రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జంక్షన్ రైల్వే స్టేషన్ - మహాకాళేశ్వర్ మందిర్ మధ్య ఉన్న రోప్‌వే అభివృద్ధి, నిర్వహణ కోసం రూ.188.95 కోట్లు మంజూరు చేసిన శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
15 MAR 2024 12:11PM by PIB Hyderabad
మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని ఉజ్జయిని జంక్షన్ రైల్వే స్టేషన్ - మహాకాళేశ్వర్ మందిర్ మధ్య ఉన్న రోప్‌వే అభివృద్ధి, నిర్వహణ కోసం హైబ్రిడ్ యాన్యుటీ విధానం కింద రూ.188.95 కోట్లను ఆమోదించినట్లు కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.
ఈ రోప్‌వే, ప్రత్యేకించి యాత్రికులు ఎక్కువగా ఉండే సమయాల్లో రాకపోకలకు చక్కగా వీలు కల్పిస్తుందని, ప్రయాణ సమయాన్ని 7 నిమిషాలకు తగ్గిస్తుందని శ్రీ గడ్కరీ చెప్పారు. రోప్‌వే ద్వారా ప్రతిరోజూ 64,000 మంది యాత్రికులు రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది.
ఈ రోప్ వే కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుందని, పర్యావరణ అనుకూల రవాణాగా మారుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.
***
(Release ID: 2015122)