విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ శక్తిసమ్మేళనం లో భాగం అయిన మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో శక్తి సంబంధిభద్రత, ప్రాప్తి మరియుస్థిరత్వం ల కలయిక తో ఉనికి లోకి వస్తున్న శక్తి  పరిదృశ్యాన్ని నిర్వహించే పద్ధతుల పైచర్చించడమైంది

Posted On: 25 APR 2024 11:00AM by PIB Hyderabad

నెదర్‌లాండ్స్ లోని రాటర్ డేమ్ లో జరుగుతున్న వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ యొక్క ఇరవై ఆరో సంచిక లో భాగం గా 2024 ఏప్రిల్ 24 వ తేదీ నాడు మంత్రుల స్థాయి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ను నిర్వహించడమైంది. ఈ సమావేశం లో దుబయి లో జరిగిన సిఒపి28 యుఎన్ క్లయిమేట్ ఛేంజ్ కాన్ఫరెన్స్ ద్వారా అత్యంత ప్రభావం పడే సందర్బాల పైన చర్చించారు. మంత్రుల స్థాయి సమావేశం లో శక్తి సంబంధ రంగం లో నూతన ఆవిష్కరణలు, సహకారం లతో పాటు విభిన్నమైన రూపుల ను సంతరించుకొంటున్న శక్తి సంబంధి అవసరాల లో రాబోయే సమస్యల ను పరిష్కరించడం ఎలాగన్న అంశాల ను కూడా చర్చించారు. ప్రపంచ శక్తి రంగ సమ్మేళనం (వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్) లో మూడవ రోజు న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం లో నెదర్‌లాండ్స్ ఉప ప్రధాని మరియు జలవాయు, ఇంకా శక్తి విధానం శాఖ మంత్రి శ్రీ రాబ్ జెట్ టెన్ పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమం లో భారత ప్రభుత్వం లోని విద్యుత్తు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ అగ్రవాల్ తో పాటు వివిధ దేశాల మరియు సంస్థ ల సీనియర్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.

 

సమావేశం సాగిన క్రమం లో, కేంద్ర విద్యుత్తు శాఖ కార్యదర్శి తన ప్రసంగం లో ప్రపంచ శక్తి సంబంధి పరివర్తన లో విధానపరమైన ఉత్ప్రేరకం యొక్క ప్రాముఖ్యాన్ని గురించి నొక్కి పలుకుతూ సిఒపి28 లో భారతదేశం పోషించినటువంటి కీలకమైన పాత్ర ను గురించి ప్రముఖం గా పేర్కొన్నారు. ప్రపంచం క్రొత్త శక్తి వినియోగం దిశ లో పయనించేందుకు విధాన పరమైన ఉత్ప్రేరకం గా సిఒపి28 కి ఉన్న ప్రాముఖ్యాన్ని ఆయన స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం లో శక్తి దక్షత సంస్కరణ తాలూకు ప్రపంచ రేటు ను రెట్టింపు చేసుకోవడం మరియు 2030 వ సంవత్సరాని కల్లా ప్రపంచ నవీకరణ యోగ్య శక్తి సామర్థ్యాన్ని మూడు రెట్లు మేర పెంపొందింప చేసుకోవాలన్న సిఒపి28 నవీకరణ యోగ్య శక్తి మరియు శక్తి దక్షత వాగ్దానాల దిశ లో కార్యాల ను చేపట్టడం జి-20 న్యూ ఢిల్లీ లీడర్స్ డిక్లరేశన్ భారతదేశం యొక్క ప్రయాసల తాలూకు ఒక ప్రమాణం గా ఉంది అని ఆయన అన్నారు. సిఒపి27 మరియు జి20 వేదికల లో ప్రపంచ సర్వసమ్మతి దిశ లో ముందుకు పోతూ దీర్ఘకాలిక జీవన శైలి ని సమర్థించడం కోసం భారతదేశం ప్రతిపాదించినటువంటి మిశన్ లైఫ్ ను ప్రశంసించడమైందన్నారు. కార్బన్ కేప్చర్, యూటిలైజేశన్ ఎండ్ స్టోరేజ్ (సిసియుఎస్) మరియు గ్రీన్ హైడ్రోజన్ లకు పెద్ద పీట ను వేయడం తో పాటు గా కర్బన తటస్థత దిశ లో పరివర్తన ను తీసుకు రావడానికి సిఒపి28 ఇచ్చిన ప్రాధాన్యాన్ని గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

 

 

