ఆర్థిక మంత్రిత్వ శాఖ

2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి అర్థ భాగం కోసం ప్రభుత్వ రుణ ప్రణాళిక

Posted On: 27 MAR 2024 5:40PM by PIB Hyderabad

కేంద్రప్రభుత్వం, భారతీయ రిజర్వ్ బ్యాంక్‌తో సంప్రదింపులు జరిపి, 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగం (హెచ్1) కోసం రుణాలు తీసుకునే కార్యక్రమాన్ని ఖరారు చేసింది.

కేంద్ర బడ్జెట్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన రూ.14.13 లక్షల కోట్ల స్థూల మార్కెట్ రుణాలలో, రూ.7.50 లక్షల కోట్లు (53.08%) మొదటి అర్ధభాగంలో (హెచ్1) డేటెడ్ సెక్యూరిటీల ద్వారా రూ.12,000 కోట్లతో సహా రుణంగా తీసుకోవాలని ప్రణాళిక చేసింది. సావరిన్ గ్రీన్ బాండ్స్ (ఎస్జిఆర్బీ లు) జారీ మార్కెట్ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, గ్లోబల్ మార్కెట్ పద్ధతులకు అనుగుణంగా, 15-సంవత్సరాల గడువు ఉండేలా కొత్త డేటెడ్ సెక్యూరిటీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

రూ.7.50 లక్షల కోట్ల స్థూల మార్కెట్ రుణం 26 వారపు వేలం ద్వారా పూర్తి చేస్తారు. మార్కెట్ రుణం 3, 5, 7, 10, 15, 30, 40 మరియు 50 సంవత్సరాల సెక్యూరిటీలలో విస్తరించి ఉంటుంది. వివిధ మెచ్యూరిటీల కింద రుణం తీసుకునే వాటా ( ఎస్జిఆర్బీలతో సహా): 3-సంవత్సరాలు (4.80 శాతం), 5-సంవత్సరాలు (9.60 శాతం), 7-సంవత్సరాలు (8.80 శాతం), 10-సంవత్సరాలు (25.60 శాతం), 15-సంవత్సరాలు ( 13.87 శాతం), 30 ఏళ్ళు(8.93 శాతం), 40 ఏళ్ళు (19.47 శాతం), 50 ఏళ్ళు (8.93 శాతం).
రెడెంప్షన్ ప్రొఫైల్‌ను సులభతరం చేయడానికి ప్రభుత్వం సెక్యూరిటీల మార్పిడిని కొనసాగిస్తుంది.

వేలం నోటిఫికేషన్‌లలో సూచించిన ప్రతి సెక్యూరిటీకి వ్యతిరేకంగా రూ.2,000 కోట్ల వరకు అదనపు సబ్‌స్క్రిప్షన్‌ను నిలుపుకోవడానికి గ్రీన్‌షూ ఎంపికను వినియోగించుకునే హక్కును ప్రభుత్వం కొనసాగిస్తుంది.

2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (క్యూ1) ట్రెజరీ బిల్లుల జారీ ద్వారా వారంవారీ రుణం మొదటి ఏడు వేలం కోసం రూ.27,000 కోట్లు, తదుపరి ఆరు వేలం కోసం రూ.22,000 కోట్లు నికర రుణం రూ.(-)3,000 కోట్లు. త్రైమాసికంలో. మొదటి ఏడు వేలంలో 91 డీటీబీల క్రింద రూ.12,000 కోట్లు, 182 డీటీబీల క్రింద రూ.7,000 కోట్లు, 364 డీటీబీల క్రింద రూ.8,000 కోట్లు, 91 డీటీబీల కింద రూ.10,000 కోట్లు, రూ..5,000 కోట్ల కింద రూ.5,000 కోట్ల చొప్పున వారంవారీ జారీ చేస్తారు. త్రైమాసికంలో నిర్వహించే తదుపరి ఆరు వేలంలో 364 డీటీబీల క్రింద రూ.7,000 కోట్లుకి వేలం ఉంటుంది. 

బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరం హెచ్1 కోసం వేస్ అండ్ మీన్ అడ్వాన్సెస్ (డబ్ల్యూఎంఏ) పరిమితిని రూ.1.50 లక్షల కోట్లుగా నిర్ణయించింది. ఆర్థిక మంత్రి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,  వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్న వివరణాత్మక పత్రిక ప్రకటనలో మరిన్ని వివరాలను చూడవచ్చు. 

http://https//www.pib.gov.in/PressReleaseIframePage.aspx?PRID=2016489

***



(Release ID: 2016529) Visitor Counter : 132