సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కామన్వెల్త్ పబ్లిక్ సర్వీస్ సెక్రటరీలు/ క్యాబినెట్ సెక్రటరీల సమావేశ ఫలితాల ప్రకటనలో భారత కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణ వ్యవస్థ ( సీపీజిఆర్ఏఎంఎస్) ఉత్తమ అభ్యాసంగా గుర్తింపు పొందింది

Posted On: 25 APR 2024 1:37PM by PIB Hyderabad

లండన్‌లోని మార్ల్‌బరో హౌస్‌లో 2024 ఏప్రిల్ 22 నుండి 24 వరకు  జరిగిన కామన్వెల్త్ పబ్లిక్ సర్వీస్ సెక్రటరీస్/సెక్రటరీల క్యాబినెట్ మీటింగ్‌లో భారత కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణ వ్యవస్థ (సీపీజిఆర్ఏఎంఎస్)   కామన్వెల్త్ సెక్రటేరియట్ ఒక ఉత్తమ అభ్యాసంగా గుర్తించింది. 2024 ఏప్రిల్ 24న జారీ చేసిన మూడవ ద్వైవార్షిక పాన్-కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ మీటింగ్ ఫలిత ప్రకటనలో, కామన్వెల్త్ సెక్రటేరియట్ సభ్య దేశాలతో... భారత కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణ వ్యవస్థ (సీపీజిఆర్ఏఎంఎస్) ను పంచుకుంది. నమీబియాకి చెందిన పౌర నమోదు మరియు ముఖ్యమైన గణాంకాల వ్యవస్థ (సివిఆర్ఎస్) అయిన గుర్తింపు నిర్వహణ వ్యవస్థలు, కెన్యాకు చెందిన హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఈ-సిటిజన్ మోడల్‌లు కామన్వెల్త్ అంతటా భవిష్యత్తు-సిద్ధమైన పాలనా ఉత్తమ అభ్యాసాలుగా పరస్పరం పంచుకున్నారు. 

 

 డిఏపిఆర్ జి సెక్రటరీ  శ్రీ వి. శ్రీనివాస్  కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం మరియు పర్యవేక్షణ వ్యవస్థపై ప్రజెంటేషన్ చేస్తున్నారు

 

కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం మరియు పర్యవేక్షణ వ్యవస్థ (సీపీజిఆర్ఏఎంఎస్)పై  ఏప్రిల్ 23, 2024న అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ (డిఏఆర్పిజి) శాఖ కార్యదర్శి శ్రీ వి. శ్రీనివాస్ భరత్ తరఫున ప్రదర్శన ఇచ్చారు. కామన్వెల్త్ సభ్య దేశాల నుండి ప్రపంచ అత్యుత్తమ అభ్యాసంగా  ప్రశంసలు అందుకున్నారు. . కామన్వెల్త్ సెక్రటరీ జనరల్, శ్రీమతి ప్యాట్రిసియా స్కాట్లాండ్ కేసి మాట్లాడుతూ, " సీపీజిఆర్ఏఎంఎస్ అనేది అత్యాధునిక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ మరియు స్మార్ట్ ప్రభుత్వం ఉత్తమ అభ్యాసం అని అన్నారు. కామన్వెల్త్ మిగిలిన 1.2 బిలియన్ పౌరులు టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌ను స్వీకరించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. అదే విధంగా భారతదేశంలోని 1.4 బిలియన్ పౌరులు ప్రయోజనం పొందారు." అని ఆమె తెలిపారు. 

పాలనలో ఏఐని అవలంబించడంపై దృష్టి సారించడంతో 'ప్రజా సేవల పంపిణీని మెరుగుపరచడానికి స్మార్ట్ ప్రభుత్వాన్ని సంస్థాగతీకరించడం' సమావేశం ఇతివృత్తం. కామన్వెల్త్ పబ్లిక్ సర్వీస్ హెడ్స్, క్యాబినెట్ సెక్రటరీలు, సీనియర్ పబ్లిక్ ఆఫీసర్లు, ఇండస్ట్రీ ఛాంపియన్లు,  ప్రముఖ పండితులను ఫోరమ్ ఒకచోట చేర్చింది.

2024 ఏప్రిల్ 22 నుండి 24వ తేదీ వరకు లండన్‌లోని మార్ల్‌బరో హౌస్‌లోని సమావేశం అయిన కామన్వెల్త్ పబ్లిక్ సర్వీస్ హెడ్స్/ క్యాబినెట్  సెక్రటరీలు.

కామన్వెల్త్ అంతటా సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాను సాధించడం, సరైన సర్వీస్ డెలివరీ కోసం ఇ-సేవలను అందించడానికి సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చనే దానిపై సమకాలీన జ్ఞానం, ఆలోచనలు, అనుభవాలను పంచుకోవడం ఈ సమావేశం ప్రాథమిక లక్ష్యాలు. ఇది కొన్ని సభ్య దేశాల ఎంపిక సంబంధిత కేస్ స్టడీస్‌ను పంచుకోవడం, సాధ్యమైన భాగస్వామ్యం, సహకారం కోసం అవకాశాలను గుర్తించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.

