ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వేసవి సంబంధిత వ్యాధుల నిర్వహణపై ప్రజారోగ్యవ్యవస్థ సంసిద్ధతను సమీక్షించిన డాక్టర్ మన్సుఖ్ మాండవియా

సమర్థవంతమైన వ్యవస్థ సమర్థవంతమైన నిర్వహణకు దారి తీస్తుంది కాబట్టి వడగాలులపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా నిరంతర ప్రయత్నాలు అవసరం: డాక్టర్ మాండవ్య

మరణాలతో పాటు కేసులు, వడగాలుల తీవ్రతపై క్షేత్ర స్థాయి సమాచారం పంచుకోవడానికి రాష్ట్రాల ఇన్‌పుట్‌లతో కేంద్ర డేటాబేస్‌ను రూపొందించడం యొక్క అవసరాన్ని కేంద్రమంత్రి వివరించారు. తద్వారా వాస్తవిక పరిస్థితిని అంచనా వేయవచ్చన్నారు.

Posted On: 03 APR 2024 5:29PM by PIB Hyderabad


"వడగాలుల తీవ్రతపై ప్రజలకు సమర్థవంతమైన అవగాహన కల్పించడానికి నిరంతర ప్రయత్నాలు అవసరం" అని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా అభిప్రాయపడ్డారు. వేసవి సంబంధిత వ్యాధుల నిర్వహణపై ప్రజారోగ్య సంసిద్ధతను సమీక్షించడానికి ఆయన అధ్యక్షతన ఈ రోజు ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ మరియు నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వి కె పాల్ కూడా పాల్గొన్నారు.

క్షేత్రస్థాయిలో ఖచ్చితమైన డేటా లేకపోవడాన్ని  హైలైట్ చేస్తూ మరణాలు మరియు కేసులతో సహా హీట్‌వేవ్‌లపై క్షేత్ర స్థాయి డేటాను పంచుకోవడానికి రాష్ట్రాల నుండి ఇన్‌పుట్‌లతో సెంట్రల్ డేటాబేస్ను రూపొందించడం అవసరమని డాక్టర్ మాండవియ తెలిపారు. తద్వారా వాస్తవ పరిస్థితిని  అంచనా వేయవచ్చున్నారు.ఐఎండి హెచ్చరికలు అందిన వెంటనే రాష్ట్రాలలో సకాలంలో చర్యలు తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఆయన హైలైట్ చేశారు. "నివారణ చర్యలతో పాటు ముందస్తు అవగాహన కార్యక్రమాలు వడగాలుల తీవ్ర ప్రభావాన్ని తగ్గించడంలో బాగా తోడ్పడతాయని" ఆయన సూచించారు.

వేసవి సంబంధిత అనారోగ్యాలను సమర్థవంతంగా నిర్వహించడంలో సహకార ప్రయత్నాల ప్రాముఖ్యతను వివరిస్తూ మెరుగైన సమన్వయం మరియు అవగాహన కోసం రాష్ట్రాలతో సమావేశం కావాలని సీనియర్ అధికారులకు  కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి సూచించారు.

ప్రజల్లో సమాచారం మరియు అవగాహన ప్రచారాల కోసం రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుపై డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ నొక్కి చెప్పారు. వాటర్ కూలర్లు, ఐస్ ప్యాక్‌లు మరియు ఇతర ప్రాథమిక అవసరాలతో ఆయుష్మాన్ అరోగ్య మందిర్‌లను సిద్ధం ఉంచవలసిన అవసరాన్ని వివరించారు. ఉష్ణ తరంగాల దుష్ప్రభావాల పరిష్కారానికి రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికల క్షేత్ర స్థాయి అమలును రాష్ట్రాలు వేగవంతం చేయాల్సిన అవసరాన్ని కూడా ఆమె హైలైట్ చేశారు.

