ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బల్గేరియా కు చెందిన నౌక ‘‘రుయెన్’’ దారి మళ్ళింపున కు గురి కాగా ఆ నౌక ను భారతీయనౌకాదళం రక్షించిన సందర్భం లో బల్గేరియా గణతంత్రం అధ్యక్షుని యొక్క కృతజ్ఞత భరిత సందేశానికిజవాబిచ్చిన ప్రధాన మంత్రి

Posted On: 19 MAR 2024 10:33AM by PIB Hyderabad

బల్గేరియా కు చెందిన నౌక ‘‘రుయెన్’’ దారి మళ్లింపు నకు గురి కాగా అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు బల్గేరియా పౌరులు సహా ఆ నౌక ను నడుపుతున్న సిబ్బంది ని భారతదేశాని కి చెందిన నౌకాదళం రక్షించిన ఘటన కు సంబంధించి బల్గేరియా గణతంత్రం అధ్యక్షుడు శ్రీ రుమెన్ రాదేవ్ వ్యక్తం చేసిన కృతజ్ఞత సందేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమాధానాన్ని ఇచ్చారు. అధ్యక్షుని అభిప్రాయాన్ని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, నౌకాయానం తాలూకు స్వాతంత్ర్యాన్ని రక్షించడం, హిందూ మహాసముద్ర ప్రాంతం లో సముద్ర సంబంధి దోపిడి లను మరియు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం భారతదేశం యొక్క వచన బద్ధత ను పునరుద్ఘాటించారు.

 

ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘బల్గేరియా గణతంత్రం అధ్యక్షులైన మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని ప్రశంసిస్తున్నాను. నౌక లో ఉన్న బల్గేరియా పౌరులు ఏడుగురు సురక్షితం గా ఉన్నారు, మరి త్వరలోనే స్వదేశాని కి తిరుగు ప్రయాణం కానున్నారు అని తెలిసి మేం సంతోషిస్తున్నాం. నౌకాయానం సంబంధి స్వాతంత్ర్యాన్ని రక్షించాలని, హిందూ మహాసముద్ర ప్రాంతం లో సముద్ర సంబంధి దోపిడిల ను మరియు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవాలని భారతదేశం కంకణం కట్టుకొంది.’’ అని పేర్కొన్నారు.

 


(Release ID: 2015534) Visitor Counter : 175