సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లో విజిలెన్స్ కమిషనర్‌గా శ్రీ ఏ ఎస్ రాజీవ్ నియమితులయ్యారు
Posted On:
11 MAR 2024 5:29PM by PIB Hyderabad
గౌరవ భారత రాష్ట్రపతి ఫిబ్రవరి 9, 2024 నాటి వారెంట్ ద్వారా మరియు సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ చట్టం, 2003లోని సెక్షన్ 4 (1) కింద లభించిన అధికారం ద్వారా శ్రీ ఏ ఎస్ రాజీవ్‌ను సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌లో విజిలెన్స్ కమిషనర్‌గా నియమించారు.
సీ వి సి చట్టం 2003లోని సెక్షన్ 5 (3)లో ఉన్న నిబంధనను అనుసరించి భారత రాష్ట్రపతిచే అధికారం పొందిన సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ ముందు శ్రీ ఏ ఎస్ రాజీవ్ 11 మార్చి 2024న విజిలెన్స్ కమీషనర్‌గా సభ్యత్వ ప్రమాణం చేసారు. శ్రీ అరవింద కుమార్, విజిలెన్స్ కమిషనర్ కూడా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
శ్రీ ఏ ఎస్ రాజీవ్ సిండికేట్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, విజయా బ్యాంక్ మరియు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నాలుగు బ్యాంకులలో 38 సంవత్సరాల అనుభవం ఉన్న కెరీర్ బ్యాంకర్. అతను ఇండియన్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలో, ఇండియన్ బ్యాంక్ అత్యల్ప నిరర్థక ఆస్తులు మరియు అత్యధిక మూలధన సమృద్ధి నిష్పత్తితో భారతదేశంలోని బలమైన మరియు అత్యంత లాభదాయకమైన బ్యాంకులలో ఒకటిగా అవతరించింది, .
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర యొక్క ఎం డీ & సీ ఈ ఓ గా గత 5 సంవత్సరాలలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆర్ బీ ఐ యొక్క సత్వర దిద్దుబాటు చర్య నుండి విజయవంతంగా ఆవిర్భవించింది మరియు చిన్న-పరిమాణ బ్యాంకు నుండి బలమైన మధ్యతరహా బ్యాంకుగా బ్యాంకింగ్ గా తదుపరి కక్ష్యలోకి ప్రవేశించింది. అన్ని ప్రధాన వ్యాపార మరియు లాభదాయకత పారామితులలో అత్యుత్తమ ఆస్తి నాణ్యతను కలిగి దేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచే పీ ఎస్ బీ గా బ్యాంక్ గా ఎదగటం లో ఆయన సమర్థవంత నాయకత్వ పాత్ర పోషించారు.
ఆయన ఎక్సిం బ్యాంక్, న్యూ ఇండియా అస్యూరెన్స్ కో లిమిటెడ్ మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో నామినీ డైరెక్టర్‌గా కూడా పనిచేశాడు. ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ అమలు కోసం ఆర్‌బిఐ ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ మరియు కోర్ గ్రూప్ మెంబర్‌గా కూడా ఉన్నారు.
ప్రమాణ స్వీకారోత్సవంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) మరియు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చట్టం, 2003, సెంట్రల్ విజిలెన్స్ కమీషనర్ మరియు ఇద్దరు విజిలెన్స్ కమిషనర్ల నియామకాన్ని అందిస్తుంది. విజిలెన్స్ కమీషనర్ పదవీ కాలం నాలుగు సంవత్సరాలు లేదా పదవిలో ఉన్న వ్యక్తికి 65 ఏళ్లు వచ్చే వరకు వుంటుంది.
***
(Release ID: 2013853)
Visitor Counter : 157