గనుల మంత్రిత్వ శాఖ

కీలకమైన ఖనిజ రంగంలో సాంకేతిక సహకారం కోసం శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుందిఒప్పందం కుదుర్చుకున్న గనుల మంత్రిత్వ శాఖ


న్యూఢిల్లీలో క్లిష్టమైన ఖనిజాలపై ప్రారంభమైన రెండు రోజుల సదస్సు

Posted On: 29 APR 2024 7:33PM by PIB Hyderabad

కీలకమైన  ఖనిజాల ఉత్పత్తిని ఎక్కువ చేయడం, సామర్ధ్య పెంపుదల అనే అంశంపై రెండు రోజుల పాటు జరగనున్న సదస్సు  ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియా హాబిటాట్ సెంటర్‌లో ప్రారంభమైంది. కీలకమైన ఖనిజాల శుద్ధి ,  ప్రాసెసింగ్‌లో సహకారం , ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఈ సదస్సును ఏర్పాటు చేసింది.  గనుల కార్యదర్శి శ్రీ వి ఎల్ కాంతారావు సదస్సు  ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.

సదస్సులో  భూమి ఉపరితలం, సముద్రంలో లభించే వివిధ ఖనిజాల వివరాలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రదర్శన ద్వారా కీలక ఖనిజాల కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించారు.

 

ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన శ్రీ కాంతారావు దేశాభివృద్ధిలో ఖనిజ రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. దేశ ఇంధన అవసరాలు తీర్చడానికి కీలక ఖనిజాల ఆవిష్కరణ వేగంగా జరగాలన్నారు. దేశ అవసరాలు, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఖనిజ అన్వేషణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని శ్రీ కాంతారావు తెలిపారు.  దేశీయ ఖనిజాల అన్వేషణ , ఉత్పత్తిని వేగవంతం చేసే లక్ష్యంతో మినరల్ బ్లాక్ వేలం  సహా ఇటీవల ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలను ఆయన వివరించారు.  సదస్సు లో  శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్ తో గనుల మంత్రిత్వ శాఖ ఒక అవగాహన ఒప్పందంపై (MOU) సంతకం చేసింది. ఈ ఒప్పందం ప్రకారం  గనుల మంత్రిత్వ శాఖ, శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్, కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్ , తెరి  కలిసి వివిధ కార్యక్రమాలు చేపడతాయి. భారతదేశ ఆర్థిక అభివృద్ధి, జాతీయ ఇంధన  భద్రత, తక్కువ-కార్బన్ శక్తి పరివర్తనకు అవసరమైన కీలక ఖనిజ రంగంలో సాంకేతిక సహకారం అందించడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది. 

 

 

దేశంలో శుద్ధి, ఖనిజాల వెలికి తీయడానికి అవసరమైన సామర్థ్యాలనుపెంపొందించడం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనువైన  వ్యూహాల వంటి కీలకమైన అంశాలపై సదస్సులో నిపుణులు చర్చలు జరిపారు.  హైదరాబాద్‌ ఐఐటీ లో ఇండో-ఆస్ట్రేలియన్ క్రిటికల్ మినరల్స్ రీసెర్చ్ హబ్ నెలకొల్పడం, ఖనిజ రంగం అభివృద్ధికి అవసరమైన పరిశోధన అభివృద్ధి కార్యాక్రమాల కోసం మౌలిక సదుపాయాలు కల్పించడానికి మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలపై సదస్సులో చర్చలు జరిగాయి. 

 

 

ప్రారంభ కార్యక్రమం అనంతరం నిర్వహించిన సాంకేతిక సదస్సులో  ప్రైవేటు కంపెనీలు, పరిశోధన అభివృద్ధి సంస్థలు,  విద్యా సంస్థలు,జిఎస్ఐ ,ఎన్ఎఫ్ టీడీసీ  తదితర సంస్థలు  కీలకమైన ఖనిజాల శుద్ధి, ప్రాసెస్ రంగాల్లో   భారతదేశంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు,  ఖనిజాల లభ్యత,  సాంకేతిక అంశాల పై సాంకేతిక సదస్సు జరిగింది. 

 

. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సమర్థవంతమైన ప్రాసెసింగ్ టెక్నాలజీ అవసరం ఉందని గనుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ వీణా కుమారి డి తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఇంధన నిల్వ సాంకేతికతలు లాంటి  కీలక రంగాల్లో అగ్రగామిగా ఉన్న భారతదేశ సామర్థ్యాన్ని ఆమె వివరించారు. , బలమైన దేశీయ సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

 

రెండు రోజుల సదస్సులో ఖనిజ రంగానికి చెందిన వివిధ అంశాలను చర్చిస్తారు.  ఖనిజ ప్రాసెసింగ్‌ రంగంలో  ప్రపంచ కేంద్రంగాభారతదేశాన్ని అభివృద్ధి చేయడం, కీలకమైన  ఖనిజాల రంగంలో స్వీయ-ఆధారిత ,ప్రపంచవ్యాప్తంగా పోటీ పడటానికి అమలు చేయాల్సిన చర్యలను సదస్సులో చర్చిస్తారు.  

***

 



(Release ID: 2019143) Visitor Counter : 93