ప్రధాన మంత్రి కార్యాలయం

మహ్‌తారీ వందన్ యోజన ను వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ఛత్తీస్ గఢ్ లో ప్రారంభించిన సందర్భం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 10 MAR 2024 4:16PM by PIB Hyderabad

నమస్కారమండి,


ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి గారు, రాష్ట్ర ప్రభుత్వాని కి చెందిన అందరు మంత్రులు, శాసన సభ్యులు, ఇంకా ఇక్కడ కు విచ్చేసినటువంటి ఇతర ప్రముఖులూ, మీకు జయ్-జోహార్ (శుభాకాంక్షలు).

 

 

మాత దంతేశ్వరి కి, మాత బమ్ లేశ్వరి కి మరియు మాత మహామాయ కు గౌరవ ప్రపత్తుల తో నేను ప్రణమిల్లుతున్నాను. ఛత్తీస్ గఢ్ లోని మాతృమూర్తుల కు మరియు సోదరీమణుల కు ఇవే నా యొక్క హృదయ పూర్వక వందనములు. రెండు వారాల క్రిందట ఛత్తీస్ గఢ్ లో 35,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టుల కు జరిగిన శంకుస్థాపన మరియు ప్రారంభ కార్యక్రమాల లో నేను పాలుపంచుకొన్నాను. మహిళల కు సాధికారిత కల్పన కోసం ఉద్దేశించినటువంటి మహ్‌తారీ వందన్ యోజన ను ఈ రోజు న ప్రారంభించే అదృష్టం నాకు దక్కింది. మహ్‌తారీ వందన్ యోజన లో భాగం గా ఛత్తీస్ గఢ్ లోని మాతృమూర్తులు మరియు సోదరీమణులు 70 లక్షల మందికి పైగా ఒక్కో నెల కు ఒక వేయి రూపాయలు అందించాలి అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ ను స్వీకరించడమైంది. ఈ వాగ్ధానాన్ని బిజెపి ప్రభుత్వం నెరవేర్చింది. మహ్‌తారీ వందన్ యోజన లో భాగం గా 655 కోట్ల రూపాయల విలువైన ఒకటో వాయిదా ను ఈ రోజు న ఇవ్వడమైంది. తెర మీద నేను ఎంతో మంది సోదరీమణుల ను చూస్తున్నాను. వేరు వేరు ప్రాంతాల లో ఇంత పెద్ద సంఖ్య లో మీ సోదరీమణులంతా మీ మీ ఆశీర్వాదాల ను వర్షించడాన్ని గమనించడం నిజాని కి మా యొక్క అదృష్టం అని చెప్పాలి. నేటి కార్యక్రమం తాలూకు ప్రాముఖ్యం పెద్దది; మరి ఛత్తీస్ గఢ్ లో మీ సమక్షం లో నేను ఉండవలసింది. అయితే, ముందుగా ఖరారు అయిన కార్యక్రమాల ప్రకారం ప్రస్తుతం నేను ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్నాను. మాతృమూర్తులు మరియు సోదరీమణులారా, నేను ఇప్పుడు కాశీ లో ఉండి మిమ్ముల ను ఉద్దేశించి ప్రసంగిస్తున్నాను. క్రిందటి రోజు రాత్రి బాబా విశ్వనాథ్ చరణాల వద్ద నన్ను నేను సమర్పణ చేసుకొని, మన దేశం లో ప్రజలు అందరి యొక్క మేలు కోసం ప్రార్థించాను. బాబా విశ్వనాథ్ కు జరిగిన ఆరాధన లో నేను సైతం పాలుపంచుకొన్నాను. ఈ రోజు న బాబా విశ్వనాథ్ యొక్క క్షేత్రం అయిన పవిత్ర కాశీ నగరం నుండి మీతో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. ఈ కారణం గా నేను నా యొక్క అభినందనల ను తెలియ జేయడం ఒక్కటే కాకుండా బాబా విశ్వనాథ్ యొక్క దీవెనల ను కూడాను మీ అందరికీ అందజేస్తున్నాను. రెండు రోజుల క్రితం శివరాత్రి పర్వదినం. మరి శివరాత్రి కారణం గా ఈ యొక్క కార్యక్రమాన్ని మహిళల దినం అయినటువంటి మార్చి నెల 8 వ తేదీ నాడు నిర్వహించడం వీలు పడలేదు. అందువల్ల ఒక రకం గా చూస్తే మార్చి నెల 8 వ తేదీ నాడు మహిళల దినం శివరాత్రి పండుగ తో కలసి వచ్చింది; కాబట్టి ఈ రోజు న మీకు తలా ఒక వేయి రూపాయల విలువైన ఆశీస్సు లభిస్తున్నది. ఇదే కాలం లో బాబా భోలే నగరాన్నుండి బాబా భోలే యొక్క కృప ను మీరు పొందుతూ ఉన్నారు. ఇది మరింత శక్తిమంతం అయినటువంటిది. ఈ డబ్బు ను ఎటువంటి అసౌకర్యానికి తావు లేకుండా మీ యొక్క ఖాతాల లో ప్రతి నెలా జమ చేయడం జరుగుతుంది అని ప్రతి ఒక్క మహ్‌తారీ (మాతృమూర్తికి) కి నేను హామీ ని ఇస్తున్నాను. నేను బిజెపి ప్రభుత్వాన్ని నమ్ముతున్నాను, అందువల్లనే మీకు ఈ హామీ ని నేను ఇస్తున్నాను.

