విద్యుత్తు మంత్రిత్వ శాఖ
2023-24లో 400 బిలియన్ యూనిట్ల (బీయు) విద్యుదుత్పత్తిని దాటిన ఎన్టీపీసీ
- గత సంవత్సరంలో ఉత్పత్తి చేయబడిన విద్యుత్తును అధిగమించిన ఎన్టీపీసీ
Posted On:
14 MAR 2024 12:11PM by PIB Hyderabad
ఎన్టీపీసీ గ్రూప్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 మార్చి, 2024న మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 400 బిలియన్ యూనిట్ల (బీయు) మార్కును అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23లో) కంపెనీ విద్యుత్తు ఉత్పత్తి 399.3 బిలియన్ యూనిట్లు దాటింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 మార్చి, 2024 వరకు NTPC యొక్క బొగ్గు స్టేషన్‌లకు సగటు ప్లాంట్ లోడింగ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 77.06%తో ఈ సరికొత్త మైలురాయిని దాటారు. అంతకు ముందు సంవత్సరంలో, కంపెనీ 2023 సెప్టెంబర్ 1న సంస్థ అత్యధికంగా ఒకే రోజు 1,428 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని నమోదు చేసింది. ఎన్టీపీసీ యూనిట్ల యొక్క నక్షత్ర పనితీరు ఎన్టీపీసీ ఇంజనీర్ల నైపుణ్యానికి మరియు దాని ఆపరేషన్ & నిర్వహణ పద్ధతులు మరియు వ్యవస్థలకు నిదర్శనం. ఇంకా, ఈ సాఫల్యం దేశానికి నమ్మకమైన మరియు సరసమైన విద్యుత్‌ను అందించాలనే సంస్థ నిబద్ధతను బలపరుస్తుంది. ఎన్టీపీసీ యొక్క స్థాపిత విద్యుత్ సామర్థ్యం 75.4 గిగా వాట్లు, 5 గిగావాట్ల పునరుత్పాదకాలను కలిగి ఉన్న 18 గిగావాట్ల సామర్థ్యం నిర్మాణంలో ఉంది. 2032 నాటికి 60 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించడానికి కంపెనీ కట్టుబడి ఉంది. విద్యుత్ ఉత్పత్తితో పాటు, ఎన్టీపీసీఈ ఇ-మొబిలిటీ, వేస్ట్-టు-ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ సొల్యూషన్స్‌తో సహా పలు కొత్త వ్యాపార రంగాలలోకి ప్రవేశించింది. కేంద్ర పాలిత ప్రాంతాల విద్యుత్ పంపిణీకి బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొంది. ఎన్టీపీసీ లిమిటెడ్ భారతదేశం యొక్క అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ యుటిలిటీ, ఇది దేశ విద్యుత్ అవసరాలలో 1/4వ వంతును అందిస్తుంది. థర్మల్, హైడ్రో, సోలార్ మరియు పవన విద్యుత్ ప్లాంట్ల యొక్క విభిన్న పోర్ట్‌ఫోలియోతో, ఎన్టీపీసీ నమ్మకమైన, సరసమైన మరియు స్థిరమైన విద్యుత్తును దేశానికి అందించడానికి అంకితం చేయబడింది. కంపెనీ ఉత్తమ పద్ధతులను అవలంబించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు పచ్చటి భవిష్యత్తు కోసం స్వచ్ఛమైన ఇంధన సాంకేతికతలను స్వీకరించడానికి కట్టుబడి ఉంది.
***
(Release ID: 2014877)
Visitor Counter : 115