రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

పుణె లో సాయుధబలగాల వైద్య కళాశాల లో జరిగిన 58 వ బేచ్ యొక్క పాసింగ్ అవుట్ పరేడ్


భారతీయ సాయుధ బలగాల లో చేరిన 112 మంది వైద్య పట్టభద్రులు

Posted On: 25 APR 2024 1:12PM by PIB Hyderabad

పుణె లోని సాయుధ బలగాల వైద్య కళాశాల కు చెందిన 58 వ బేచ్ లోని 112 మంది వైద్య పట్టభద్రుల ను 2024 ఏప్రిల్ 25 వ తేదీ నాడు ఎఎఫ్ఎమ్‌సి లోని కెప్టెన్ దేవాశీశ్ శర్మ, కీర్తి చక్ర పరేడ్ గ్రౌండు లో జరిగిన ఒక విశేష కార్యక్రమం లో భారతీయ సాయుధ బలగాల లోకి చేర్చుకోవడమైంది.

 

ఈ కార్యక్రమాని కి ముఖ్య అతిథి గా డైరెక్టర్ జనరల్ ఆర్మ్‌ డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (డిజిఎఎఫ్ఎమ్ఎస్) మరియు ఆర్మీ మెడికల్ కోర్ కు చెందిన సీనియర్ కర్నల్ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ శ్రీ దళ్ జీత్ సింహ్ విచ్చేశారు. ఆయన కమిశనింగ్ పరేడ్ ను పరిశీలించారు. ఈ పరేడ్ కు మెడికల్ కేడెట్ (ప్రస్తుతం లెఫ్టినెంట్) శ్రీ సుశీల్ కుమార్ సింహ్ సారథ్యం వహించారు.

 

 

క్రొత్త గా విధుల లోకి చేర్చుకొన్న అధికారుల కు డిజిఎఎఫ్ఎమ్ఎస్ అభినందనల ను తెలియజేస్తూ, వారు అత్యున్నత సమర్పణ భావం తో దేశాని కి మరియు సాయుధ బలగాల కు సేవ చేయవలసిందంటూ ఉద్బోధించారు. వారికి ప్రకాశవంతమైనటువంటి మరియు సమృద్ధం అయినటువంటి భవిష్యత్తు లభించాలంటూ ఆయన ఆకాంక్షించారు.

 

 

ఎఎఫ్ఎమ్‌సి లో 58 వ బ్యాచ్ కు చెందిన సైనిక విద్యార్థులు 2023 శీతకాల ఎమ్‌యుహెచ్ఎస్ పరీక్షల లో అద్భుతం గా రాణించారు. పొరుగున ఉన్న మిత్ర దేశాల కు చెందిన అయిదుగురు కేడెట్స్ సహా మొత్తం 147 మంది సైనిక విద్యార్థులు పట్టభద్రులు గా నిలచారు. సాయుధ బలగాల వైద్య సేవల లో ప్రవేశించిన 112 మంది కేడెట్స్ లో 87 మంది పురుష సైనిక విద్యార్థులు మరియు 25 మంది మహిళా సైనిక విద్యార్థులు ఉన్నారు. 88 మంది ని సైన్యం లో చేర్చుకోగా, పది మందిని నౌకా దళం లో, మరి పద్నాలుగు మంది ని వాయు సేన లోకి చేర్చుకొన్నారు.

 

 

త్రివిధ దళాల లోకి సైనిక విద్యార్థుల ను చేర్చుకొన్న కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం, మార్గదర్శక ప్రాయమైనటువంటి విద్యా సంబంధమైన ఘనతల ను సాధించినందుకు గాను కేడెట్ లకు ఎకడెమిక్ అవార్డుల ను అందించే కార్యక్రమం జరిగింది. ఈ కళాశాల లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు రాష్ట్రపతి బంగారు పతకం, ఇంకా కళింగ ట్రాఫి. ఈ సంవత్సరం లో రాష్ట్రపతి బంగారు పతకాన్నిఫ్లయింగ్ ఆఫీసర్ శ్రీ ఆయుష్ జయ్‌స్వాల్ కు మరియు కళింగ ట్రాఫిని సర్జన్ సబ్ లెఫ్టింనెంట్ బాణి కౌర్ గారి కి ప్రదానం చేయడమైంది.

 

దేశం లో కెల్లా అయిదు అగ్రగామి వైద్య కళాశాల లో స్థానాన్ని సంపాదించుకోవడం తో పాటు నాణ్యమైన వైద్య విద్య ను, ఆరోగ్య సంరక్షణ సేవల ను అందించేందుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ను తెచ్చుకొన్న ఎఎఫ్ఎమ్‌సి కి దేశ ప్రజల కు 75 సంవత్సరాల పాటు గొప్ప సేవ ను చేసినందుకు గాను ‘ప్రెసిడెంట్స్ కలర్’ పురస్కారాన్ని భారతదేశం యొక్క రాష్ట్రపతి మాన్యురాలు శ్రీమతి ద్రౌపది ముర్ము 2023 డిసెంబరు 1 వ తేదీ న ప్రదానం చేశారు. ఈ కళాశాల కు ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ యూనిట్ సైటేశన్’ ను కూడా 2024 మార్చి నెల 18 వ తేదీ నాడు జనరల్ శ్రీ అనిల్ చవ్హాణ్, పివిఎస్ఎమ్, యువైఎస్ఎమ్, ఎవిఎస్ఎమ్, ఎస్ఎమ్, ఇంకా విఎస్ఎమ్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్) ప్రదానం చేశారు.

 

సర్వీసు లో ఉన్న ఉన్నతాధికారులు, పూర్వ అధికారులు, అధ్యాపక అధికారులతో పాటు వైద్యం మరియు నర్సింగ్ విభాగాల కు చెందిన కేడెట్ లు, సైన్యం లో చేర్చుకొన్న కేడెట్ ల యొక్క తల్లితండ్రులు మరియు కేడెట్ ల యొక్క కుటుంబ సభ్యులు కూడా ను ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో ఉన్నారు.

 

ఈ విశేషమైన పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమాన్ని లెఫ్టినెంట్ జనరల్ శ్రీ నరేంద్ర కోట్ వాల్, ఎవిఎస్ఎమ్, ఎస్ఎమ్, విఎస్ఎమ్ డైరెక్టరు & కమాండెంట్ తో పాటు మేజర్ జనరల్ శ్రీ గిరిరాజ్ సింహ్ డీన్ మరియు డిప్యూటీ కమాండెంట్ ఎఎఫ్ఎమ్‌సి ల ఆధ్వరం లో నిర్వహించడమైంది.

 

 

 

**



(Release ID: 2018939) Visitor Counter : 39