 

 

మాతృమూర్తులు మరియు సోదరీమణులారా,

మాతృమూర్తులు మరియు సోదరీమణుల కు సాధికారిత ఎప్పుడైతే అందివస్తుందో, అప్పుడు యావత్తు కుటుంబం బలోపేతం అవుతుంది. అందుకని మన మాతృమూర్తుల మరియు సోదరీమణుల యొక్క సంక్షేమం డబల్ ఇంజన్ ప్రభుత్వం యొక్క అగ్ర ప్రాధాన్యం గా ఉంది. ఈ రోజు న పక్కా ఇళ్ళ ను, అది కూడాను మహిళల పేరు తో నమోదు అయిన గృహాల ను, ఆయా కుటుంబాల వారు అందుకొంటున్నారు. తక్కువ ఖర్చు లో లభించేటటువంటి ఉజ్జ్వల గ్యాస్ సిలిండర్ లు కూడా మహిళల పేరిట అందుతున్నాయి. జన్ ధన్ ఖాతాల లో 50 శాతాని కి పైగా ఖాతా లు కూడాను మన తల్లుల మరియు అక్క చెల్లెళ్ళ పేరుల తోనే ఉన్నాయి.

 

 

అందజేస్తున్నటువంటి ముద్ర రుణాల లో 65 శాతాని కి పైగా రుణాల ను అందుకొంటున్నది మన మహిళ లు. వారి లో మన సోదరీమణులు, మాతృమూర్తులు, విశేషించి యువ పుత్రిక లు ఉన్నారు. వారు నిర్ణయాత్మకమైనటువంటి ముందడుగులను వేసి, వారి వారి వాణిజ్య వ్యవస్థల ను ఈ రుణాల ద్వారా ఆరంభించారు. గడచిన 10 సంవత్సరాల కు పైగా మా ప్రభుత్వం స్వయంసహాయ సమూహాల కు చెందిన 10 కోట్ల మంది కి పైగా మహిళ ల యొక్క జీవనం లో మార్పు ను తీసుకు వచ్చింది. మా ప్రభుత్వం యొక్క కార్యక్రమాల సౌజన్యం తో ‘‘లఖ్ పతీ దీదీస్’’ (లక్షాధికారి సోదరీమణులు) దేశవ్యాప్తం గా ఒక కోటి కి పైచిలుకు సంఖ్య లో తెర మీద కు వచ్చారు. ఇది ప్రతి ఒక్క పల్లె లోను చెప్పుకోదిగిన ఆర్థిక శక్తి కి ప్రతీక గా ఉంది. ఈ సాఫల్యం నుండి ప్రోత్సాహాన్ని అందుకొని మేం దేశవ్యాప్తం గా మూడు కోట్ల మంది మహిళల ను ‘‘లఖ్ పతీ దీదీస్’’గా తయారు చేయాలి అనే ఒక మహత్వాకాంక్ష యుక్త లక్ష్యాన్ని పెట్టుకొన్నాం. నమో డ్రోన్ దీదీ పథకం మహిళ ల యొక్క సశక్తీకరణ కు క్రొత్త దారుల ను ఏర్పరచింది. నమో డ్రోన్ దీదీస్ కు ఉద్దేశించిన ఒక పెద్ద కార్యక్రమాన్ని రేపటి రోజు న నేను ఏర్పాటు చేస్తున్నాను. మీరు ఉదయం పూట 10-11 గంటల మధ్య లో మీ యొక్క టెలివిజన్ సెట్ ల ముందు కు వచ్చి నమో డ్రోన్ దీదీస్ చేపడుతున్న ప్రశంసాయోగ్యమైనటువంటి కార్యాన్ని చూడవలసింది గా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు స్వయం గా ఆ కార్యక్రమాన్ని తిలకిస్తారు, తద్ద్వారా రాబోయే కాలం లో ఉత్సాహం గా ఈ కార్యక్రమం లో పాలుపంచుకోవాలన్న ప్రేరణ ను మీరు దక్కించుకొంటారు. ఈ పథకం లో భాగం గా మహిళల కు డ్రోన్ లను సమకూర్చడం తో పాటు వారు డ్రోన్ పైలట్ లుగా మారడం లో శిక్షణ ను వారికి బిజెపి ప్రభుత్వం ఇవ్వనుంది. ‘‘నాకు సైకిల్ తొక్కడం కూడా తెలియదు, మరి నేను ఈ రోజు న డ్రోన్ దీదీ పైలట్ గా ఉన్నాను’’ అంటూ ఒక మహిళ ముఖాముఖి లో నాకు తెలియ జేసినటువంటి సంగతి ని నేను జ్ఞాపకాని కి తెచ్చుకొంటున్నాను. ఈ కార్యక్రమం వ్యవసాయాన్ని ఆధునికీకరించడం తో పాటు మహిళల కు అదనపు ఆదాయాన్ని కూడా అందిస్తుంది. నేను ఈ పథకాన్ని రేపటి రోజు న దిల్లీ నుండి ప్రారంభిస్తున్నాను; మరి, దీనిలో మరో మారు నాతో మీరంతా చేరాలంటూ మీకు నేను ఆహ్వానం పలుకుతున్నాను.

