భారత ఎన్నికల సంఘం

వయోధికులు, దివ్యాంగులైన ఓటర్ల ఇంటివద్దకే భారత ఎన్నికల కమిషన్ ఓటింగ్ సదుపాయం.


చరిత్ర సృష్టిస్తున్న 18 వ లోక్ సభ ఎన్నికలు : 85 సంవత్సరాలు పైబడిన , దివ్యాంగులైన వారు ఇంటినుంచే ఓటువేయడం ప్రారంభం.


దేశవ్యాప్తంగా, ఇంటివద్దనుంచే ఓటువేసే సదుపాయాన్ని వినియోగించుకోనున్న 85 సంవత్సరాలు పైబడిన 1 . 7 కోట్ల మంది వయోధిక ఓటర్లు, దివ్యాంగులు.

Posted On: 12 APR 2024 5:39PM by PIB Hyderabad

భారత ఎన్నికల సంఘం, వయోధికులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు చేసే అద్భుత అవకాశాన్ని తొలిసారిగా 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా కల్పిస్తోంది. 85 సంవత్సరాలు పైబడిన వయోధికులుఅలాగే  40 శాతం పైగా అంగవైకల్యం కలిగిన దివ్యాంగులు ఇంటి దగ్గరనుంచే ఓటు  వేసే సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. ఈ కేటగిరీలలోని ఓటర్లు  ఇప్పటికే తొలిదశరెండ దశ పోలింగ్  లో తమ ఓటు  హక్కు  వినియోగించుకోవడం ప్రారంభమైంది.  ఈ చొరవతోఎన్నికల ప్రక్రియను ఓటర్లకు మరింత చేరువ చేసినట్టయింది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియను మరింత బలోపేతం చేస్తుంది. ఇంటివద్ద నుంచి ఓటువేసేందుకు దేశవ్యాప్తంగా 85 ఏళ్ల వయసు పైబడినవారు 81 లక్షలమంది, 90 లక్షలకు పైగా దివ్యాంగులు తమ పేర్లను ఎన్నికల కమిషన్ వద్ద నమోదు చేసుకున్నారు.

 ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్శ్రీరాజీవ్ కుమార్ ఎన్నికల కమిషనర్లు శ్రీ జ్ఞానేశ్ కుమార్డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధుఈ విషయమై ఒక ప్రకటన చేస్తూవయోధికులకు దివ్యాంగులకు ఇంటినుంచే ఓటువేసే సదుపాయం కల్పించడమంటేవారిపట్ల తమ గౌరవాన్నివారి  సంరక్షణపట్ల తమకు  గల శ్రద్ధను తెలియజేస్తుందని అన్నారు సమాజం రోజువారీ జీవితంలో ,ఇదే విధంగా వయోధికులు,దివ్యాంగుల పట్ల శ్రద్ధతో గౌరవంతో మెలగాలన్న మార్గదర్శనానికి ఇది ప్రేరణ కల్పిస్తుందని తెలిపారు.

 

భారత ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ చర్యపట్ల 2024 లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ సందర్భంగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న దివ్యాంగులువయోధికులు తమ సంతృప్తిని కృతజ్ఞతలను వెల్లడించారు.  ఎన్నికల సిబ్బంది,భద్రతా  సిబ్బంది సహాయంతో పూర్తి గోప్యతతో ఇంటివద్ద పోలింగ్ సదుపాయాన్ని చేపడుతున్నారు. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క ఓటరు అభిప్రాయం ఎంతో ముఖ్యమైనదన్న భావనతో  ఈ సదుపాయం కల్పించడం జరిగింది. వయసుతోభౌతిక  పరమైన అడ్డంకులు ఏవీ లేకుండా ఓటుహక్కు సద్వినియోగం చేసుకునేందుకు ఇది అవకాశం కల్పిస్తోంది.

 

రాజస్థాన్లోని చురులో 8 మంది దివ్యాంగ ఓటర్లు ఇంటి వద్దనుంచే  తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇది భారత దేశ ఎన్నికల ప్రజాస్వామ్య బలాన్ని   సూచిస్తున్నది. ఛత్తీస్ఘడ్లోని గిరిజన ప్రాంతమైన  బస్తర్జిల్లా కు చెందిన 87  .సంవత్సరరాల ఇందుమతి పాండేసుకుమా జిల్లా కు చెందిన  86 సంవత్సరాల సోన్ మతి భగెల్లు ఇంటి నుంచి పోస్టల్ బ్యాలెట్ విధానంలో తమ ఓటు హక్కును వినియోగించచుకున్నారు. ఈ సదుపాయం కల్పించినందుకు వారు ఎన్నికల కమిషన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ పోలింగ్ సిబ్బందివామపక్ష  తీవ్రవాద ప్రభావానికి గురైన గడ్చిరోలి జిల్లా సిరోంచా పట్టణంలో ఇద్దరు వయోధికులకు ఇంటి వద్దనుంచే  ఓటువేసే సదుపాయం కల్పించేందుకు ఏకంగా 107 కిలోమీటర్ల దూరం  ప్రయాణించారు.

