ప్రధాన మంత్రి కార్యాలయం
జర్మనీ యొక్క చాన్స్‌లర్ భారతదేశాన్ని సందర్శించిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన పత్రికా ప్రకటన పూర్తి పాఠం
Posted On:
25 FEB 2023 2:24PM by PIB Hyderabad
శ్రేష్ఠుడైన చాన్స్ లర్ శ్రీ శోల్జ్,
ఇరు దేశాల ప్రతినిధులు,
ప్రసార మాధ్యాల భాగస్వాములు,
గుటన్ టాగ్ !
శుభాకాంక్షలు!
నేను నా మిత్రుడు చాన్స్‌లర్ శ్రీ శోల్జ్ కు మరియు ఆయన యొక్క ప్రతినిధి వర్గాని కి భారతదేశం లోకి ఆహ్వానం పలుకుతున్నాను. చాన్స్ లర్ శ్రీ శోల్జ్ చాలా సంవత్సరాల తరువాత భారతదేశం సందర్శన కు విచ్చేశారు. ఆయన 2012 వ సంవత్సరం లో మొట్టమొదటి సారి గా భారతదేశాని కి వచ్చారు; హామ్‌బర్గ్ యొక్క మేయరు భారతదేశాన్ని సందర్శించడం అదే తొలి సారి. భారతదేశాని కి, జర్మనీ కి మధ్య సంబంధాల అవకాశాలు ఎటువంటివో ఆయన చాలా కాలం క్రితమే గ్రహించారు అనేది సుస్పష్టం.
కిందటి సంవత్సరం లో మనం మూడు సారులు సమావేశమయ్యాం. ప్రతిసారి ఆయన యొక్క ముందుచూపు మరియు దార్శనికత మన ద్వైపాక్షిక సంబంధాల కు ఒక క్రొత్త వేగాన్ని, ఇంకా శక్తి ని ఇచ్చాయి. ఈ రోజు న జరిగిన సమావేశం లో కూడా మనం అన్ని ముఖ్యమైన ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాల పై సమగ్రం గా చర్చించాం.
మిత్రులారా,
భారతదేశం మరియు జర్మనీ ల బలమైన సంబంధాలు, ఉమ్మడి ప్రజాస్వామిక విలువల పైన, ఒకరి హితాల పట్ల మరొకరి కి గల ప్రగాఢమైన అవగాహన పైన ఆధారపడి ఉన్నాయి. ఉభయ దేశాలు సాంస్కృతికం గా, ఆర్థిక అంశాల పరం గా ఆదాన ప్రదానాల తాలూకు ఒక దీర్ఘమైన చరిత్ర ను కలిగి ఉన్నాయి. ప్రపంచం లో అతి పెద్దవైన రెండు ప్రజాస్వామ్య ఆర్థిక వ్యవస్థ ల మధ్య సహకారం వృద్ధి చెందుతూ ఉండడం, ఇరు దేశాల ప్రజల కు ప్రయోజనకరం కావడం మాత్రమే కాక ఉద్రిక్తతల తో అట్టుడుకుతున్న వర్తమాన ప్రపంచ దేశాల కు ఒక సకారాత్మకమైనటువంటి సందేశాన్ని కూడా అందిస్తున్నాయి.
యూరోపు లో మాకు అతి పెద్ద వ్యాపార భాగస్వామి గా జర్మనీ ఉండడం తో పాటు భారతదేశం లో పెట్టుబడుల కు ఒక ముఖ్యమైన వనరు గా కూడాను ఉన్నది. ప్రస్తుతం ‘‘మేక్ ఇన్ ఇండియా’’ మరియు ‘‘ఆత్మనిర్భర్ భారత్’’ ప్రచార కార్యక్రమాల కారణం గా భారతదేశం లో అన్ని రంగాల లోను క్రొత్త అవకాశాలు అందివస్తున్నాయి. ఈ అవకాశాల విషయం లో జర్మనీ కనబరుస్తున్న ఆసక్తి మాకు చాలా ప్రోత్సాహకరం గా ఉన్నది.
చాన్స్ లర్ శ్రీ శోల్జ్ వెంట ఈ రోజు న విచ్చేసినటువంటి వ్యాపార రంగ ప్రతినిధి వర్గం, మరి అలాగే భారతదేశం లోని వ్యాపార రంగ ప్రముఖులు ఒక చక్కని సమావేశం లో పాల్గొని కొన్ని మంచి మరియు ముఖ్యమైనటువంటి ఒప్పందాల ను కుదుర్చుకొన్నారు. రెండు దేశాల పరిశ్రమ రంగ ప్రముఖుల నుండి డిజిటల్ ట్రాన్స్ ఫార్మేశన్, ఫిన్ టెక్, ఐటి, టెలికమ్ మరియు డైవర్సిఫికేశన్ ఆఫ్ సప్లయ్ చైన్ వంటి అంశాల పై మంచి ఉపయోగకరమైన అభిప్రాయాలు, సూచన లు లభించాయి.
మిత్రులారా,
భారతదేశం మరియు జర్మనీ లు త్రికోణీయ అభివృద్ధి సహకారం లో భాగం గా మూడో దేశాల లో అభివృద్ధి కి గాను పరస్పర సహకారాన్ని ఇనుమడింప చేసుకొంటున్నాయి. గత కొన్నేళ్ళ లో మన మధ్య ప్రజల పరస్పర సంబంధాలు కూడా సుదృఢం అయ్యాయి. కిందటి సంవత్సరం డిసెంబరు నెల లో సంతకాలైనటువంటి మైగ్రేశన్ ఎండ్ మొబిలిటీ పార్ట్‌నర్‌శిప్ ఎగ్రీమెంట్ తో ఈ సంబంధాలు మరింత గాఢతరం గా మారబోతున్నాయి.
