రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కఠిన ప్రాంతాల్లో పని చేసే సైనికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించే సాంకేతికతలు అభివృద్ధి చేసేందుకు ఏఎఫ్‌ఎంఎస్‌ & ఐఐటీ కాన్పూర్ ఒప్పందం

Posted On: 18 APR 2024 6:36PM by PIB Hyderabad

సైనిక అవసరాల విషయంలో పరిశోధన & శిక్షణ కోసం 'ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్' (ఏఎఫ్‌ఎంఎస్‌), 18 ఏప్రిల్ 2024న, 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (ఐఐటీ) కాన్పూర్‌తో ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ దల్జీత్ సింగ్, ఐఐటీ కాన్పూర్ అఫిషియేటింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.గణేష్ ఈ ఎంవోయూ మీద సంతకాలు చేశారు. కఠినమైన ప్రాంతాల్లో పని చేసే సైనికులు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి పరిశోధనలు, కొత్త సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ఈ ఒప్పందంలో భాగంగా ఏఎఫ్‌ఎంఎస్‌ & ఐఐటీ కాన్పూర్ పరస్పరం సహకరించుకుంటాయి.

ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీలోని 'ఆర్మ్‌డ్ ఫోర్సెస్ సెంటర్ ఫర్ కంప్యూటేషనల్ మెడిసిన్‌'లో ఏఐ పరీక్షల నమూనాలను అభివృద్ధి చేయడానికి సాంకేతిక నైపుణ్యాన్ని కూడా ఐఐటీ కాన్పూర్ అందిస్తుంది, ఇలాంటి ఒప్పందం భారతదేశంలోని వైద్య కళాశాల్లో మొదటిది. అధ్యాపకుల మార్పిడి కార్యక్రమం, ఉమ్మడి విద్య కార్యకలాపాలు, శిక్షణ మాడ్యూళ్ల అభివృద్ధి కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి.

సైనికులకు అత్యుత్తమ వైద్య సంరక్షణ అందించడానికి ఏఎఫ్‌ఎంఎస్‌ అంకితభావంతో పని చేస్తోందని, ఐఐటీ వంటి జాతీయ స్థాయి సంస్థతో కలిసి పని చేయడం ఈ నిబద్ధతలో ఒక ముఖ్యమైన అడుగు అని లెఫ్టినెంట్ జనరల్ దల్జీత్ సింగ్ చెప్పారు. ఆరోగ్య సంరక్షణలో ఏఐ వంటి అధునిక సాంకేతిక పరిజ్ఞానాల సహకారం, వినియోగం అవసరాన్ని ప్రొఫెసర్ గణేష్ స్పష్టం చేశారు.

***



(Release ID: 2018240) Visitor Counter : 191