పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని (మార్చి 21) నిర్వహించిన నేషనల్ జూలాజికల్ పార్క్
Posted On:
22 MAR 2024 1:34PM by PIB Hyderabad
2024 మార్చి 21 న నేషనల్ జూలాజికల్ పార్క్(ఢిల్లీ జూ ) లో అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ ఏడాది 'అడవులు, ఆవిష్కరణలు: మెరుగైన ప్రపంచానికి కొత్త పరిష్కారాలు' అనే ఇతివృతంతో అంతర్జాతీయ అటవీ దినోత్సవం జరిగింది. మొక్కల ప్రాధాన్యత, దైనందిన జీవితంలో మొక్కల ప్రాముఖ్యత పై సందర్శకులకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
నేషనల్ జూలాజికల్ పార్క్ లోని ఎడ్యుకేషన్ సెంటర్ లో డూడుల్ ఆర్ట్ తో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కార్యక్రమంలో సందర్శకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తరువాత మిషన్-లైఫ్ పై ఒక చలనచిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం సందర్శకుల కోసం ఇటీవల పునరుద్ధరించిన జలాశయం పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నేషనల్ జూలాజికల్ పార్కు సిబ్బంది మొక్కలు నాటారు.
వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావాన్ని తట్టుకోవడానికి అడవులను రక్షించడానికి పటిష్ట చర్యలు అమలు చేయాల్సి ఉంటుంది. అటవీ సంరక్షణ ద్వారా భావితరాలకు శ్రేయస్సు సంక్షేమం అందించడానికి అవకాశం కలుగుతుంది.వినూత్న చర్యలను అమలు అమలు చేసి సహజ వనరులను రక్షించవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలి.
***
(Release ID: 2016070)
Visitor Counter : 311