రక్షణ మంత్రిత్వ శాఖ
కజాకిస్తాన్ లో జరిగిన ఎస్‌సిఒ రక్షణ శాఖ మంత్రుల సమావేశం లో ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ ను బలపరచడమైంది
ఎస్‌సిఒ రీజన్ లో శాంతి, స్థిరత్వం మరియు భద్రత ల పరిరక్షణ కు భారతదేశం దృఢంగా కట్టుబడి ఉంది అని పునరుద్ఘాటించిన రక్షణ శాఖ కార్యదర్శి
ఉగ్రవాదం పట్ల సహనాన్ని ఎంత మాత్రం చూప తగదు అనే వైఖరి ని అవలంబించాలిఅంటూ పిలుపు ను ఇచ్చారు
Posted On:
26 APR 2024 3:50PM by PIB Hyderabad
కజాకిస్తాన్ లోని అస్తానా లో 2024 ఏప్రిల్ 26 వ తేదీ నాడు జరిగిన శంఘాయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ (ఎస్‌సిఒ) యొక్క రక్షణ శాఖ మంత్రుల సమావేశం లో రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధార్ ఆరమానె పాలుపంచుకొన్నారు. సమావేశం సాగిన క్రమం లో, ఎస్‌సిఒ లోని సభ్యత్వ దేశాలన్నిటికి చెందిన రక్షణ శాఖ మంత్రులు ఒక ఒడంబడిక ల ప్రాథమిక పత్రం పైన సంతకాలు చేశారు. సమావేశం అనంతరం ఒక సంయుక్త విజ్ఞప్తి ని జారీ చేయడమైంది. ఆ విజ్ఞప్తి పత్రం లో ఎస్‌సిఒ రక్షణ శాఖ మంత్రులు ఇతర కార్యక్రమాల కు అదనం గా, ప్రాచీన భారతీయ తత్త్వ దర్శనం లో వేళ్లూనుకొన్నటువంటి ‘వసుధైవ కుటుంబకమ్’ లో పేర్కొన్న ‘వన్ అర్థ్, వన్ ఫేమిలీ, వన్ ఫ్యూచర్’ (‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’) అనే భావన ను ముందుకు తీసుకు పోవాలన్న కార్యక్రమం పట్ల కూడాను వారి యొక్క అంగీకారాన్ని వ్యక్తం చేశారు.
ఈ సమావేశం లో రక్షణ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, ఎస్‌సిఒ రీజన్ లో శాంతి, స్థిరత్వం, ఇంకా భద్రత లను పరిరక్షించేందుకు భారతదేశం దృఢమైన నిబద్ధత ను కలిగి ఉంది అంటూ పునరుద్ఘాటించారు. ఎస్‌సిఒ సభ్యత్వ దేశాల లో సమృద్ధి మరియు అభివృద్ధి ల సాధన కోసం ఉగ్రవాదాన్ని , దాని అన్ని రూపాల ను ఎంత మాత్రం సహించ కూడదు అనేటటువంటి వైఖరి ని అవలంబించవలసిన అవసరం ఉంది అని ఆయన స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఉగ్రవాదం విషయం లో ఐక్య రాజ్య సమితి లో ఒక సమగ్రమైన సమ్మేళనాన్ని నిర్వహించాలి అని భారతదేశం చాలా కాలం గా ప్రతిపాదిస్తూ వస్తోంది అని శ్రీ గిరిధర్ అరమానె అన్నారు. ఇండో-పసిఫిక్ రీజన్ కోసం భారతదేశం ప్రతిపాదించినటువంటి ‘సిక్యురిటి ఎండ్ గ్రోథ్ ఫార్ ఆల్ ఇన్ ద రీజన్ (ఎస్ఎజిఎఆర్)’ తాలూకు భావన ను గురించి కూడాను ఆయన ఈ సందర్భం లో ప్రముఖం గా ప్రస్తావించారు.
**
(Release ID: 2019114)
Visitor Counter : 131