రక్షణ మంత్రిత్వ శాఖ
పూర్వ రంగంః ఐఎన్ఎస్ చిల్కాలో అగ్నివీర్‌ల మూడవ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్
प्रविष्टि तिथि:
14 MAR 2024 11:44AM by PIB Hyderabad
అగ్నివీర్‌ల మూడవ బ్యాచ్ పాసింగ్ ఔట్ పరేడ్ (పిఒపి) 15 మార్చి 24న ఐఎన్ఎస్ చిల్కాలో జరుగనుంది.
మహిళా అగ్నివీర్‌లు సహా దాదాపు 2600మంది అగ్నివీర్‌లు చిల్కాలో పొందిన కఠినమైన శిక్షణకు విజయవంతమైన ముగింపును పిఒపి సూచిస్తుంది. నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ ముఖ్య అతిథిగా హాజరై, సూర్యాస్తమయానంతర పిఒపిని సమీక్షించనున్నారు. దక్షిణ నావికాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్- చీఫ్ వి. శ్రీనివాస్ కూడా పిఒపికి హాజరవుతారు.
ఈ మహత్తర ఘట్టాన్ని అగ్నివీర్ కోర్స్ పూర్తి చేసిన వారి కుటుంబ సభ్యులు సగర్వంగా వీక్షిస్తారు. ఇదే కాకుండా, వివిధ నైపుణ్యాలలో అత్యున్నత అనుభవజ్ఞులు, క్రీడా ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని, తమ అద్భుత విజయాలతో అగ్నివీరులకు ప్రేరణను ఇవ్వనున్నారు.
నావికాదళాధిపతి వీడ్కోలు కార్యక్రమానికి కూడా హాజరై, వివిధ డివిజన్లకు అవార్డులను, ట్రోఫీలను అందించడంతో పాటు ట్రైనీల ద్విభాషా పత్రిక అంకుర్‌ను ప్రారంభిస్తారు.
***
(रिलीज़ आईडी: 2014750)
आगंतुक पटल : 133