణా, రైలు మార్గాలు, విమానయానం, ఎమ్ఎస్ఎమ్ఇ లు, అభివృద్ధి మొదలైన కీలక రంగాల లో సహకారం వంటివి ఉన్నాయి. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాల ను మరింత గా బలపరచుకోవడం కోసం లోకల్ కరెన్సీ సెటిల్‌మెంట్ సిస్టమ్ ఎగ్రిమెంట్ ను త్వరగా ముగించాలి అని రెండు పక్షాలు సమ్మతి ని వ్యక్తం చేశాయి.

 

 

భారతదేశం నుండి ఆధికారిక ప్రతినిధి వర్గం గా వ్యవహరించిన అధికారుల లో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ), ఎక్సిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు నేశనల్ పేమెంట్స్ కార్ పొరేరేశన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) ల అధికారులు ఉన్నారు. ఉభయ పక్షాల కు చెందిన అధికారులు జెటిసి కార్యకలాపాల లో చురుకు గా పాలుపంచుకొన్నారు. చర్చ లు సుహృద్భావం మరియు స్నేహపూర్వకం అయిన వాతావరణం లో జరిగాయి; ఆ చర్చలు ఫలప్రదం అయ్యాయి కూడాను. ఇప్పటికంటె ఎక్కువ గా సహకారం, పరిష్కారం కాని అంశాల కు పరిష్కారాల ను వెతకడం, వ్యాపారాన్ని మరియు పెట్టుబడి ని పెంపొందింపచేసుకోవడం, ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల ను ప్రోత్సహించుకోవడం పట్ల ఉత్సాహభరితం అయిన ప్రతిస్పందన వ్యక్తం అయింది.

 

 

 

 

ద్వైపాక్షిక వ్యాపారాన్ని ప్రోత్సహించడం కోసం క బలమైన ప్రయాస లో భాగం గా రెండు పక్షాలు ఈ ప్రక్రియ లో అడ్డు పడుతున్న అంశాల ను అన్నింటి ని సత్వరం పరిష్కరించుకోవాలని, రెండు దేశాల మధ్య వ్యాపార ఉన్నతి కి మార్గాన్ని సుగమం చేయాలన్న వచన బద్ధత ను ప్రకటించాయి. సిఐఐ నేతృత్వం వహించిన వ్యాపార ప్రధానమైన ప్రతినిధి వర్గం ఒకటి ఆధికారిక ప్రతినిది వర్గం వెంట వచ్చింది. దీనిలో విద్యుత్తు, ఫిన్ టెక్ , టెలికమ్యూనికేశన్స్, ఎలక్ట్రికల్ మెశినరీ, ఔషధ నిర్మాణం ల వంటి విభిన్న రంగాల కు చెందిన ప్రతినిధులు ఉన్నారు. ఇండియా-నైజీరియా జెటిసి యొక్క రెండో సమావేశం లో చర్చోపచర్చ లు సౌహార్దపూర్ణమైనవి గాను, ముందు చూపు తో కూడుకొన్నవి గాను సాగి, రెండు దేశాల మధ్య స్నేహపూర్వకమైనటువంటి మరియు విశిష్టమైనటువంటి సంబంధాల కు ప్రతీకాత్మకం గా నిలచాయి.

 

 

 

 

ఆఫ్రికా ప్రాంతం లో నైజీరియా భారతదేశాని కి రెండో అతిపెద్ద వ్యాపార భాగస్వామి గాను మరియు ఒక ప్రధానమైన భాగస్వామి గాను ఉంది. భారతదేశాని కి మరియు నైజీరియా కు మధ్య ద్వైపాక్షిక వ్యాపారం 2022-23 సంవత్సరం లో 11.8 బిలియన్ యుఎస్ డాలర్ స్థాయి లో ఉంది. 2023-24 సంవత్సరం లో ద్వైపాక్షిక వ్యాపారం క్షీణ ధోరణిని కనబరచి 7.89 బిలియన్ డాలర్ కు పరిమితం అయింది. 27 బిలియన్ యుఎస్ డాలర్ మేరకు మొత్తం పెట్టుబడితో దాదాపు గా 135 భారతీయ కంపెనీలు నైజీరియా లోని చైతన్య భరితం అయినటువంటి బజారు లో వాటి కార్యకలాపాల ను చురుకు గా నిర్వహిస్తున్నాయి. మరి ఈ పెట్టుబడులు అన్నీ కూడాను మౌలిక సదుపాయల కల్పన, తయారీ, వినియోగ వస్తువులు మరియు సేవల వంటి వేరు వేరు రంగాల లో విస్తరించి ఉన్నాయి.

 

 

 

**



(Release ID: 2019704) Visitor Counter : 68