ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

ఈ నెల 26న తిరుపతి, హైదరాబాద్‌లో ఉప రాష్ట్రపతి పర్యటన


తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు

హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్‌ను సందర్శించనున్న ఉప రాష్ట్రపతి

प्रविष्टि तिथि: 24 APR 2024 5:49PM by PIB Hyderabad

భారత ఉప రాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌ఖడ్‌ ఈ నెల 26న తిరుపతి, హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన మొత్తం ఒక రోజులో పూర్తవుతుంది.

తొలుత, తిరుమల వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకుంటారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పర్యటన ప్రారంభమవుతుంది. తర్వాత, తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం 3వ స్నాతకోత్సవానికి శ్రీ ధన్‌ఖడ్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు.

తిరుపతిలో స్నాతకోత్సవం ముగిసిన తర్వాత హైదరాబాద్‌ చేరుకుని, భారత్ బయోటెక్ కేంద్రాన్ని ఉప రాష్ట్రపతి సందర్శిస్తారు. 

***


(रिलीज़ आईडी: 2018840) आगंतुक पटल : 134
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Tamil , Kannada , Urdu , हिन्दी , Marathi