 

 

మాతృమూర్తులు మరియు సోదరీమణులారా,

ఒక కుటుంబం లోని సభ్యులు ఆరోగ్యం గా, క్షేమం గా ఉన్నప్పుడు ఆ కుటుంబం సమృద్ధం గా ఉంటుంది; కుటుంబం లో సభ్యుల ఆరోగ్యం ఆ కుటుంబం లోని మహిళల స్థితి పై ఆధారపడి ఉంటుంది. మునుపు గర్భధారణ అనంతరం శిశుమరణాల సంఖ్య ఆందోళన ను కలిగించేది. ఈ సమస్య ను పరిష్కరించడం కోసం టీకా మందును ఉచితం గా పంపిణీ చేసే కార్యక్రమాన్ని మేం అమలు పరచాం. గర్భవతుల కు 5,000 రూపాయల సహాయాన్ని అందించాం. దీనికి అదనం గా ఎఎస్ హెచ్ ఎ(‘ఆశ’), ఇంకా ఆంగన్ వాడీ వర్కర్ లు ప్రస్తుతం 5 లక్షల రూపాయల వరకు విలువైన వైద్య చికిత్స సదుపాయాన్ని ఉచితం గా అందుకొంటున్నారు. ఇంతకు ముందు కుటుంబాల లో టాయిలెట్ లు ఉండేవి కావు, దీనితో మన సోదరీమణులు మరియు పుత్రికలు ఎంతో కలత చెంది, దిగులు పడుతూ ఉండే వారు. ప్రస్తుతం ప్రతి ఒక్క కుటుంబం లో ఇక ‘‘ఇజ్జత్ ఘర్’’ అనేది ఏర్పాటు అయింది. ఇజ్జత్ ఘర్ అనేది మహిళల కోసం ప్రత్యేకమైన టాయిలెట్, ఇది ఏర్పాటు కావడం తో వారి యొక్క ఇబ్బందులు గణనీయం గా తగ్గిపోయి, మరి వారిలో ఆరోగ్యం పరమైన సమస్యల ను తగించివేసింది.

 

