సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

లండన్ లో జరిగిన కామన్వెల్త్ స్థాయి ప్రజా సేవలు/ కేబినెట్ సెక్రటరీ స్థాయి అధికారుల 3వ ద్వైవార్షిక సమావేశంలో పాల్గొన్న కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగానికి చెందిన భారత ప్రతినిధి బృందం


'మెరుగైన సేవలు అందించడానికి సుపరిపాలనను సంస్థాగతీకరించడం' ఇతివృత్తంపై జరిగిన సమావేశం

ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్‌ని ఉపయోగించి సిపిగ్రామ్స్ పోర్టల్ ద్వారా ప్రజా ఫిర్యాదులు పరిష్కరించడానికి భారతదేశం అనుసరిస్తున్న విధానాన్ని ప్రశంసించిన కామన్వెల్త్ సభ్య దేశాలు

Posted On: 24 APR 2024 12:41PM by PIB Hyderabad

సుపరిపాలన అందించడానికి సిపిగ్రామ్స్ అత్యాధునిక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా ఉపకరిస్తుందని కామన్వెల్త్ సెక్రటేరియట్ గుర్తించింది. లండన్ మార్ల్‌బరో హౌస్‌లో 2024 ఏప్రిల్ 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు జరిగే కామన్వెల్త్ స్థాయి ప్రజా సేవలు/ కేబినెట్ సెక్రటరీ స్థాయి అధికారుల 3వ ద్వైవార్షిక సమావేశంలో  సిపిగ్రామ్స్ పై సవివరణ ప్రదర్శన ఇవ్వాలని  భారత పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ప్రతినిధుల బృందాన్ని కామన్వెల్త్ సెక్రటేరియట్ ఆహ్వానించింది. పరిపాలనలో ఏఐ కి ప్రాధాన్యత ఇస్తూ 'మెరుగైన సేవలు అందించడానికి సుపరిపాలనను సంస్థాగతీకరించడం' ఇతివృత్తంపై  సమావేశం జరిగింది.   ఈ సమావేశానికి కామన్వెల్త్‌లోని దాదాపు 50 సభ్య దేశాలు హాజరవుతున్నాయి. 

ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం భారతదేశంలో అమలు చేస్తున్న కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పర్యవేక్షణ వ్యవస్థ  (సిపిగ్రామ్స్) పనితీరును  భారత పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి శ్రీ. వి. శ్రీనివాస్ 2024 ఏప్రిల్ 23న వివరించారు. సిపిగ్రామ్స్ అమలుపై సభ్య దేశాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ స్థాయిలో వ్యవస్థ అమలు జరగాలని సభ్య దేశాల ప్రతినిధులు పేర్కొన్నారు. కామన్వెల్త్ సెక్రటరీ జనరల్, శ్రీమతి ప్యాట్రిసియా స్కాట్లాండ్ కేసి  మాట్లాడుతూ " సిపిగ్రామ్స్ ఒక   అత్యాధునిక ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ . సుపరిపాలన అందించడానికి  ఉత్తమ విధానం.సిపిగ్రామ్స్ ద్వారా భారతదేశానికి చెందిన 140 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలిగింది.   వ్యవస్థను అమలు చేయడం వల్ల  కామన్వెల్త్ దేశాలకు చెందిన  మిగిలిన 120 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.' అని అన్నారు.   

తమ దేశాల్లో సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థగా సిపిగ్రామ్స్ ను అమలు చేయడానికి అవకాశాలు ఉన్నాయని సమావేశంలో పాల్గొన్న  కామన్వెల్త్ సభ్య దేశాల ప్రతినిధులు తెలిపారు. సిపిగ్రామ్స్ అమలు తీరును  కెన్యా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఆంథోనీ ముచిరి, టాంజానియాలో సేవల శాశ్వత కార్యదర్శి  జెనా సయ్యద్ అహ్మద్,జాంబియా కేబినెట్ సెక్రటరీ   పాట్రిక్ కంగ్వా, బోట్స్వానా శాశ్వత కార్యదర్శి ఎమ్మా పెలోలెట్సే,ఇతర క్యాబినెట్ కార్యదర్శులు, శాశ్వత కార్యదర్శులు, ఉగాండా, మాల్దీవులు, గ్రెనడా ప్రతినిధులు ప్రశంసించారు.  ఒక విప్లవాత్మక  సంస్కరణగా, పరివర్తన పాలనకు సమర్థవంతమైన సాధనంగా సిపిగ్రామ్స్ పనిచేస్తుందని అన్నారు

3 రోజుల సదస్సులో భాగంగా కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం కార్యదర్శి  శ్రీ వి.శ్రీనివాస్, కామన్వెల్త్ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ శ్రీమతి ప్యాట్రిసియా స్కాట్లాండ్ కేసి ల  మధ్య స్నేహపూర్వక మరియు నిర్మాణాత్మక ద్వైపాక్షిక సమావేశం  జరిగింది.

కేంద్ర పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం ప్రదర్శనలో  ముఖ్య ముఖ్యాంశాలు:

1. ప్రజలు, ప్రభుత్వం మధ్య అంతరం తగ్గించడానికి, ప్రజలకు సాధికారత కల్పించడానికి,పరిపాలనలో పారదర్శకత , జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. 

2. 10 దశల్లో సిపిగ్రామ్స్ సంస్కరణలు అమలు జరుగుతున్నాయి. సిపిగ్రామ్స్  అమలు వల్ల ఫిర్యాదులు సమర్థంగా, తక్కువ సమయంలో పరిష్కారం అవుతున్నాయి. 

3.  నెలకు 1.5 లక్షల ఫిర్యాదులను పరిష్కరించడంలో భారతదేశం విజయం సాధించింది.   సిపిగ్రామ్స్   పోర్టల్‌లో  ఫిర్యాదులు స్వీకరించడానికి 1.02 లక్షల అధికారులు పని చేస్తున్నారు. 

4. ఏఐ /ఎంఎల్  పద్ధతులను ఉపయోగించి అభివృద్ధి చేసిన  ఇంటెలిజెంట్ గ్రీవెన్స్ మానిటరింగ్ డ్యాష్‌బోర్డ్, ట్రీ డ్యాష్‌బోర్డ్ సాక్ష్యం-ఆధారిత విధాన రూపకల్పన జరిగింది. 

5. సిపిగ్రామ్స్ వెర్షన్ 8.0 అభివృద్ధి చేయడానికి  ప్రభుత్వం  128 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. రాబోయే 2 సంవత్సరాల కాలంలో ప్రాజెక్టు  అమలు జరుగుతుంది. 

 

***



(Release ID: 2018734) Visitor Counter : 75