రక్షణ మంత్రిత్వ శాఖ
వైస్ ఎడ్ మిరల్శ్రీ దినేశ్ కుమార్ త్రిపాఠి ని నౌకా దళాని కి తదుపరి ప్రధాన అధికారి గా నియమించడమైంది
Posted On:
19 APR 2024 9:20AM by PIB Hyderabad
పివిఎస్ఎమ్, ఎవిఎస్ఎమ్ మరియు ఎన్ఎమ్ సమ్మానాల గ్రహీత వైస్ ఎడ్ మిరల్ శ్రీ దినేశ్ కుమార్ త్రిపాఠి ని నౌకా దళాని కి తదుపరి ప్రధాన అధికారి గా ప్రభుత్వం నియమించింది. ఆయన 2024 ఏప్రిల్ 30 వ తేదీ మధ్యాహ్నం తరువాత తన పదవీబాధ్యతల ను స్వీకరించనున్నారు. ప్రస్తుతం లో ఆయన నౌకాదళాని కి ఉప ప్రధాన అధికారి గా ఉంటున్నారు. నౌకాదళం వర్తమాన ప్రధాన అధికారి ఎడ్ మిరల్ గా ఉన్న పివిఎస్ఎమ్, ఎవిఎస్ఎమ్ మరియు విఎస్ఎమ్ సమ్మానాల గ్రహీత శ్రీ ఆర్. హరి కుమార్ 2024 ఏప్రిల్ 30 వ తేదీ న పదవీ విరమణ చేయనున్నారు.
వైస్ ఎడ్ మిరల్ శ్రీ దినేశ్ కుమార్ త్రిపాఠి 1964 మే నెల 15 వ తేదీ నాడు జన్మించారు. ఆయన ను 1985 జులై నెల 1 వ తేదీ న భారతీయ నౌకాదళం లో ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లో నియమించడమైంది. ఆయన కమ్యూనికేశన్ మరియు ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ లో చేయి తిరిగిన వ్యక్తి. నౌకాదళం లో దాదాపు 39 సంవత్సరాల పాటు ఆయన దీర్ఘమైనటువంటి మరియి విశిష్టమైనటువంటి సేవల ను అందించారు. ఆయన నౌకాదళం ఉప ప్రధాన అధికారి గా పదవీబాధ్యతల ను స్వీకరించడాని కంటే ముందు పశ్చిమ నౌకాదళం లో ఫ్లేగ్ ఆఫిసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ గా పనిచేశారు.
వైస్ ఎడ్ మిరల్ శ్రీ డి.కె. త్రిపాఠి ఇది వరకు భారతీయ నౌకాదళం లో వినాశ్, కిర్చ్ మరియు త్రిశూల్ నౌకల కు సారథ్య బాధ్యతల ను వహించారు. దీనికి అదనం గా ఆయన వివిధ హోదాల లో బాధ్యతల ను నిర్వర్తించారు. ఆ బాధ్యతల లో వెస్టర్న్ ఫ్లీట్ లో ఫ్లీట్ ఆపరేశన్ ఆఫిసర్; నేవల్ ఆఫరేశన్స్ లో డైరెక్టర్; నెట్ వర్క్ సెంట్రిక్ ఆపరేశన్స్ యొక్క ప్రిన్సిపల్ డైరెక్టర్ మరియు న్యూ ఢిల్లీ లో నేవల్ ప్లాన్స్ యొక్క ప్రిన్సిపల్ డైరెక్టర్ వంటివి ఉన్నాయి.
రియర్ ఎడ్ మిరల్ హోదా లో ఆయన నేవల్ స్టాఫ్ కు అసిస్టెంట్ చీఫ్ (పాలిసీ ఎండ్ ప్లాన్స్) గా మరియు ఈస్టర్న్ ఫ్లీట్ లో ఫ్లేగ్ ఆపిసర్ కమాండింగ్ గాను పనిచేశారు. ఆయన వైస్ ఎడ్ మిరల్ పదవి లో ఎళిమల లో గల ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నేవల్ అకైడమి కి కమాండెంట్ గాను; నేవల్ ఆపరేశన్స్ విభాగం లో డైరెక్టర్ జనరల్ గాను; పశ్చిమ నౌకాదళం లో సిబ్బంది ప్రధాన అధికారి మరియు ఫ్లేగ్ ఆఫిసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ గాను సేవల ను అందించారు.
రీవా లోని సైనిక పాఠశాల లో మరియు ఖడక్ వాస్ లా లోని జాతీయ డిఫెన్స్ అకైడమి లో పూర్వ విద్యార్థి అయిన వైస్ ఎడ్ మిరల్ శ్రీ దినేశ్ కుమార్ త్రిపాఠి వెలింగ్ టన్ లో ఉన్న డిఫెన్స్ సర్వీసెజ్ స్టాఫ్ కాలేజ్ లోను, కరంజ్ లో ఉన్న నేవల్ హయర్ కమాండ్, ఇంకా యుఎస్ఎ లో యునైటెడ్ స్టేట్స్ నేవల్ వార్ కాలేజ్ లోని నేవల్ కమాండ్ కాలేజీ లో వివిధ పాఠ్యక్రమాల ను పూర్తి చేశారు.
***
(Release ID: 2018242)
Visitor Counter : 166