మారుతున్న కాలాల యొక్క అవసరాల ను బట్టి మేం మా యొక్క సంబంధాల కు సరిక్రొత్త కార్యక్రమాల ను జోడిస్తున్నాం. గ్రీన్ ఎండ్ సస్ టేనబుల్ డివెలప్ మెంట్ పార్ట్ నర్ శిప్ ను క్రిందటి సంవత్సరం లో నేను జర్మనీ కి వెళ్ళిన సందర్భం లో ప్రకటించడమైంది. దీని మాధ్యం ద్వారా జలవాయు సంబంధి కార్యాచరణ మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల రంగాల లో సహకారాన్ని మనం విస్తరింప జేసుకొంటున్నాము. నవీకరణ యోగ్య శక్తి, గ్రీన్ హైడ్రోజన్, ఇంకా జీవ ఇంధనాలు వంటి రంగాల లో కూడాను కలసి పని చేయాలి అని కూడా మనం నిర్ణయించాం.
మిత్రులారా,
మన వ్యూహాత్మక భాగస్వామ్యం లో భద్రత మరియు రక్షణ రంగ సహకారం ఒక ముఖ్య స్తంభం గా మారేందుకు ఆస్కారం ఉంది. ఈ రంగం లో ఇంతవరకు మనం గమనించని అవకాశాల ను పూర్తి స్థాయి లో వినియోగించుకోవడం కోసం మనం మన ప్రయాసల ను కొనసాగించుదాం. ఉగ్రవాదాని కి వ్యతిరేకం గా మరియు వేర్పాటువాదాని కి వ్యతిరేకం గా సాగించే యుద్ధం లో భారతదేశాని కి మరియు జర్మనీ కి మధ్య క్రియాశీలమైన సహకారం ఉంది. సీమాంతర ఉగ్రవాదాని కి స్వస్తి పలికేందుకు ఉమ్మడి కార్యాచరణ అవసరం అని రెండు దేశాలు అంగీకరించాయి.
మిత్రులారా,
కోవిడ్ మహమ్మారి మరియు యూక్రేన్ సంఘర్షణ ల ప్రభావాల ను యావత్తు ప్రపంచం చవిచూసింది. ఈ రెండు అంశాలు మరీ ముఖ్యం గా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల పైన వ్యతిరేక ప్రభావాన్ని ప్రసరింప చేశాయి. మనం ఈ విషయం లో మన ఉమ్మడి ఆందోళన ను వ్యక్త పరిచాం. ఈ సమస్యల ను సంయుక్త ప్రయత్నాల ద్వారా మాత్రమే పరిష్కరించవచ్చని మనం అంగీకరించాం. జి-20 కి భారతదేశం అధ్యక్ష బాధ్యతల ను నిర్వర్తించిన కాలం లోనూ మనం ఇదే విషయమై నొక్కిపలికాం.
యూక్రేన్ లో ఘటన క్రమం మొదలైనప్పటి నుండే ఈ విభాగాన్ని చర్చ ద్వారా ను, దౌత్యం ద్వారాను పరిష్కరించుకోవాలి అని భారతదేశం స్పష్టం చేస్తూ వచ్చింది. ఏ శాంతి ప్రక్రియ లో అయినా తన వంతు పాత్ర ను పోషించడానికి భారతదేశం సిద్ధం గా ఉంది. బహుళ పార్శ్విక సంస్థల లో సంస్కరణల ను తీసుకు రావడం అనేది ప్రపంచ వాస్తవికతల ను మెరుగైన పంథా లో చాట గలుగుతుంది అని కూడా మనం సమ్మతి ని పునరుద్ఘాటించాం. ఐ.రా.స. భద్రత మండలి లో సంస్కరణ ల కోసం జి-4 పరిధి లో మేం చురుకు గా పాలుపంచుకోవడం ఈ సంగతి ని స్ఫష్టం చేసింది.
శ్రేష్ఠుడా,
భారతదేశం ప్రజల అందరి తరఫున మీకు మరియు మీ ప్రతినిధి వర్గాని కి నేను మరోసారి భారతదేశం లోకి ఆహ్వానాన్ని పలుకుతున్నాను. ఈ సంవత్సరం సెప్టెంబరు లో భారతదేశం లో జరుగనున్న జి-20 శిఖర సమ్మేళనాని కి మిమ్ముల ను ఆహ్వానించేందుకు మాకు మరొకసారి అవకాశం దక్కనుంది. భారతదేశాని కి ప్రస్తుతం విచ్చేసినందుకు, మరి అలాగే ఈ రోజు న ఒక ప్రయోజనకరమైన చర్చ లో పాలుపంచుకొన్నందుకు మీకు అనేకానేక ధన్యవాదాలు.
అస్వీకరణ: ప్రధాన మంత్రి ప్రసంగానికి ఇది భావానువాదం. ప్రధాన మంత్రి ప్రసంగం హిందీ భాష లో కొనసాగింది.
***
(Release ID: 2016336)
Visitor Counter : 67
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam