ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
మైసిజిహెచ్ఎస్ ఐఒఎస్ (myCGHS iOS) యాప్‌ను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ
సిజిహెచ్ఎస్ లబ్ధిదారుల చేతుల్లో అవసరమైన ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అనుకూలమైన సూచనలను అందుబాటులో ఉండేలా సాధికారం చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో సిజిహెచ్ఎస్ వేసిన అత్యవసరమైన అడుగు మైసిజిహెచ్ఎస్ యాప్ ః కేంద్ర ఆరోగ్య కార్యదర్శి
Posted On:
03 APR 2024 6:20PM by PIB Hyderabad
ఐఒఎస్ వ్యవస్థలు కలిగిన పరికరాలకు అనుకూలమైన మైసిజిహెచ్ఎస్ యాప్ (myCGHS)ను ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వచంద్ర శుక్రవారంనాడు ఇక్కడ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథక (సిజిహెచ్ఎస్) లబ్ధిదారులకు ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డులు, సమాచారం, వనరులు మరింతగా అందుబాటులోకి తెచ్చేలా ఈ యాప్‌ను రూపొందించారు.
ఈ యాప్ ప్రారంభం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ, మై సిజిహెచ్ఎస్ యాప్ అన్నది ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో ఒక అత్యవసరమైన పురోగమన అడుగు. ఇది సిజిహెచ్ఎస్ లబ్ధిదారుల చేతుల్లో అవసరమైన ఆరోగ్య సంరక్షణకు సంబంధించి అనుకూలమైన సూచనలను అందుబాటులో ఉండేలా సాధికారం చేస్తుంది. ఈ చొరవ ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యతను, అందుబాటును మెరుగుపరిచేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్న ప్రభుత్వ దార్శనికతతో అనుగుణంగా ఉంటుందని అన్నారు.
మైసిజిహెచ్ఎస్ ఐఒఎస్ యాప్‌ను నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) హిమాచల్ ప్రదేశ్, ఎన్ఐసి ఆరోగ్య బృందంలోని సాంకేతిక బృందాలు అభివృద్ధి చేశాయి. సిజిహెచ్ఎస్ లబ్ధిదారులకు సమాచారాన్ని, ప్రాప్యతను మెరుగుపరచాలన్న లక్ష్యంతో సూచనలను అందించే అనుకూలమైన మొబైల్ అప్లికేషన్ ఇది.
ఆన్‌లైన్ అపాయింట్‌మెంట్ల బుకింగ్, రద్దు, సిజిహెచ్ఎస్ కార్డును, ఇండెక్స్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి, సిజిహెచ్ఎస్ లాబ్‌ల నుంచి లాబ్ నివేదికలను పొందేందుకు, వాడిన మందుల చరిత్రను తనిఖీ చేయడం, వైద్య రీయింబర్స్‌మెంట్ (తిరిగి చెల్లింపు) క్లెయిమ్ స్థితిని చూసుకోవడానికి, రిఫరల్ (బదిలీ) వివరాల ప్రాప్యత, దగ్గరలో ఉన్న వెల్‌నెస్ సెంటర్లను గుర్తించడం, సమాచారం, ముఖ్యాంశాలను తాజాపరచడం, సమీపంలోని ఎంపానెల్డ్ (జాబితాలో చేర్చిన) ఆసుపత్రులు, లాబ్‌లు, డెంటల్ యూనిట్లను గుర్తించి, వెల్‌నెస్ సెంటర్ల, కార్యాలయాల సంప్రదింపు వివరాలను పొందడం సహా విస్త్రతమైన సేవలకు మైసిజిహెచ్ఎస్ యాప్ సౌలభ్యాన్ని కల్పిస్తుంది.
యాప్ వినియోగదారుల డేటా గోప్యత, సమగ్రతను నిర్ధారించే 2- కారకాల ప్రమాణీకరణ, ఎంపిన్ (mPIN) కార్యాచరణ వంటి భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది.
సిజిహెచ్ఎస్ విభాగంలో డిజిటల్ ఆరోగ్య సంరక్షణ సేవలలో ఒక ముఖ్యమైన మైలురాయిని ఈ కార్యక్రమం సూచిస్తుంది. మైసిజిహెచ్ఎస్ యాప్ ఇప్పుడు ఐఒఎస్, ఆండ్రాయిడ్ వేదికలలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంది. నిరాటంకమైన ఆరోగ్య సంరక్షణ అనుభవం కోసం ఈ వినూత్న పరిష్కారాన్ని స్వీకరించవలసిందిగా సిజిహెచ్ఎస్ లబ్ధిదారులను ప్రోత్సహిస్తున్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి రోలీ సింగ్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి డా. మనస్వి కుమార్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
***
(Release ID: 2017921)