వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంగా రూపొందిన ఈ-వెహికల్ విధానానికి ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం


, గరిష్ట పెట్టుబడి పరిమితి లేకుండా 4150 కోట్ల రూపాయల పెట్టుబడి ఆకర్షణ లక్ష్యంగా నూతన విధానం అమలు
భారతదేశంలో తయారీ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, ఎలక్ట్రిక్ వాహనాల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడానికి 3 సంవత్సరాల కాలపరిమితి విధించిన ప్రభుత్వం

గరిష్టంగా 5 సంవత్సరాల లోపు 50% దేశీయ విలువ జోడింపును చేరుకోవాలి

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సౌకర్యాలు ఏర్పాటు చేసే కంపెనీలకు తక్కువ కస్టమ్ డ్యూటీ తో పరిమితులకు లోబడి కార్లు దిగుమతి చేసుకోవడానికి అనుమతి

Posted On: 15 MAR 2024 1:35PM by PIB Hyderabad

ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా భారతదేశాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంగా రూపొందిన  ఈ-వెహికల్ విధానానికి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) ఉత్పత్తి అయ్యేందుకు నూతన విధానం తోడ్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా  ఈవీ తయారీ సంస్థలు భారతదేశ  ఈ-వెహికల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేలా   ఈ విధానాన్నిరూపొందించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల  భారతీయ వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తుంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి సహాయ పడుతుంది. ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ప్రోత్సహించడం ద్వారా వాహనాల ఉత్పత్తిని ఎక్కువ చేసి  ఎలక్ట్రిక్ వాహనాల రంగాన్ని బలోపేతం చేయడానికి నూతన విధానం ద్వారా కృషి జరుగుతుంది. ఉత్పత్తి పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. ముడి చమురు దిగుమతులు తగ్గడం వల్ల  వాణిజ్య లోటు తగ్గుతుంది.ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల  దేశంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో కాలుష్య సమస్య తగ్గి, ప్రజలు పర్యావరణం పై సానుకూల ప్రభావం కనిపిస్తుంది. 

విధానం ముఖ్య అంశాలు: 

* కనీస పెట్టుబడి 4150 కోట్ల రూపాయలు (500 మిలియన్ డాలర్లు)

* గరిష్ట పెట్టుబడిపై ఎటువంటి పరిమితి ఉండదు. 

* ఉత్పత్తి ప్రణాళిక: భారతదేశంలో తయారీ సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, ఎలక్ట్రిక్ వాహనాల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడానికి 3 సంవత్సరాల కాలపరిమితి.  గరిష్టంగా 5 సంవత్సరాల లోపు  50% దేశీయ విలువ జోడింపును చేరుకోవాలి

*తయారీ సమయంలో దేశీయ విలువ జోడింపు (DVA): 3 వ సంవత్సరం నాటికి 25% , 5వ సంవత్సరం నాటికి 50% స్థానికీకరణ స్థాయి చేరుకోవాలి 
* కనిష్ట CIF విలువ USD 35,000, అంతకంటే ఎక్కువ ఉన్న వాహనంపై మొత్తం 5 సంవత్సరాల వరకు 15% కస్టమ్స్ సుంకం (CKD యూనిట్లకు వర్తిస్తుంది)  వర్తిస్తుంది.  3 సంవత్సరాల వ్యవధిలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసే సంస్థలకు ఈ సౌకర్యం లభిస్తుంది. 

*  పెట్టుబడికి లేదా 6484 కోట్ల రూపాయల  (పిఎల్ఐ  పథకం కింద ప్రోత్సాహకానికి సమానం) వరకు  ఏది తక్కువ అయితే దానికి లోబడి  దిగుమతికి అనుమతించబడిన మొత్తం ఈవీ ల సంఖ్యపై సుంకం మినహాయింపు ఉంటుంది. పెట్టుబడి USD 800 మిలియన్  లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే సంవత్సరానికి 8,000 కి మించకుండా  కాకుండా గరిష్టంగా 40,000 ఈవీ లకు అనుమతిస్తారు.  ఉపయోగించని వార్షిక దిగుమతిని తదుపరి సంవత్సరానికి  బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. 
* కంపెనీ పెట్టుబడులకు కస్టమ్ డ్యూటీ స్థానంలో తగిన  బ్యాంక్ గ్యారెంటీ అందించాల్సి ఉంటుంది. 

* పథకం మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించిన డివిఏ, కనీస పెట్టుబడి ప్రమాణాలను సాధించని పక్షంలో బ్యాంక్ గ్యారెంటీ అమలు చేయబడుతుంది.

 

***



(Release ID: 2015113) Visitor Counter : 140