ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా- బాంగ్లాదేశ్ ఫ్రెండ్ శిప్ పైప్ లైను ను సంయుక్తం గా వర్చువల్ పద్ధతి లోప్రారంభించే కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ఇచ్చిన ప్రసంగంపాఠం    

Posted On: 18 MAR 2023 7:12PM by PIB Hyderabad

యాఁర్ ఇక్సెలన్సి,

ప్రధాని శేఖ్ హసీనా గారు,

అసమ్ యొక్క ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ,

కేంద్ర మంత్రివర్గం లో నా సహచరుడు శ్రీ హర్ దీప్ పురి,

మరియు అసమ్ నుండి భారత ప్రభుత్వం లో మంత్రి గా ఉన్న శ్రీ రామేశ్వర్ తెలి,

ఇంకా మనతో జతపడ్డ ఇతరులు అందరి కి,

నమస్కారం.

భారతదేశం-బాంగ్లాదేశ్ సంబంధాల చరిత్ర లో ఒక క్రొత్త అధ్యాయం ఈ రోజు న మొదలైంది. ఇండియా- బాంగ్లాదేశ్ ఫ్రెండ్ శిప్ పైప్ లైన్ కు 2018 వ సంవత్సరం లో సెప్టెంబరు నెల లో మనం పునాది ని వేసుకొన్నాం. మరి ఆ పైప్ లైను ను ప్రధాని శేఖ్ హసీనా గారి తో కలసి ప్రారంభించే అవకాశం ఈ రోజు న లభించినందుకు నాకు సంతోషం గా ఉంది.

 

ఈ ప్రాజెక్టు తాలూకు పని కోవిడ్ 19 మహమ్మారి కాలం లో సైతం కొనసాగడం కూడా ను సంతోషాన్ని కలిగించే విషయమే. ఈ గొట్టపుమార్గం తో, ఒక మిలియన్ మీట్రిక్ టన్నుల హైస్పీడ్ డీజెల్ ను బాంగ్లాదేశ్ లో ఉత్తర దిక్కున గల అనేక జిల్లాల కు సరఫరా చేసేందుకు వీలు అవుతుంది. ఆ గొట్టపుమార్గం ద్వారా సరఫరా చేయడం వల్ల ఖర్చు తగ్గడం ఒక్కటే కాకుండా కర్బన పాదముద్ర ను కూడా తగ్గించవచ్చును. ఆధారపడదగ్గ రీతి న మరియు తక్కువ ఖర్చు మాత్రమే అయ్యేటటువంటి డీజెల్ సరఫరా ప్రత్యేకించి వ్యవసాయ రంగానికి ప్రయోజనాన్ని అందించేదే. ఈ సరఫరా ద్వారా స్థానిక పరిశ్రమ లు సైతం లాభపడతాయి.

 

ప్రపంచం లో ప్రస్తుతం నెలకొన్న స్థితిగతుల లో అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు వాటి ఆహారం మరియు శక్తి సంబంధి భద్రత కు పూచీ పడడానికి పెనుగులాడుతున్నాయి. ఈ సందర్భం లో, ఈ రోజు న నిర్వహించుకొంటున్న కార్యక్రమాని కి ఎక్కడలేనటువంటి ప్రాముఖ్యం ఉన్నది.

 



మిత్రులారా,
గడచిన కొన్నేళ్ల లో, ప్రధాని శేఖ్ హసీనా గారి సమర్థ నాయకత్వం లో బాంగ్లాదేశ్ ప్రశంసాయోగ్యమైనటువంటి పురోగతి ని సాధించింది. మరి ఈ విషయం లో భారతదేశం లో ప్రతి ఒక్కరు గర్వ పడుతున్నారు. బాంగ్లాదేశ్ యొక్క ఈ అభివృద్ధి ప్రయాణానికి మా వంతు తోడ్పాటు ను అందించగలిగనందుకు మేం కూడా సంతోషిస్తున్నాం. ఈ గొట్టపుమార్గం బాంగ్లాదేశ్ యొక్క వృద్ధి ని తప్పక మరింత వేగవంతం చేయడం తో పాటు గా రెండు దేశాల మధ్య పెంపొందుతున్న కనెక్టివిటీ కి ఒక ఉత్కృష్టమైనటువంటి ఉదాహరణ కాగలదని నేను నమ్ముతున్నాను. మన కనెక్టివిటీ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క స్తంభాన్ని బలపరచుకొంటూ మనం ముందుకు సాగిపోవలసిన అవసరం ఉన్నది. అది రవాణా రంగం లో కావచ్చు, శక్తి రంగం లో కావచ్చు, విద్యుత్తు రంగం లో కావచ్చు, లేదా డిజిటల్ ఫీల్డు కావచ్చు, మన కనెక్టివిటీ ఎంత పెరిగితే, మన దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు అంతగా బలోపేతం అవుతాయి.

