విద్యుత్తు మంత్రిత్వ శాఖ

జల ప్రవాహం పై తేలియాడే సౌరశక్తి సంబంధి సాంకేతికత ను భారతదేశం లో అమలు పరచడం కోసం నార్వే కు చెందిన కంపెనీతో జట్టు కట్టనున్న ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్

Posted On: 30 APR 2024 12:10PM by PIB Hyderabad

జల ప్రవాహం మీద స్థాపించినటువంటి తేలియాడే సౌర శక్తి పరిశ్రమ (ఫ్లోటింగ్ సోలర్ ఇండస్ట్రి) కు ఒక నిర్దిష్ట సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేది గా కార్యకలాపాల ను నిర్వహిస్తున్నటువంటి మెసర్స్ ఓశన్ సన్ అనే పేరు కలిగిన నార్వే కంపెనీ ఒకదాని తో ఓ అవగాహన పూర్వక ఒప్పంద పత్రం పైన ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ సంతకాలు చేసింది. ఎన్‌హెచ్‌పిసి లిమిటెడ్ భారతదేశం లో విద్యుత్తు అభివృద్ధి రంగం లో అతి పెద్ద సంస్థ గా ఉంది. ఎమ్ఒయు లో పేర్కొన్న ప్రకారం, ఫోటోవోల్టాయిక్ ఫలకాల పై ఆధారపడి పని చేసేటటువంటి ఓశన్ సన్ యొక్క ఫ్లోటింగ్ సోలర్ ఎనర్జీ టెక్నాలజీ ని ఆచరణ లోకి తీసుకు రావడం కోసం సహకారం ప్రధానం అయినటువంటి ప్రముఖ రంగాల ను ఎన్‌హెచ్‌పిసి మరియు ఓశన్ సన్ లు అన్వేషించనున్నాయి. ఈ విధమైన ఫలకాల ను ఎన్‌హెచ్‌పిసి గుర్తించే సంబంధిత స్థలాల లో హైడ్రో-ఇలాస్టిక్ మెమ్బ్రేన్ స్ పై అమర్చడం జరుగుతుంది.

 

ఈ ఒప్పందం ఎన్‌హెచ్‌పిసి యొక్క దీర్ఘకాలిక అభివృద్ధి మరియు నవీకరణ యోగ్య శక్తి ఉత్పాదన సామర్థ్యాన్ని పెంచాలనేప్యాసల లో భాగం. ఎన్ హెచ్ పిసి జల విద్యుత్తు అభివృద్ధి ఒక్కటే కాకుండా సౌర, పవన మరియు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల వంటి విభిన్న నవీకరణ యోగ్య శక్తి ప్రాజెక్టుల లో కూడా నిమగ్నం అయి ఉన్నది.

 

ఎమ్ఒయు పైన ఎన్‌హెచ్‌పిసి కార్యనిర్వాహక సంచాలకుడు (రీన్యూవబుల్ ఎనర్జీ ఎండ్ గ్రీన్ హైడ్రోజన్) శ్రీ వి. ఆర్. శ్రీవాత్సవ తో పాటు ఓశన్ సన్ యొక్క ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ క్రిస్టియన్ టోర్ వాల్డ్ లు 2024 ఏప్రిల్ 29 వ తేదీ నాడు హైబ్రిడ్ పద్ధతి లో సంతకాలు చేశారు. ఈ సంతకాల కార్యక్రమం లో పాలుపంచుకొన్నవారి లో భారతదేశం లో నార్వే రాయబారి మే-ఎలిన్ స్టేనర్ గారు; ఎన్‌హెచ్‌పిసి సంచాలకుడు, సాంకేతిక విషయాలు శ్రీ రాజ్ కుమార్ చౌధరీ మరియు ఎన్‌హెచ్‌పిసి కార్యనిర్వాహక సంచాలకుడు (స్ట్రటిజి బిజినెస్ డివెలప్‌మెంట్ & కన్సల్టెన్సీ) శ్రీ రజత్ గుప్తా లు న్యూ ఢిల్లీ లోని నార్వే రాయబార కార్యాలయం నుండి, నార్వే లో భారత రాయబారి డాక్టర్ శ్రీ ఎక్వినో విమల్ ఓస్లో నుండి ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

 

***

 



(Release ID: 2019164) Visitor Counter : 136