రక్షణ మంత్రిత్వ శాఖ
టైగర్ ట్రయంఫ్ -24 విన్యాసాలు
Posted On:
18 MAR 2024 4:36PM by PIB Hyderabad
భారత్, యుఎస్‌ల మధ్య భాగస్వామ్యానికి కట్టుబడి లేక అనుగుణంగా, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ట్రై సర్వీస్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ (త్రివిధ దళాల -హెచ్ఎడిఆర్- మానవీయ సహాయ, విపత్తు ఉపశమనం) విన్యాసాలు, టైగర్ ట్రయంఫ్ -24ను 18 నుంచి 31 మార్చి 2024వరకు తూర్పు సముద్రతీరంలో నిర్వహించనున్నారు. ర్యాపిడ్ యాక్షన్ మెడికల్ టీం (ఆర్ఎఎంటి- సత్వర చర్య తీసుకునే వైద్య బృందం) సహా సమగ్ర హెలికాప్టర్లు, లాండింగ్ క్రాఫ్టలు ఎక్కించి, భారత నావికాదళ విమానం, భారతీయ సైనిక సిబ్బంది, వాహనాలు, భారతవైమానిక దళ విమానం, హెలికాప్టర్లు, భారత నావికాదళ నౌకలు ఈ విన్యాసంలో పాలుపంచుకుంటాయి.
యుఎస్ నావికాదళ సిబ్బంది, యుఎస్ సైనిక దళాలతో కూడిన యుఎస్ నావికాదళ నౌకలు యుఎస్‌కు ప్రాతినిధ్యం వహిస్తాయి. హెచ్ఎడిఆర్ ఆపరేషన్లను నిర్వహించడంలోనూ, ఇరు దేశాల దళాల మధ్య సాఫీ అయిన సమన్వయం, సత్వర తోడ్పాటు కోసం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు (ఎస్ఒపి- ప్రామాణిక కార్యనిర్వహణ పద్ధతులు)ను మరింత మెరుగుపరిచేందుకు ఇంటర్ ఆపరబిలిటీని పెంపొందించే లక్ష్యంతో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు.
హార్బర్ ఫేజ్ (రేవు దశ)ను 18 నుంచి 25 మార్చి 2024వరకు నిర్వహించనున్నారు. ఇరు నావికాదళాల సిబ్బంది శిక్షణ పర్యటనలు, పాఠ్యాంశాల నైపుణ్యాల ఇచ్చిపుచ్చుకోవడం, క్రీడా పోటీలు, సామాజిక పరస్పర చర్యలలో పాల్గొననున్నాయి. హార్బర్ ఫేజ్ పూర్తి అయిన తర్వాత, దళాలను ఎక్కించుకొని ఉన్న నౌకలు సముద్ర దశ కోసం తరలివెళ్ళి, కృత్రిమంగా సృష్టించిన పరిస్థితులలో సముద్ర, ఉభయచర, హెచ్ఎడిఆర్ కార్యకలాపాలను చేపడతాయి.
***
(Release ID: 2015619)
Visitor Counter : 195