మాతృమూర్తులు మరియు సోదరీమణులారా,

అనేక రాజకీయ పక్షాలు ఎన్నికల కు ముందుగా గొప్ప గొప్ప వాగ్దానాలు చేస్తాయి, ఆకాశం నుండి నక్షత్రాల ను భూమి కి తీసుకు వస్తాం. వాటిని మీ పాదాల వద్ద నిలుపుతాం అంటూ కబురు లు చెబుతాయి. ఏమైనా బిజెపి వంటి ఒకే ఒక పార్టీ స్పష్టమైన ఉద్దేశ్యాల ను కలిగి ఉండి, మరి ఆ వాగ్ధానాల ను నెరవేర్చుతున్నది. ఈ కారణం గా ఇంత తక్కువ కాలం లో మహ్‌తారీ వందన్ యోజన తాలూకు వాగ్దానాన్ని నెరవేర్చడమైంది. ఈ కార్యసాధన కు గాను మన ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయి గారి కి, ఆయన యొక్క యావత్తు జట్టు కు మరియు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాని కి నేను అభినందనల ను తెలియ జేస్తున్నాను. ఇందుకే ‘‘మోదీ యొక్క గ్యారంటీ అంటే కాగల కార్యం తాలూకు గ్యారంటీ’’ అని ప్రజలు అంటున్నారు. ఛత్తీస్ గఢ్ యొక్క అభివృద్ధి కోసం ఎన్నికల కాలం లో చేసిన వాగ్దానాల ను ఎంతో శ్రద్ధ తో నెరవేర్చడం కోసం బిజెపి ప్రభుత్వం పాటుపడుతున్నది. ఛత్తీస్ గఢ్ లో 18 లక్షల పక్కా ఇళ్ళ నిర్మాణం కోసం మీకు ఒక హామీ ని నేను ఇచ్చాను. ఆ మరుసటి రోజే ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత శ్రీ విష్ణు దేవ్ సాయి గారు, ఆయన యొక్క మంత్రిమండలి మరియు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం క్రియాశీలత్వం తో ఈ ప్రాజెక్టు ను మొదలు పెట్టింది. ఛత్తీస్ గఢ్ లో వరి రైతుల కు రెండు సంవత్సరాలు గా చెల్లించవలసి ఉన్నటువంటి బోనసు ను చెల్లించడం జరుగుతుంది అని హామీ ని ఇచ్చాను. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం అటల్ జీ జయంతి నాడు 3,700 కోట్ల రూపాయల బోనసు ను రైతు ల ఖాతాల లో జమ చేసింది. మా ప్రభుత్వం ధాన్యాన్ని ప్రతి ఒక్క క్వింటాలు 3,100 రూపాయల కు కొనుగోలు చేస్తుంది అంటూ ఇక్కడ ఒక వాగ్దానాన్ని చేశాం. మా ప్రభుత్వం ఈ వాగ్ధానాన్ని నిలబెట్టుకొంది అని తెలిసి నేను సంతోషించాను. అంతేకాకుండా, 145 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించడం ద్వారా ఒక క్రొత్త రికార్డు ను కూడా నెలకొల్పడమైంది. దీనికి అదనం గా కృషక్ ఉన్నతి యోజనను ప్రారంభించడమైంది; మరి ఈ సంవత్సరం లో కొనుగోలు చేసిన వడ్ల కు సంబంధించిన భేదాత్మక సొమ్ము చెల్లింపు లే త్వరలోనే రైతు సోదరుల కు అందనున్నాయి. రాబోయే అయిదు సంవత్సరాల లో ఈ సంక్షేమ కార్యక్రమాల ను ఖచ్చితం గా ముందుకు తీసుకు పోవడం జరుగుతుంది. మాతృమూర్తులు మరియు సోదరీమణుల యొక్క గణనీయ హాజరు ఈ కార్యక్రమాల లో ఉండబోతుంది. ఛత్తీస్ గఢ్ లోని డబల్ ఇంజన్ ప్రభుత్వం ఈ విధం గా మీకు సేవ చేయడాన్ని కొనసాగిస్తుందని, మరి తాను ఇచ్చిన వాగ్దానాల ను (గ్యారంటీస్) అన్నింటిని నెరవేరుస్తుందన్న విశ్వాసం నాలో ఉంది. నా ఎదుట లక్షల కొద్దీ సోదరీమణులు హాజరు కావడాన్ని నేను గమనిస్తున్నాను. ఈ దృశ్యం మునుపెన్నడూ ఎరుగనిది, ఇది మరచిపోలేనిది కూడాను. ఈ రోజు న మీ ఎదుట ఉండాలి అని నేను అనుకున్నాను. కానీ, దయచేసి నన్ను క్షమించండి. నేను కాశీ నుండి బాబా విశ్వనాథ్ క్షేత్రం లో మీతో మాట్లాడుతున్నాను. ఈ క్రమం లో మీకు అందరికి బాబా యొక్క ఆశీర్వాదాల ను నేను అందజేస్తున్నాను. మీకు అనేకానేక ధన్యవాదాలు. మీకు అంతా మంచే జరుగు గాక.

 

 

అస్వీకరణ: ప్రధాన మంత్రి హిందీ భాష లో ప్రసంగించారు. ఇది ఆయన ఉపన్యాసాని కి భావానువాదం.

 

 

 

***



(Release ID: 2017762) Visitor Counter : 38