రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

నౌక విధ్వంసక ఆయుధాన్ని సూపర్ సానిక్ మిసైల్ సహాయం తోవిడుదల చేసే వ్యవస్థ ను ఒడిశా కోస్తా తీరాని కి ప్రయోగాత్మకం గా పరీక్షించడం లోసఫలమైన డిఆర్‌డిఒ

Posted On: 01 MAY 2024 12:32PM by PIB Hyderabad

సూపర్ సానిక్ మిసైల్-అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్‌పీడో (ఎస్ఎమ్ఎఆర్‌టి - ‘స్మార్ట్’)) వ్యవస్థ ను 2024 మే నెల 1 వ తేదీ నాడు ఉదయం పూట సుమారు గా 8:30 గంట ల వేళ కు ఒడిశా యొక్క కోస్తా తీరాని కి ఆవల గల డాక్టర్ శ్రీ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ దీవి నుండి ప్రయోగాత్మకం గా పరీక్షించే ప్రక్రియ సఫలం అయింది. నౌక విధ్వంసక ఆయుధాన్ని సూపర్ సానిక్ మిసైల్ సహాయం తో విడుదల చేసే వ్యవస్థ యేస్మార్ట్’. స్మార్ట్ అనేది తరువాతి తరాని కి చెందిన క్షిపణి ఆధారితమైనటువంటి మరియు తక్కువ బరువు ను కలిగివుండేటటువంటి ఆయుధ వ్యవస్థ. ఈ టార్ పీడో యొక్క ఉపయోగం పేలోడ్ (ఉపగ్రహం మోసుకుపోయే విజ్ఞానశాస్త్ర సంబంధి సాధనం) మాదిరి గా ఉంటుంది. దీనిని భారతీయ నౌకాదళం యొక్క జలాంతర్గామి నిరోధక యుద్ధ సామర్థ్యాన్ని సామాన్య టార్ పీడో యొక్క సాంప్రదాయక పరిమితి కంటె బాగా ఎక్కువ గా పెంచడం కోసమని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఒ) ద్వారా తయారు చేయించడం తో పాటు గా అభివృద్ధి పరచడం కూడా జరిగింది.

 

కనిస్తర్-ఆధారితమైనటువంటి ఈ క్షిపణి వ్యవస్థ లో అనేక అడ్వాన్స్‌డ్ సబ్-సిస్టమ్స్ ను జత పరచడమైంది. వాటిలో రెండు దశల తో కూడినటువంటి దృఢమైన ప్రపల్శన్ సిస్టమ్, ఎలక్ట్రోమెకానికల్ ఏక్చుయేటర్ సిస్టమ్, ప్రిసిఝన్ ఇనర్శియల్ నేవిగేశన్ సిస్టమ్ ల వంటివి ఉన్నాయి. ఈ వ్యవస్థ పారాశూట్ ఆధారితమైన విడుదల వ్యవస్థ తో పాటు ఉన్నతీకరించినటువంటి తక్కువ బరువు తో కూడిన టార్‌పీడో ను తనతో మోసుకుపోతుంది.

 

 

ఈ క్షిపణి ని గ్రౌండ్ మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించడమైంది. ఇదే పరీక్ష లో భాగం గా సిమెట్రిక్ సెపరేశన్, ఇజెక్శన్ మరియు వేగ నియంత్రణ వంటి అనేక అత్యాధునిక సదుపాయాల పనితీరు ను నిశితం గా పరీక్షించడమైంది.

 

 

స్మార్ట్ ను విజయవంతం గా ప్రయోగించి పరీక్షించినందుకు డిఆర్‌డిఒ కు మరియు ఈ ప్రక్రియ లో తోడ్పాటు ను అందించిన రక్షణ పరిశ్రమ కు చెందిన ఇతర భాగస్వాముల కు రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ అభినందనలను తెలియ జేశారు. ‘‘ఈ వ్యవస్థ ను అభివృద్ధి పరచడం మన నౌకా దళం యొక్క బలాన్ని మరింత పెచి వేయగలదు’’ అని ఆయన అన్నారు.

 

 

యావత్తు స్మార్ట్ జట్టు యొక్క సహకారాత్మక ప్రయాసల ను రక్షణ విభాగం లో ఆర్&డి కార్యదర్శి మరియు డిఆర్‌డిఒ చెయర్ మన్ డాక్టర్ శ్రీ సమీర్ వి. కామత్ కొనియాడారు. ఉత్కృష్టత మార్గం లో ముందుకు సాగండంటూ వారికి ఆయన విజ్ఞప్తి చేశారు.

 

***


(Release ID: 2019457) Visitor Counter : 281