మధ్యప్రదేశ్ లోని జయసింగ్ నగర్ కు చెందిన శ్రీ బి.ఆర్. మిశ్రా ఇంటి  నుంచి ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూఎన్నికల కమిషన్ కు తన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ,ఎన్నికల సిబ్బంది చేసిన సేవ అద్భుతం. వారు గొప్ప పనిచేశారు. మనమందరం ఈ విధంగా అంకితభావంతో పనిచేస్తే మనదేశాన్ని గర్వించదగ్గ స్థాయికి తీసుకెళ్లవచ్చు‘‘”అని పేర్కొన్నారు.

 

 ఇలాంటి అభిప్రాయాలే ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోనున్నదేశంలోని ఇతర ప్రాంతాలలోని ఓటర్ల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ రకమైన అభిప్రాయాలుఇంటినుంచి ఓటు హక్కు సదుపాయం కల్పించచడం పరివర్తనాత్మక మార్పునకు  దారితీస్తున్నాయి. ఇంటి నుంచి ఓటు వేసే సదుపాయం కల్పించడం కేవలం ఒక సౌకర్యంగా కాకుండాప్రజాస్వామిక వ్యవస్థలో సాధికారతకుసమ్మిళితత్వానికిసహానుభూతికిఒక నిదర్శనంగా నిలుస్తుంది. ఇది మన సమాజంలో ప్రజాస్వామిక చట్రాన్ని మరింత బలోపేతం చేస్తుంది. దేశంలో అతి పెద్ద సంఖ్యలో గల ఓటర్ల నుంచి 85 సంవత్సరాలు నిండిన వయోధికులనుదివ్యాంగులను గుర్తించడమే ఒక బృహత్తర లక్ష్యం.

 ..మరొక ఓటరు  శ్రీ మిత్తల్ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ,“నాకు  ఎంతో సంతోషంగా ఉంది. 85 సంవత్సరాలు పైబడిన మా లాంటి వారికి ఇంటి వద్దనుంచే ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయం కల్పించారు. ఎన్నికలకు సంబంధించి ఇది గొప్ప విషయం. ఇందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను’’’’” అన్నారు.

 

ఇంటివద్ద నుంచి ఓటు వేసే  సదుపాయం గురించి......:

 

ఇంటివద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునే సదుపాయం కల్పించడం సానుకూల చర్య. ఇది ఓటర్లకు సాధికారత కల్పిస్తుంది. పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేయడానికి ఇబ్బందులు ఎదుర్కొనేవారికి సమస్యను ఇది పరిష్కరిస్తుంది .ప్రత్యేకించి ఇది రెండు కేటగిరీల వారికి కల్పించిన సదుపాయం. అందులో ఒకటి 85 సంవత్సరాలు పైబడిన  వయోధికులు  కాగా,మరొకరు 40 శాతం అంగవైకల్యంకలిగిన వారు.  ఈ రెండు తరగతులకు చెందిన వారి అవసరాలను  గుర్తించి  వారికి ఇంటి వద్దనుంచే ఓటు వేసే సదుపాయాన్ని ఎన్నికల కమిషన్ కల్పించడం ద్వారా బౌతికపరమైన అడ్డంకులు దివ్యాగత్వం వంటివి ఓటు హక్కు  వినియోగించుకోవడాన్ని నిలువరించలేవని నిరూపించినట్టయింది. దీని  ద్వారా ఏ ఒక్క ఓటరూ ఓటు హక్కు వినియోగించుకోకుండా  ఉండే పరిస్థితి ఉండరాదన్న ఎన్నికలకమిషన్ లక్ష్యానికి కట్టుబడి నట్టయింది.

ఇంటిదగ్గర నుంచే ఓటు వేయడానికి ఈ తరగతుల వార ఈ సదుపాయాన్ని వినియోగించుకోవడం చాలా సులభం. ఎన్నికల నోటిఫికేషన్  విడుదల అయిన ఐదు రోజుల లోపలఅర్హులైన ఓటర్లు  ఫారం 12 డిని పూర్తి చేసి రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. దివ్యాంగులైన ఓటర్లు దివ్యాంగత్వానికి సంబంధించి బేస్లైన్ సర్టిఫికేట్ను  వారి దరఖాస్తుతో జతచేయాలి.

