రక్షణ మంత్రిత్వ శాఖ
డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ డీ జీ క్యూ ఏ యొక్క పునర్వ్యవస్థీకరణ కోసం నోటిఫికేషన్‌ను జారీ చేస్తుంది
నిర్ధారణ పరిధులు మరియు పరీక్ష సౌకర్యాల పారదర్శక కేటాయింపును సులభతరం చేయడానికి, డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ టెస్టింగ్ మరియు ఎవాల్యుయేషన్ ప్రమోషన్ అమలులోకి వస్తాయి
Posted On:
28 MAR 2024 1:08PM by PIB Hyderabad
'సులభతర వ్యాపారం' మరియు రక్షణ రంగంలో ఆత్మనిర్భర్తను సాధించేందుకు, రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్ట్స్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (డీ జీ క్యూ ఏ)ని వేగవంతం చేసే లక్ష్యంతో పునర్వ్యవస్థీకరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. నాణ్యత హామీ ప్రక్రియలు మరియు పరీక్షలు మరియు నిర్ణయం తీసుకునే దొంతరలు తగ్గించడం. ఈ పునర్వ్యవస్థీకరణ నాణ్యత హామీ ప్రక్రియ లో మార్పును మరియు ఓ ఎఫ్ బీ యొక్క కార్పొరేటైజేషన్ తర్వాత డీ జీ క్యూ ఏ యొక్క సవరించిన పాత్రను కూడా ప్రభావితం చేస్తుంది.
కొత్త డిపిఎస్‌యులుగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేటీకరించడం, రక్షణ పరిశ్రమలో ప్రైవేట్ భాగస్వామ్యం పాత్ర పెంచడం మరియు స్వదేశీీకరణ దిశగా ప్రభుత్వం ప్రోత్సహించడంతో, అభివృద్ధి చెందుతున్న రక్షణ తయారీ పరిశ్రమకు సమర్థవంతమైన మద్దతు కోసం డిజిక్యూఎను తిరిగి పునర్వ్యవస్థీకరణ చేయాల్సిన అవసరం ఏర్పడింది. డీ జీ క్యూ ఏ ఇప్పటికే రక్షణ రంగ తయారీ వ్యవస్థ లోని అందరు వాటాదారులతో క్రియాశీల చర్చల తర్వాత వివిధ సంస్థాగత మరియు క్రియాత్మక సంస్కరణలను చేపట్టింది.
అమలులో ఉన్న కొత్త నిర్మాణం అన్ని స్థాయిలలో పూర్తి పరికరాలు/ఆయుధ ప్లాట్‌ఫారమ్‌కు ఏకీకృత సాంకేతిక మద్దతును అందిస్తుంది మరియు ఉత్పత్తి-ఆధారిత క్యూ ఏ లో ఏకరూపతను కూడా నిర్ధారిస్తుంది. కొత్త నిర్మాణం నిర్ధారణ పరిధులు మరియు పరీక్ష సౌకర్యాల పారదర్శక కేటాయింపును సులభతరం చేయడానికి ప్రత్యేక డైరెక్టరేట్ ఆఫ్ డిఫెన్స్ టెస్టింగ్ మరియు ఎవాల్యుయేషన్ ప్రమోషన్ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తుంది.
ఈ అమరిక మరియూ ఆటోమేషన్ మరియు ప్రామాణిక క్యూ ఏ ప్రక్రియల డిజిటలైజేషన్ల వల్ల డీ జీ క్యూ ఏతో రక్షణ పరిశ్రమ అనుబంధాన్ని గణనీయంగా మెరుగుపరిచే అవకాశం ఉంది. పునర్వ్యవస్థీకరించబడిన నిర్మాణం మరియు కొనసాగుతున్న క్రియాత్మక సంస్కరణల వల్ల భారతీయ ప్రమాణాలు లేదా తత్సమాన ప్రమాణాల లభ్యతతో/ దేశంలోని తయారీదారులకు మార్గనిర్దేశం చేయడానికి 'ఆత్మనిర్భర్ భారత్' కింద స్వదేశీీకరణకు ఊపునిస్తాయి అలాగే ఇది ఉత్తమ నాణ్యత అర్హత కలిగిన రక్షణ ఉత్పత్తుల ఎగుమతిని కూడా పెంచుతుంది.
***
(Release ID: 2016567)