 ఈ సమావేశంలో భూటాన్ రాయల్ కింగ్‌డమ్ ప్రధాన మంత్రి హోన్ షెరింగ్ టోబ్‌గే, కామన్వెల్త్ సెక్రటరీ జనరల్ ది ఆర్ట్ హాన్ ప్యాట్రిసియా స్కాట్లాండ్ కెసి ప్రసంగించారు. డిజిటల్ గవర్నమెంట్ ప్రాముఖ్యతపై ప్రస్తుతం ఎక్కువ ప్రశంసలు లభిస్తున్నాయని సమావేశం గుర్తించింది. ఇది అనేక అధికార పరిధులలో ఇ-సేవలను ప్రారంభించడంలో ఊతం ఇచ్చింది. వాస్తవానికి, సురక్షితమైన, సమగ్రమైన, స్థిరమైన సమాచారం, డేటా ఆధారిత కమ్యూనికేషన్ సాంకేతికతలపై ఆధారపడటం ద్వారా ప్రజా సేవలను అందించే విధానంలో చెప్పుకోదగ్గ మెరుగుదల ఉంది

రువాండా, కెన్యా, ఇండియా, నమీబియా నుండి ప్రతినిధులు సమర్పించిన పత్రాలు, దేశ అధ్యయనాలను ప్రతినిధులు ప్రశంసించారు. నెట్‌వర్కింగ్ మరియు పబ్లిక్ సర్వీస్ మేనేజ్‌మెంట్‌పై జ్ఞానం, నైపుణ్యం, ఆలోచనలను పంచుకోవడానికి ఫోరమ్ ఒక ముఖ్యమైన వేదికగా మిగిలిపోయిందని పేర్కొన్నారు.

డిజిటల్ విభజనను తొలగించడానికి ప్రయత్నిస్తున్న చోగమ్ ఆదేశాన్ని సభ్య దేశాలు ధృవీకరించాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి పరివర్తన సాంకేతికతల ప్రాముఖ్యతను గుర్తించాయి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్డిజిలు) అందించడానికి, ముఖ్యంగా విద్య, ఆరోగ్య సంరక్షణ, పరిశుభ్రమైన నీటికి ప్రాప్యతను మెరుగుపరచడం ద్వారా శక్తి, వాతావరణ మార్పు, పేదరికం, ఆకలి అంశాలలో సవాళ్లను ఎదుర్కోవడానికి, వృద్ధి, అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఏఐ భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న పాలనా సంస్థలు మరియు చురుకైన ప్రభుత్వాలకు సామర్థ్యాన్ని కలిగి ఉందని సభ్య దేశాలు గుర్తించాయి. కామన్వెల్త్ అంతటా, ప్రత్యేకించి చిన్న రాష్ట్రాల్లో ఏఐని స్వీకరించడం కోసం, కామన్వెల్త్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్సార్టియం (సిఏఐసి) పనిని కూడా వారు స్వాగతించారు.

కామన్వెల్త్ హబ్ ఫర్ ది బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ గురించి సమావేశంలో వివరించబడింది, దీని లక్ష్యం ప్రభుత్వాలు మెరుగైన, వేగవంతమైన, అందుబాటులో ఉండే ప్రజా సేవలను అందించడానికి సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, అమలులోని వివిధ అంశాలపై విజ్ఞాన భాగస్వామ్య నెట్‌వర్క్‌లను సృష్టించడం, సుపరిపాలనను ప్రోత్సహించడం, సాఫల్యతను సులభతరం చేయడం. సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండా.
న్యాయ వ్యవస్థలను బలోపేతం చేయడంలో సాంకేతికత ప్రభావాన్ని సభ్య దేశాలు ప్రశంసించాయి.  అనేక కామన్వెల్త్ అధికార పరిధిలో న్యాయానికి ప్రాప్యతను సులభతరం చేయడంలో చిన్న దావా కోర్టులు పోషిస్తున్న ముఖ్యమైన పాత్రను గుర్తించాయి. సాంకేతిక సహాయం కోసం స్థిరమైన నిధుల ప్రాముఖ్యతపై సభ్య దేశాలు ఒక నివేదికను అందుకున్నాయి.
కామన్వెల్త్ సెక్రటరీ జనరల్, శ్రీమతి ప్యాట్రిసియా స్కాట్లాండ్ కేసి అమూల్యమైన నాయకత్వాన్ని అందించినందుకు ప్రతినిధులు ఆమెకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఫలవంతమైన, విజయవంతమైన సమావేశాన్ని నిర్వహించినందుకు కామన్వెల్త్ సెక్రటేరియట్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాన ఉపన్యాసం అందించినందుకు భూటాన్ ప్రధాన మంత్రి హాన్ షెరింగ్ టోబ్‌గే, అందరు వక్తలు, రిసోర్స్ పర్సన్‌లు, డెలిగేట్‌లు చురుగ్గా పాల్గొన్నందుకు,  సమావేశ చర్చలు, ఫలితాలకు విలువైన సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సమావేశం ముగిసింది.

 

***


(Release ID: 2019112) Visitor Counter : 72