రక్షణ మంత్రిత్వ శాఖ
సంభవాత్మక పరిస్థితులపై మేథోమథనం చేసి, మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించి, అంచనా వేయనున్న సైనిక కమాండర్లు
Posted On:
27 MAR 2024 12:24PM by PIB Hyderabad
2024వ సంవత్సరానికి మొదటి సైనిక కమాండర్ల సమావేశం మిశ్రమ పద్ధతిలో జరుగనుంది. దృశ్యమాధ్యమం (వర్చువల్ మోడ్)లో సమావేశం 28 మార్చి 2024న జరుగనుండగా, తర్వాత ప్రత్యక్ష పద్ధతిలో 01,02 ఏప్రిల్ 2024న న్యూఢిల్లీలో జరుగనుంది. గౌరవ రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగంచడమే కాక సీనియర్ సైనిక అధికారులతో సమావేశం సందర్భంగా ముచ్చటించనున్నారు. సంభవాత్మక పరిస్థితులపై మేథోమథనం చేసి, మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించి, అంచనా వేసేందుకు సైన్యం అత్యున్నత నాయకత్వానికి ఈ సమావేశం కీలకవేదికగా పని చేస్తుంది.
భవిష్యత్ మార్గాన్ని రూపొందించేందుకు, ముఖ్యమైన విధాన నిర్ణయాలను సులభతరం చేసే కీలక ప్రాధాన్యతలను ఇది నిర్దేశిస్తుంది.
మార్చి 28, 2024న ప్రారంభమవుతున్న సమావేశానికి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ (సిఒఎఎస్) జనరల్ మనోజ్ పాండే న్యూఢిల్లీ నుంచి అధ్యక్షత వహిస్తుండగా, తమ తమ కమాండ్ కేంద్ర కార్యాలయాల నుంచి సైనిక కమాండర్లు దృశ్య మాధ్యమం ద్వారా పాలుపంచుకుంటారు. క్షేత్రస్థాయి సైనికులు, వృద్ధ / అనుభవజ్ఞుల సంక్షేమాన్ని ప్రభావితం చేసే కీలక అజెండాలపై చర్చ ఉంటుంది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ పరిదృశ్యం, జాతీయ భద్రతపై దాని పరిణామాలకు సంబంధించి విషయ నిపుణులతో ఉపన్యాసాలు కూడా ఈ సమావేశంలో ఉండనున్నాయి.
కాగా, 01 ఏప్రిల్ 2024న ప్రత్యక్ష పద్ధతిలో సమావేశాన్ని నిర్వహించినప్పుడు సైన్యం అగ్ర నాయకత్వం తీవ్రమైన మేథోమధన సెషన్లలో నిమగ్నం కానుంది. ఈ సెషన్లు కార్యచరణ సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడ, ఆవిష్కరణల, అనుసరణ సంస్కృతిని పెంచుకోవడం, భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కొనే సంసిద్ధతను నిర్ధారించడానికి శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాముఖ్యతను ఇచ్చే లక్ష్యంతో ఈ సెషన్లు జరుగనున్నాయి. సైనికులు, వారి కుటుంబాల జీవన నాణ్యతను పెంచే లక్ష్యంతో సైనిక సిబ్బంది సంక్షేమానికి సంబంధించి ఆవరించి ఉన్న సమస్యలపై కూడా సెషన్‌లో మేథోమధనం జరుగనుంది. దీని తర్వాత సిఒఎఎస్ అధ్యక్షతన ఆర్మీ గ్రూప్ ఇన్సూరెన్స్ పెట్టుబడి సలహా కమిటీ జరుగనుంది. ఇందులో ఆర్ధిక నిర్వహణ రంగానికి చెందిన పలువురు నిపుణులు హాజరు కానున్నారు. సేవలందిస్తున్న సైనికుల, వృద్దుల, వారి కుటుంబాల ఆర్దిక భద్రత కోసం పలు సంక్షేమ చర్యలు, పథకాల గురించి కూడా కమిటీ చర్చించనుంది.
గౌరవ రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ 02 ఏప్రిల్ 2024న కీలకోపన్యాసం చేయనున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ (నావికాదళాధ్యక్షుడు) అడ్మిరల్ ఆర్ హరికుమార్, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ (వైమానిక దళాధ్యక్షుడు) ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌధరి కూడా సీనియర్ శ్రేణి సైనికాధికారులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ కార్యదర్శి, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా హాజరుకానున్నారు.తన విస్త్రత పరిధితో సైనిక కమాండర్ల సమావేశం భారతీయ సైన్యం ఎప్పుడూ భవిష్యత్ సంసిద్దతతో, అనుకూలంగా, ముందు చూపుతో పురోగమనశీలంగా ఉండేలా చేస్తుంది.
***
(Release ID: 2016556)
Visitor Counter : 125