శక్తి వినియోగం అంశం లో ఇంతవరకు అనుసరిస్తున్న పద్ధతుల నుండి సరిక్రొత్త మార్గాల కు మళ్ళే ప్రక్రియలోని సంక్లిష్టత ను గురించి విద్యుత్తు శాఖ కార్యదర్శి వివరిస్తూ, ఈ ప్రక్రియ లో అన్ని వర్గాల ను కలుపుకొంటూ, ముందుకు పోవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రీవేంప్‌ డ్ ఇండియా ఎనర్జీ సెక్యూరిటీ సినారియోస్ (ఐఇఎస్ఎస్) 2024 డాశ్ బోర్డ్ (https://iess2047.gov.in/) వంటి సాధనాల తో పాటు సాంకేతికత మోహరింపు మరియు సహకారాల భూమిక ను కూడా ఆయన ప్రస్తావించారు. ఇవి సరి అయినటువంటి నిర్ణయాల ను తీసుకోవడం లో తోడ్పడుతాయన్నారు. పిఎమ్-కెయుఎస్ యుఎమ్ (PM-KUSUM) స్కీము మరియు ఇళ్ళ పైకప్పుల మీద సౌర శక్తి ఆధారిత విద్యుత్తు ఉత్పాదన కార్యక్రమం ల వంటి కార్యక్రమాలు పర్యావరణపరమైన స్థిరత్వాని కి, ఇంకా ఉద్యోగాల కల్పన కు ప్రోత్సాహాన్ని ఇవ్వడం తో పాటు శక్తి సంబంధి భద్రత , ప్రాప్తి మరియు శక్తి సంబంధి సుస్థిరత లను సమతౌల్య పరచడం లో మహత్వపూర్ణమైన భూమిక ను నిర్వర్తిస్తున్నాయన్నారు. ఇండియన్ కార్బన్ మార్కెట్ స్థిరత్వ ప్రయాసల ను మరింత గా ముందుకు తీసుకు పోతుంది అని ఆయన అన్నారు.

సమావేశం లో పాలుపంచుకొన్న వారి ని ఉద్దేశించి కార్యదర్శి మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశాలు శక్తి సంబంధి సంకటాన్ని ప్రభావశీలమైన రీతి న ఎదుర్కోవడం కోసం ఆర్థిక పోషణ మరియు స్వచ్ఛమైనటువంటి సాంకేతికత ల ప్రాప్తి వంటి విషయాల లో సహాయాన్ని అందించడం అవసరం అని పేర్కొన్నారు.

 

 

https://youtu.be/xVllU-hEQuA?si=KVD5daAzrx8Ut8JS

 

 

ఇరవై ఆరో వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ ను గురించి

ఇరవై ఆరో వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ సంపూర్ణ ప్రపంచం లో స్దచ్చమైనటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి శక్తి సంబంధి పరివర్తన ల విషయం లో నాయకత్వాన్ని సమకూర్చడం లో ఒక ముఖ్యమైన మలుపు ను ఆవిష్కరించగలదన్న ఆశ ఉంది. ప్రజల కోసం మరియు పుడమి కోసం శక్తి వినియోగ పద్ధతి కి సరిక్రొత్త రూపు రేఖ లను అందించడంఅనే ఇతివృత్తం తో నాలుగు రోజుల పాటు ఈ సమావేశాలు ప్రపంచ శక్తి రంగం లో వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ చేస్తూ వస్తున్న కృషి కి వంద సంవత్సరాలు అయినందుకు ప్రతీక గా ఉన్నది. కౌన్సిల్ అభిప్రాయం లో, ఈ సమ్మేళనం ప్రపంచం లో శక్తి వినియోగం సంబంధి పరివర్తన ను ఆవిష్కరించే ప్రయత్నం లో ఒకదానితో మరొకటి పరస్పరం జత పడినటువంటి శక్తి సమాజాల యొక్క పాత్ర ఏమిటి అనేది కనుగొనడం కోసం నడుం బిగిస్తున్నది. ఆ సమాజాల సరళి ని ముందస్తు గా అంచనా కట్టడం కొంచెం కఠినమే అని చెప్పాలి. అవి ఎక్కువ అశాంతి తోను మరియు శరవేగం గా మార్పునకు లోనయ్యేవి గాను ఉన్నాయి.

 

వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ ఇండియా ను గురించి

వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ ఇండియా అనేది వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ లో (డబ్ల్యుఇసి) లో ఒక సభ్యత్వ దేశం గా ఉంది, 1923 వ సంవత్సరం లో వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ ను స్థాపించడమైంది. అంతరాయాల కు తావు ఉండని విధం గా శక్తి యొక్క సరఫరా ను మరియు వినియోగాన్ని ప్రోత్సహించాలి అనేది దీని లక్ష్యం గా ఉంది. డబ్ల్యుఇసి ఇండియా 1924 వ సంవత్సరం లో వరల్డ్ ఎనర్జీ కౌన్సిల్ లో మునుముందుగా చేరినటువంటి సభ్యత్వ దేశాల లో ఒకటి గా ఉంది. డబ్ల్యుఇసి ఇండియా భారత ప్రభుత్వం యొక్క విద్యుత్తు మంత్రిత్వ శాఖ సంరక్షణ లో బొగ్గు మంత్రిత్వ శాఖ, నూతన & నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ, పెట్రోలియమ్ & సహజ వాయువుల మంత్రిత్వ శాఖ లతో పాటుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ల సహకారం తో పనిచేస్తున్నది.

 

ఈ క్రింద ఇచ్చిన లింకు ను కూడా చదువగలరు:

 

వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ 2024 లో పాలుపంచుకొన్న భారతదేశం: ఇండియా పెవిలియన్ ను ప్రారంభించిన విద్యుత్తు శాఖ కార్యదర్శి మరియు నెదర్‌లాండ్స్ లో భారతదేశం యొక్క రాయబారి

 

 

 

***

 


(Release ID: 2018843) Visitor Counter : 170