గనుల మంత్రిత్వ శాఖ
జనవరి 2024లో 5.9% వృద్ధిని సాధించిన దేశ ఖనిజ ఉత్పత్తి
Posted On:
20 MAR 2024 12:21PM by PIB Hyderabad
జనవరి 2024 నెల (ఆధారంః 2011-12 =100) గనుల తవ్వకాలు, క్వారీ రంగంలో ఖనిజ ఉత్పత్తి సూచిక 144.1 వద్ద ఉంది. జనవరి 2023 నెల ముగింపు సమయంతో పోలిస్తే ఇది 5.9% ఎక్కువ. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబిఎం) తాత్కాలిక గణాంకాల ప్రకారం, ఏప్రిల్- జనవరి 2023-24 కాలానికి సంచిత వృద్ధి గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8.3%గా ఉంది.
జనవరి 2024లో ముఖ్య ఖనిజాల ఉత్పత్తి స్థాయి ఈ విధంగా ఉన్నదిః బొగ్గు 998 లక్షల టన్నులు, లిగ్నైట్ 41 లక్షల టన్నులు, సహజవాయువు (వినియోగించింది) 3073 మిలియన్ క్యూబిక్ మీటర్లు, పెట్రోలియం (ముడి) 25 లక్షల టన్నలు, బాక్సైట్ 2426 వేల టన్నలు, క్రోమైట్ 251 వేల టన్నలు, సాంద్ర రాగి 12.6 వేల టన్నులు, బంగారం 134 కిలోలు, ముడి ఇనుము 252 లక్షల టన్నులు, సాంద్ర సీసం 34వేల టన్నులు, మాంగనీస్ ధాతువులు 304 వేల టన్నులు, సాంద్ర జింక్ 152 వేల టన్నులు, సున్నపు రాయి 394 లక్షల టన్నులు, ఫాస్ఫొరేట్ 109 వేల టన్నులు, మాగ్నెసైట్ 13వేల టన్నులు.
జనవరి 2023తో పోలిస్తే జనవరి 2024లో సానుకూల వృద్ధి రేటు చూపుతున్న ముఖ్య ఖనిజాలుః మాగ్నెసైట్ (90.1%), సాంద్ర రాగి (34.2%), బొగ్గు (10.3%), సున్నపురాయి (10%), బాక్సైట్ (9.8%), మాంగనీసు ధాతువు (7.8%), సహజవాయువు (యు) (5.5%), సాంద్ర సీసం (5.2%), ముడి ఇనుము (4.3%), లిగ్నైట్ ( 3.6%), సాంద్ర జింక్ (1.3%), పెట్రోలియం (ముడి) (0.7%). ప్రతికూల వృద్ధిని చూపుతున్న ఇతర ముఖ్య ఖనిజాలు బంగారు (-23.4%), క్రోమైట్ (-35.2%), ఫాస్ఫొరేట్ (-44.4%).
***
(Release ID: 2015813)
Visitor Counter : 125