రాష్ట్ర స్థాయిలో అనుసరిస్తున్న మార్గదర్శకాల చెక్‌లిస్ట్‌ను నిర్ధారించడం యొక్క ప్రాముఖ్యతను డాక్టర్ వి కె పాల్ గుర్తించారు. వెబ్‌నార్లు మరియు ఇతర పద్ధతుల ద్వారా చికిత్స ప్రోటోకాల్‌లపై అవగాహన కల్పించాలని ఆయన నొక్కి చెప్పారు. ఉష్ణ సంబంధిత కేసులు మరియు అనారోగ్యంపై ప్రతి రాష్ట్రం నుండి డేటా రిపోజిటరీని రూపొందించాని కూడా ఆయన స్పష్టం చేశారు.

భారతదేశంలోని మొత్తం ఉష్ణోగ్రతల అంచనా, నమూనా, శీతోష్ణస్థితి మరియు ప్రభావితమయ్యే ప్రాంతాలు మరియు దేశంలో వేడి తరంగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న ప్రాంతాల  స్థితి మరియు విశ్లేషణను భారత వాతావరణ శాఖ (ఐఎండి) అధికారులు అందించారు. అలాగే వర్షపాతం నమూనాలు, తేమ మరియు సూచనలను కూడా వివరించారు. ఇక 23 రాష్ట్రాల్లో హీట్ యాక్షన్ ప్లాన్‌లు అప్‌డేట్ చేయబడ్డాయి. సుమారు 100 జిల్లాలు వడగాలులపై అవగాహన  కార్యాచరణ కలిగి ఉన్నాయని సూచించబడింది. హీట్ స్ట్రోక్ కేసులు మరియు మరణాల నిఘా కోసం ఎస్‌ఓపిలు; మరియు వేసవి కాలానికి ముందు & వేసవి కాలంలో సన్నద్ధత ప్రణాళిక, ప్రభావితమయ్యే ప్రాంతాలల్లో ఉష్ణ సంబంధిత అనారోగ్యం (హెచ్‌ఆర్‌ఐ)పై ప్రత్యేక దృష్టి సారిస్తుంది.

వేసవి ప్రభావం మరియు నిర్వహణ కోసం ఆరోగ్య సౌకర్యాల సమర్థవంతమైన సంసిద్ధత కోసం  జాతీయ కార్యాచరణ ప్రణాళికను రాష్ట్రాలు పాటించాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి 2024 ఫిబ్రవరి 29న   ముఖ్య కార్యదర్శులకు ఒక సూచన జారీ చేసినట్లు సమాచారం. అవసరమైన మందులు, ఇంట్రావీనస్ ఫ్లూయిడ్‌లు, ఐస్-ప్యాక్‌లు, ఓఆర్‌ఎస్‌, తాగునీరు అలాగే ప్రజల కోసం ఐఈసి కార్యకలాపాల పరంగా ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధతను సమీక్షించాలని రాష్ట్రాలకు సూచించబడింది. వేసవి కాలంలో చేయవలసినవి మరియు చేయకూడని అంశాలతో పాటు ప్రభావితమయ్యే వ్యక్తులు, సాధారణ ప్రజానీకం పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సిడిసి) ద్వారా సూచనలు కూడా జారీ చేయబడ్డాయి.

 
image.png


ఈ సమావేశంలో శ్రీ అపూర్వ చంద్ర, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి; డాక్టర్ రాజీవ్ బహ్ల్, సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్; డాక్టర్ అతుల్ గోయెల్, డైరెక్టర్ జనరల్ (డిజిహెచ్‌ఎస్‌); శ్రీ ఎల్‌.ఎస్‌ చాంగ్సన్, ఏఎస్‌ & ఎండీ (ఎంఒహెచ్‌ఎఫ్‌డబ్ల్యు), శ్రీమతి రోలీ సింగ్, ఏఎస్‌ (ఎంఒహెచ్‌ఎఫ్‌డబ్ల్యు); డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర,డిజి,ఐఎండి; శ్రీ కమల్ కిషోర్, సభ్యుడు & హెడ్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ; ఎయిమ్స్ న్యూఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎం శ్రీనివాస్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజీ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ గిరి కూడా పాల్గొన్నారు.
 

***


(Release ID: 2017927) Visitor Counter : 61