 

 

బూత్ స్థాయి అధికారి (బి.ఎల్.ఒ) 12 డి ఫారమ్ను తగిన డాక్యుమెంటేషన్ పూర్తి అయిన తర్వాత వారి ఇంటినుంచి సేకరించే బాధ్యత చేపట్టాలి. ఇందులో పారదర్శకత జవాబుదారిత్వం ఉండేందుకు అభ్యర్థులకకు ఇందుకు సంబంధించిన  జాబితాను  అందజేస్తారు.. వారు కోరుకున్నట్టయితే వారు  దీనిని పర్యవేక్షించేందుకు తమ ప్రతినిధిని పంపవచ్చు.

 అనంతరంపోలింగ్ అధికారులుసెక్యూరిటీ సిబ్బందితో కూడిన బృందం ఓటరు నివాసాన్ని  సందర్శించి వారి నుంచి ఓటును స్వీకరిస్తుంది. పోలింగ్ సిబ్బంది ఏ సమయంలో వారి ఇంటికి వస్తున్నారో ముందుగానే ఓటరుకు తెలియజేస్తారు. దీనివల్ల వారు సురక్షితంగాతమకు అనువైన విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగ ఓటు వేయడానికి వీలు కలుగుతుంది. ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికిఓటరుకు  మరింత మెరుగైన రీతిలో సమాచారం అందజేయడానికి వారికి ఎస్.ఎం.ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం  అందిస్తారు. ఏ తేదీలలో ఇంటి వద్ద ఓటింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుందో తెలియజేస్తారు. పారదర్శకత కోసం  ఈ మొత్తం ప్ర్రక్రియను వీడియోగ్రాఫ్ చేస్తారు. ఈ చొరవతో ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియను మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దడానికి సాంకేతికతను ఉన్నతీకరించడానికి కట్టుబడిన విషయం  తెలియజేస్తుంది. డిజిటల్ నోటిఫికేషన్ల నుంచి వీడియోగ్రాఫర్ల నియామకంవినూత్న పరిష్కారాలకు వీలు కల్పించడం ద్వారా పారదర్శక విధానంలో అర్హులైన ఓటర్లందరూ ఓటు  వేసే విధంగా చర్యలు  తీసుకున్నట్టు అయింది. ఇండియా 2024 సంవత్సరపు లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నవేళఇంటివద్దనుంచే ఓటువేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడంఅర్హులైన ప్రతి ఒక్కరూ  ఓటువేసేవిధంగాపోలింగ్ అందరికీ అందుబాటులోఉండే విధంగా చూడడం  ఈ దిశగా  ఎన్నికల  కమిషన్కు గల తిరుగులేని చిత్తశుద్ధికి  నిదర్శనం

 

 

ఇందుకు సంబంధించిన ఫోటోలు. https://elections24.eci.gov.in/ లింక్ ద్వారాచూడవచ్చు.

 

  

ఫోటో రైటప్లు......

1 ఛత్తీస్ఘడ్తమిళనాడురాజస్థాన్ కుచెందిన 85 సంవత్సరాలుపైబడిన ఓటర్లు ఇంటివద్ద నుంచే ఓటుహక్కును వినియోగించుకుంటున్న దృశ్యాలు

2. రాజస్థాన్లోని చురు  లో ఓటుహక్కు వినియోగించుకుంటున్న దివ్యాంగులు

3. ఉత్తరప్రదేశ్లోని మోరాదాబాద్ పోలింగ్కేంద్రం  పరిధిలోని 91 సంవత్సరాల శ్రీమతి రుక్మిణి సింగ్నగినీ పోలింగ్ కేంద్రం పరిధిలోని శ్రీ సుమిత్ జైన్ తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్న దృశ్యం.

4.  దిమాపూర్ ,నాగాలాండ్ లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నవారు.

5. ఉత్తరాఖండ్లోని చమోలీలో ఇంటినుంచి ఓటుహక్కు వినియోగించుకుంటున్నవయోధికులు

6.  హరిద్వార్లో ఓటువేస్తున్న 107 సంవత్సరాల శ్రీ ధరమ్ దేవ్ఉత్తరాఖండ్లోని చమోలీలో ఇంటివద్దనుంచి ఓటింగ్ సదుపాయం కల్పించేందుకువెళుతున్న పోలింగ్ సిబ్బంది.

7. ఇంటివద్దనుంచి ఓటింగ్ సదుపాయం వినియోగించుకుంటున్న వయోధికులు.( ఫొటో రాజస్థాన్సి.ఇ.ఒ సౌజన్యంతో)

 

***



(Release ID: 2017936) Visitor Counter : 228