రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
అసోంలోని ఎన్‌హెచ్-17 (కొత్త నంబర్)/ఎన్‌హెచ్-31 (పాత నంబర్) మీద 4-వరుసల గౌరీపూర్ బైపాస్ నిర్మాణానికి రూ.421.15 కోట్లు మంజూరు చేసిన శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
15 MAR 2024 11:31AM by PIB Hyderabad
అసోంలోని ఎన్‌హెచ్-17 (కొత్త నంబర్)/ఎన్‌హెచ్-31 (పాత నంబర్) మీద 4-వరుసల గౌరీపూర్ బైపాస్ నిర్మాణానికి రూ.421.15 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. దుమర్దోహా పార్ట్-II నుంచి ధుబ్రి జిల్లాలోని బలద్మారా రహదారి వరకు ఈ ప్రాజెక్టు విస్తరించి ఉంది.
మొత్తం 9.61 కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ ప్రాజెక్టు వల్ల గౌరీపూర్ పట్టణంలో రద్దీ తగ్గడం మాత్రమే కాదు, ప్రస్తుత రహదారిపై అకస్మాత్ వంపుల వల్ల కలుగుతున్న ప్రమాదాలు తగ్గి, భద్రత పెరుగుతుందని శ్రీ గడ్కరీ చెప్పారు. సమగ్ర భద్రత చర్యలతో బైపాస్ నిర్మించడం వల్ల ఆ ప్రాంతంలో రహదారి ప్రమాదాలు గణనీయంగా తగ్గుతాయని మంత్రిత్వ శాఖ అధికార్లు అంచనా వేశారు.
***
(Release ID: 2015121)