 

 

నేను జ్ఞాపకం ఉంది, చాలా సంవత్సరాల క్రితం ప్రధాని శేఖ్ హసీనా గారు 1965వ సంవత్సరానికి మునుపటి రైల్ కనెక్టివిటీ ని పునరుద్ధరించాలన్న తన దృష్టికోణాన్ని గురించి మాట్లాడారు. అప్పటి నుండి ఇరు దేశాలు ఆ రంగం లో చాలా పురోగతి ని సాధించాయి. తత్ఫలితం గా, కోవిడ్ 19 మహమ్మారి కాలం లో, మేం రైల్ నెట్ వర్క్ ద్వారా బాంగ్లాదేశ్ కు ఆక్సిజను మొదలైన వాటి ని పంపించ గలిగాం. ప్రధాని శేఖ్ హసీనా జీ ని ఆమె యొక్క ఈ దూరదృష్టి యుక్త దార్శనికత కు గాను ఆమె కు నేను హృదయపూర్వక అభినందనల ను తెలియజేయదలచుకొన్నాను.

 

 

మిత్రులారా,
విద్యుత్తు రంగం లో మన ఉభయ పక్షాల సహకారం చాలా విజయవంతం గా ఉండింది. ప్రస్తుతం భారతదేశం 1100 మెగావాట్ కు పైచిలుకు విద్యుత్తు ను బాంగ్లాదేశ్ కు సరఫరా చేస్తోంది. మైత్రి సుపర్ థర్మల్ పవర్ ప్లాంటు లో ఒకటో యూనిటు కూడా కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఆ యూనిటు ను ప్రధాని శేఖ్ హసీనా గారు క్రిందటి సంవత్సరం లో భారతదేశాన్ని ఆమె సందర్శించిన కాలం లో ప్రారంభించారు. మరి ఇప్పుడు మనం రెండో యూనిటు కార్యకలాపాల ను ప్రారంభించే దిశ లో పయనిస్తున్నాం.

 


శక్తి రంగం లో సహకారం విషయానికి వస్తే, మన పెట్రోలియమ్ వ్యాపారం ఒక బిలియన్ యుఎస్ డాలరు స్థాయి ని మించింది. హైడ్రోకార్బన్ ల తాలూకు యావత్తు వేల్యూ చైన్ లో.. అది అప్ స్ట్రీమ్ కావచ్చు, మిడ్ స్ట్రీమ్ కావచ్చు లేదా డౌన్ స్ట్రీమ్ కావచ్చు.. మన సహకారం కొనసాగుతూ ఉంది అనే అంశం గర్వ కారణమని చెప్పాలి. ఈ సహకారం, ఈ పైప్ లైను తో మరింత గా విస్తరించనున్నది.

 

 

ఈ ప్రాజెక్టు తో ప్రమేయం ఉన్నటువంటి అధికారులు అందరిని, ప్రత్యేకించి నుమాలీగఢ్ రిఫైనరి మరియు బాంగ్లాదేశ్ పెట్రోలియమ్ కార్ పొరేశన్ తో సంబంధం కలిగివున్నటువంటి అధికారులు అందరి ని నేను అభినందించ దలచాను.

 

ఇక్సెలన్సి,

ఈ రోజు న ఈ ప్రారంభ కార్యక్రమం బంగబంధు శ్రీ శేఖ్ ముజీబుర్ రహమాన్ యొక్క జయంతి జరిగిన మరుసటి రోజే చోటు చేసుకొంటూ ఉండడం ఎంత మంగళప్రదం అయినటువంటి యాదృచ్చిక ఘటనో కదా! యావత్తు ప్రాంతం యొక్క మైత్రీపూర్వకమైనటువంటి అభివృద్ధి మరియు సమృద్ధి అనేవి బంగబంధు యొక్క ‘శోనార్ బాంగ్లా’ దృష్టికోణం లో భాగం గా ఉన్నాయి. ఈ సంయుక్త పరియోజన ఆయన దార్శనికత కు ఒక పరిపూర్ణమైన ఉదాహరణ గా ఉంది.



ఇక్సెలన్సి,
భారతదేశం, బాంగ్లాదేశ్ ల సహకారం లో ని ప్రతి దశ మీ యొక్క మార్గదర్శకత్వం నుండి లాభపడిందండి. ఆ దశ ల లో ఈ ప్రాజెక్టు కూడా ఒకటి గా ఉంది. ఈ కార్యక్రమం లో నాతో కలసి పాల్గొన్నందుకు గాను మీకు అనేకానేక ధన్యవాదాలు. ఈ పరియోజన నుండి లాభపడే ప్రజలు అందరి కి కూడాను చాలా చాలా అభినందన లు.

 

మీకు ధన్యవాదాలు.

 

అస్వీకరణ: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి భావానువాదం. మూల ఉపన్యాసం హిందీ భాష లో ఉంది.

 

***



(Release ID: 2016310) Visitor Counter : 22