రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
సీఆర్‌ఐఎఫ్ పథకం కింద కర్ణాటకలో 295 రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల కోసం రూ.1385.60 కోట్లు మంజూరు చేసిన శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
14 MAR 2024 1:29PM by PIB Hyderabad
సీఆర్‌ఐఎఫ్ పథకం కింద, కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో 2055.62 కి.మీ. పొడవైన 295 రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల విస్తరణ & ఆధునికీకరణ కోసం 1385.60 కోట్లను కేటాయించినట్లు కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.
ఈ ప్రయత్నం వల్ల మౌలిక సదుపాయాలు కల్పన మాత్రమే కాకుండా, అనుసంధానత కూడా మెరుగుపడుతుందని, తద్వారా సామాజిక-ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందని శ్రీ గడ్కరీ వివరించారు.
***
(Release ID: 2014586)
Visitor Counter : 91