మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ
మార్చి 9 నుంచి 23 వరకు పోషణ్ పక్వాడా
పోషణ్ భి , పఢాయి భి, మంచి ఆహార అలవాట్లు, గర్భిణులు తీసుకోవలసిన పౌష్టికాహారం, వారి ఆరోగ్యం, ఐవైసిఎప్ విధానాలపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించే కార్యక్రమాలపై దృష్టి.
Posted On:
08 MAR 2024 8:37PM by PIB Hyderabad
పోషణ్ పక్వాడా 2024 కార్యక్రమాలు . మార్చి 9 , 2024 నుంచి మార్చి 23 వరకు ఏర్పాటవుతాయి. ఈ కింది ప్రధాన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు, కమ్యూనిటీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఎ) పోషణ్ భి, పడాయి భి(పిబిపిబి)ా ఈ కార్యక్రమం మెరుగైన శిశు సంరక్షణ అవగాహన(ఇసిసిఇ)కి సంబంధించినది.
బి) గిరిజన,సంప్రదాయ, ప్రాంతీయ, స్థానిక ఆహారపు అలవాట్లపై దృష్టిపెట్టి ,ఈ విషయమై ప్రజలను చైతన్యవంతులను చేస్తారు.
సి) గర్భిణుల ఆరోగ్యం, శిశువులు, బాలల ఆహారపు అలవాట్లు (ఐవైసిఎఫ్) పై దృష్టిపెడతారు.
ఈ కార్యక్రమాలకు తోడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భాగస్వామ్యం మంత్రిత్వశాఖలు, విభాగాలు అదనంగా ప్రజలకు పౌష్టికాహారంపై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడతాయి.ఇందులో మిషన్ లైఫ్( నీటి సద్వినియోగం, అంగన్ వాడీ కేంద్రాలలో వాననీటి సంరక్షణ),సుస్థిర ఆహార అలవాట్లు, చిరుధాన్యాల వినియోగం పై అవగాహన కల్పించడం,పోషణ్ వాటికలను ప్రోత్సహించడం, ఆయుష్ విధానాల ద్వారా ఆరోగ్యకర జీవన విధానాలను ప్రోత్సహించడం వంటివి చేపడతారు.
నీరు పారిశుధ్యం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, విరోచనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, రక్తహీనతకు సంబంధించి పరీక్షలు నిర్వహించడం, చికిత్స అందించడం, రక్తహీనత గురించి చర్చించి అవగాహన కల్పించడం, స్వస్థ బాలక్ స్పర్థ (ఎస్.బి.ఎస్)ను అంగన్ వాడి కేంద్రాలలో తమ పేర్లు నమోదు చేసుకున్న పిల్లలలో క్రమం తప్పకుండా వారి పురోగతిని సమీక్షించడం, ఆరోగ్య ప్రమాణాలకు సంబంధించి ఇతర అంశాలపై అవగాహన కల్పించడం, వంటి వాటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భాగస్వామ్య మంత్రిత్వశాఖలు, విభాగాలు పోషణ్ అభియాన్ కార్యక్రమం ప్రారంభమైనప్పటినుంచి చేపడుతున్నాయి.
2023 మార్చి ా ఏప్రిల్ మాసాలలో జరిగిన పోషణ్ పక్వాడాలో నాలుగు కోట్ల మందికి పైగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఇందులో ప్రధానంగా శ్రీ అన్న, పౌష్టికాహార పరిరక్షణకు చిరుధాన్యాలకు ప్రోత్సాహం,స్వస్థ బాలక్ స్పర్త (ఎస్‌బిఎస్), సక్షం అంగన్‌వాడీలను ప్రజలలోకి మరింతగా తీసుకెళ్లడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.
ఇప్పటివరకు, 5 పోషణ్ పక్వాడాలు, 6 పోషణ్ మాప్‌ాల ద్వారా 90 కోట్ల మందికి పైగా ప్రజలకు పౌష్టికాహారం ఇతర కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.ఇందులో వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, భాగస్వామ్య మంత్రిత్వశాఖలు, విభాగాలు పాల్గొన్నాయి.
సంక్షం అంగన్‌వాడి, మిషన్ పోషణ్ 2.0 ల ప్రధాన లక్ష్యం, వ్యక్తిగత, సమూహ స్థాయిలో పౌష్టికాహార సంబంధిత అలవాట్ల మార్పిడి వంటివాటిని ప్రచారం చేయడం. వ్యక్తిగత స్థాయిలో, కమ్యూనిటీ స్థాయిలో ప్రజలలో విస్తృత ప్రచారం నిర్వహించడం ద్వారా ఈ మార్పులను తీసుకువస్తారు. మంచి ఆరోగ్యవంతమైన తినే అలవాట్లను ప్రోత్సహించేందుకు పెద్ద ఎత్తున ప్రజలలో అవగాహన కల్పిస్తారు. ఇందుకు పోషన్ పక్వాడా, పోషణ్ మాప్‌ా పేరుతో ఏటా ప్రచార కార్యక్రమాన్ని చేపడతారు. పోషణ్‌అభియాన్ ను 2018లో ప్రారంభించారు.
***
(Release ID: 2013378)
Visitor Counter : 370