గనుల మంత్రిత్వ శాఖ
భారతదేశపు ఖనిజ సంపద అన్వేషణ: రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన ఖనిజ నిల్వలలో అన్వేషణ లైసెన్సుల (ఈఎల్) మంజూరు కోసం ఎన్ఐటిలను జారీ చేస్తాయి
Posted On:
15 MAR 2024 11:13AM by PIB Hyderabad
కీలకమైన, లోతైన ఖనిజాల సామర్థ్యాన్ని వెలికి తీసే దిశగా కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు గణనీయమైన పురోగతిని సాధించాయి. ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ (ఈఎల్) వేలం కోసం నోటీసు ఆహ్వాన టెండర్‌లను (ఎన్ఐటి) జారీ చేశాయి.
దేశంలోని 29 కీలకమైన, లోతైన ఖనిజాల అన్వేషణ, మైనింగ్‌ను మరింత పెంచడానికి 17.08.2023 నుండి మైన్స్ మరియు మినరల్స్ (డెవలప్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం, 1957 సవరణ ద్వారా అన్వేషణ లైసెన్స్ విధానం ప్రవేశపెట్టారు. వేలం ద్వారా ఏడవ షెడ్యూల్‌లో పేర్కొన్న ఖనిజాల కోసం అన్వేషణ లైసెన్స్‌ని మంజూరు చేయవచ్చు. మినరల్ (వేలం) సవరణ నియమాలు, 2024 ద్వారా అన్వేషణ లైసెన్స్ మంజూరు ప్రక్రియ తెలియజేసారు.
కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 6, 2024న కీలకమైన, లోతైన ఖనిజాల కోసం ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ (ఈఎల్) వేలం గురించి తొలి సారి నోటిఫై చేసాయి. కర్ణాటక రాయచూర్, యాద్గిర్ జిల్లాలలో ఒక బ్లాక్ గోల్డ్, కాపర్, లిథియం వేలాన్ని ప్రారంభించింది. రాజస్థాన్‌లో బార్మర్, జోధ్‌పూర్, హనుమాన్‌గఢ్, చురు, బికనేర్, శ్రీ గంగానగర్, జైపూర్, నాగౌర్, సికార్ జిల్లాల్లోని రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, రేర్ మెటల్ మరియు పొటాష్ ఖనిజాల మూడు బ్లాక్‌ల వేలాన్ని ప్రారంభించింది.
మార్చి 7, 2024న మహారాష్ట్ర తన ఎన్ఐటిని రెండు ఈఎల్ బ్లాక్‌లకు ప్రకటించడంతో ఈ ప్రక్రియ ఊపందుకుంది. ఆ తర్వాత మార్చి 11, 2024న మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వరుసగా రెండు, ఒక ఈ\ఎల్ బ్లాక్‌లతో, ఛత్తీస్‌గఢ్ మూడు EL బ్లాక్‌లతో మార్చి 13, 2024న అగ్రస్థానంలో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ పాలనను విస్తరించడం ద్వారా మొత్తం 12 ఈఎల్ బ్లాక్‌లకు చేరుకుంది.
మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో లెడ్, జింక్, కాపర్ (బేస్ మెటల్) తో పాటు రెండు డైమండ్ ఈఎల్ బ్లాక్‌ల కోసం ఎన్ఐటి జారీ చేసింది, రాగి, సీసం, జింక్, అనుబంధ ఖనిజాలు (బేస్ మెటల్), పిజిఈ తో కూడిన డైమండ్ రెండు ఈఎల్ బ్లాకుల కోసం ఎన్ఐటిని జారీ చేసింది. శివపురి, గ్వాలియర్, బేతుల్ జిల్లాల్లో అనుబంధిత ఖనిజాలు, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అరుదైన భూమి మూలకం ఒక బ్లాక్ కోసం ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటిని జారీ చేసింది. ఇంకా, చత్తీస్‌గఢ్ ప్రభుత్వం కొండగాం, నారాయణపూర్, బస్తర్ జిల్లాల్లో డైమండ్, రేర్ ఎర్త్ గ్రూప్ మినరల్స్ కోసం మూడు ఈఎల్ బ్లాక్‌ల కోసం NITని జారీ చేశారు.
ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ పాలన అనేది లిథియం, రాగి, వెండి, వజ్రం, బంగారం వంటి కీలకమైన ఖనిజాల అన్వేషణను వేగవంతం చేయడానికి ఉద్దేశించింది. ఇందులో ప్రైవేట్ రంగం నుండి చురుకైన భాగస్వామ్యం ఉంటుంది. వేలం ప్రక్రియ ద్వారా, లైసెన్సీ ఆచరణీయమైన మైనింగ్ ప్రాంతాలను గుర్తించడానికి పరిశోధన, ప్రాస్పెక్టింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి అనుమతిస్తారు. వేలం బిడ్ ప్రకారం 50 సంవత్సరాల పాటు వేలం ప్రీమియం నుండి వచ్చే ఆదాయంలో లైసెన్సుదారు వాటా పొందుతారు. ఇంకా, ఈఎల్ హోల్డర్ ఈఎల్ అమలు చేసిన తర్వాత లైసెన్స్‌ను బదిలీ చేయవచ్చు.
ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ హోల్డర్‌లు బ్లాక్‌లను అన్వేషించడంలో, మైనింగ్ లీజు వేలం కోసం అనువైన ప్రాంతాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తారు. ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్‌ల కోసం వేలం ప్రక్రియ రివర్స్ బిడ్డింగ్‌ను ఉపయోగించుకుంటుంది, మైనింగ్ లీజు హోల్డర్ చెల్లించాల్సిన వేలం ప్రీమియంలో బిడ్డర్‌లు తాము తీసుకునే శాతాన్ని కోట్ చేస్తారు. అన్వేషణ లైసెన్సు కోసం అత్యల్ప శాతం బిడ్ ఉన్న బిడ్డర్ ప్రాధాన్య బిడ్డర్‌గా ఎంపిక అవుతారు.
కర్నాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు చేసిన ఈ సమిష్టి కృషి, కీలకమైన ఖనిజాల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, భారతదేశంలో అన్వేషణ రంగాన్ని అభివృద్ధి చేయడంలో వారి నిబద్ధతను నొక్కి చెబుతుంది.
బ్లాక్‌లు, టైమ్‌లైన్‌లు మొదలైన వాటి వివరాలను ఎంఎస్టిసి ఇ-వేలం ప్లాట్‌ఫారమ్: https://www.mstcecommerce.com/auctionhome/mlcln/ యాక్సెస్ చేయవచ్చు.
***
(Release ID: 2015236)